Nindu Noorella Saavasam Serial Today Episode: అనామిక బాడీలోంచి బయటకు వచ్చిన ఆరును తీసుకుని వెంటనే వచ్చేయమని యముడు గుప్తను హెచ్చరిస్తాడు. అలాగే ప్రభు అంటూ బాలిక సమయం మించి పోతుంది వెళ్తేదము రమ్ము అని పిలుస్తాడు. అనామిక లేచాక వెళ్దామని ఆరు అనామికిను పిలుస్తుంది. ఇంతలో అనామిక లేచి అటూ ఇటూ చూసి నేనేంటి ఇక్కడ ఉన్నాను. నేను అమర్ సార్ వాళ్ల ఇంట్లో కేర్ టేకర్ గా ఉండాలి కదా..? ఇక్కడ ఉన్నానేంటి..? ఇదేం ప్లేస్ ఇక్కడికి ఎలా వచ్చాను. నన్ను జాబ్‌లోంచి తీసేశారా ఏంటి..? నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి..? ఎక్కడికి వెళ్లాలి..? రమ్య ఇంటికి వెళ్లిపోవడం బెటర్ అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక. ఇంతలో గుప్త బాలిక ఆ బాలిక కూడా వెళ్లింది కదా మనము వెళ్దాం అని చెప్తాడు.
దీంతో ఆరు గుప్త గారు ఒక్కసారి మా ఇంటికి వెళ్దాం గుప్త గారు అంటుంది. దీంత వలదు బాలిక ప్రభువుల వారు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. మనం వెళ్లాలి పద వెళ్దాం అంటాడు. దీంతో ఆరు సరే గుప్త గారు వెళ్దాం పదండి అంటుంది. గుప్త కళ్లు మూసుకుని మంత్రం చదువుతాడు. ఆశ్చర్యంగా గుప్త ఒక్కడే వెళ్తాడు. ఆరు అటూ ఇటూ చూడగా గుప్త కనిపించడు. పైకి చూస్తే గుప్త ఒక్కడే వెళ్తుంటాడు. ఆరు పిలుస్తుంది. నువ్వెందుక అక్కడే ఉన్నావు అంటాడు గుప్త ఇంతలో యముడు వచ్చి కోపంగా విచిత్ర అంటూ పిలుస్తాడు. యముడి పిలుపునకు భయంతో వణికిపోయిన గుప్త ప్రభు యమపురి వచ్చుటకు ప్రయత్నించుచుంటిమి ఈ బాలిక రాలేకుండిచున్నది ఎందులకో తెలియుట లేదు. ఏమైంది ప్రభు ఎందుకు అంత ఆగ్రహంగా చూస్తున్నారు. మేము ఏ తప్పిదము చేయలేదే అంటుంటాడు.
కిందనుంచి ఆరు గుప్త గారు ఏదో ఒకటి మాట్లాడండి అసలు రాజు గారు ఏం చెప్తున్నారు అదైనా చెప్పండి అని అడుగుతుంది. దీంతో గుప్త ప్రభువులు మమ్మలను ఆగ్రహంగా చూస్తున్నారు. తప్పేమైనా జరిగిందా ప్రభు అంటూ గుప్త ఏడుస్తూ సత్యముగా నేనేమీ చేయలేదు ప్రభు అంటూ అడుగుతుంటే గుప్త మంత్ర చదివింది రివీల్ అవుతుంది. అదే టైంలో ఇంట్లో ఉన్న అంజు ప్లవర్స్ తీసుకుని ఆరు ఫోటో దగ్గరకు వెళ్తుంది. అమ్మా ఈ ప్లవర్స్ కోసం నువ్వు చాలా ట్రై చేశావంట కదా..? అందుకే నీ దగ్గరకు తీసుకొచ్చాను. అంటూ ఆ ప్లవర్స్ ఆరు ఫోటో దగ్గర పెడుతుంది. అదే విషయం యముడు గుప్తకు చెప్తాడు. ఆ పిల్లలు పెట్టిన ఆ పూలు జీవం కోల్పోయే వరకు ఆ ఆత్మను నువ్వు యమపురికి తీసుకురాలేవు అని చెప్తాడు. దీంతో గుప్త బాధగా ప్రభు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. ఆ పుష్పం జీవం కోల్పోవడానికి పద్దెనిమిది దినములు పడుతుంది అని చెప్పగానే గుప్త ఏడుస్తూ.. అంటే మళ్లీ పద్దెనిమిది దినములు మేము ఈ భూమలోకంలో ఉండాలా..? అంటూ కిందకు వస్తాడు. ఆరు ఎంత అడిగినా ఏమీ మట్లాడడు.. దీంతో ఆరు నా స్టే పొడిగించబడిందా గుప్త గారు అని అడుగుతుంది. అవునన్నట్టు గుప్త తల ఊపుతాడు. ఆరు హ్యాపీగా ఫీలవుతుంది.
తర్వాత ఇంట్లో మనోహరి, చిత్ర ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో మిస్సమ్మ వస్తుంది. మిస్సమ్మను చూసిన చిత్ర మను చూడు నిన్ను ఇంతలా టెన్షన్ పెట్టి ఎంత దర్జాగా వస్తుందో అని చెప్తుంది. మనో కోపంగా మిస్సమ్మను చూస్తుంది. ఇంతలో మిస్సమ్మ గడప దగ్గర కింద పడబోతుంటే ఎవరో పట్టుకుంటారు. చిత్ర ఆశ్చర్యంగా ఇదేంటి కింద పడకుండా.. పైకి లేవకుండా ఆలా గాల్లో ఉందేంటి..? భాగీని ఎవరో పట్టుకున్నట్టు అలా ఆగిపోయిందేంటి..? అంటుంది. మనోహరి షాకింగ్ గా పట్టుకున్నట్టు కాదే.. పట్టుకుంది అని చెప్తుంది. దీంతో చిత్ర పట్టుకుందా.? ఎవరు అని అడుగుతుంది. మనోహరి భయంగా ఆరు పట్టుకుంది అని చెప్తుంది. చిత్ర షాక్ అవుతుంది. మిస్సమ్మ వెనక్కి తిరిగి చూడగానే ఆరు కనిపిస్తుంది. అక్కా అని పిలుస్తుంది. ఇద్దరూ హగ్ చేసుకుంటారు. అంతా గమనిస్తున్న చిత్ర, మనోహరి షాక్ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?