Ravi Mohan – Kenishaa: గత కొద్ది రోజులుగా కోలీవుడ్లో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం ఏదైనా ఉంది అంటే అది జయం రవి(Jayam Ravi), కెనీషా ఫ్రాన్సిస్ (Kenishaa Francis), ఆర్తి (Arti)ల మ్యాటరే.. ఆర్తి-జయం రవిల మధ్య విభేదాలు సృష్టించి, ఇద్దరు విడిపోయేలా కెనీషా చేసిందని ఆర్తి ఆరోపిస్తోంది. జయం రవి మాత్రం ఇందులో మూడో వ్యక్తి ప్రమేయం లేదని, ఇది తన సొంత నిర్ణయమని చెబుతున్నారు. కెనీషా కూడా నిజానిజాలు త్వరలోనే బయటపడతాయంటూ ఆర్తి ఆరోపణలపై సంచలన పోస్టులు చేస్తోంది. దీంతో జయం రవి , ఆర్తి ల విడాకుల మ్యాటర్, కెనీషా చేసే పోస్టులు కోలీవుడ్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే రీసెంట్ గానే వీరికి కోర్ట్ వార్నింగ్ ఇవ్వడంతో గత కొద్ది రోజులుగా జయం రవి, ఆర్తిలు తమ సోషల్ మీడియా ఖాతాలో ఎలాంటి పర్సనల్ పోస్టులు పెట్టడం లేదు.
సింగర్ కెనీషా ప్రెగ్నెంట్..
అయితే తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సింగర్ కెనీషా ప్రెగ్నెంట్. జయం రవి – కెనీషాల గురించి జనాలు మర్చిపోతున్న తరుణంలో వెంటనే పెళ్లైనట్టు కొన్ని ఫొటోస్ చక్కర్లు కొట్టాయి. ఎందుకంటే ఆ ఫోటోలో వీరిద్దరూ పూలదండలు వేసుకోవడంతో అది నిజమేనని భావించారు. అయితే సడన్గా మరో ట్విస్ట్. అదేంటంటే..కెనీషా ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు చక్కర్లు కొట్టడంతో తాజాగా కెనీషా దీనిపై క్లారిటీ ఇచ్చింది.మరి కెనీషా ప్రెగ్నెన్సీ వార్తలపై ఏ విధంగా స్పందించిందో ఇప్పుడు చూద్దాం..
ప్రెగ్నెన్సీ వార్తలపై కెనీషా అదిరిపోయే కామెంట్..
సింగర్ కెనీషా తాజాగా గర్భవతి అనే వార్తలపై స్పందించింది. “గత కొద్ది రోజులుగా నేను ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి వార్తలు క్రియేట్ చేసే వారిని కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదు. అలాగే నేను ప్రెగ్నెంట్ ని కాదు. నాకు అందమైన సిక్స్ ప్యాక్ బాడీ మాత్రమే ఉంది. నిజాలు ఏంటో త్వరలోనే బయటపడతాయి. అప్పటివరకు బిర్యాని తిని ఇంట్లో ప్రశాంతంగా ఉండండి.నన్ను కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి” అంటూ తన ప్రెగ్నెన్సీ వార్తలు క్రియేట్ చేసేవారికి ఒక్క మాటతో ఇచ్చి పడేసింది.
జయం రవి వ్యక్తిగత జీవితం..
జయంరవి పర్సనల్ లైఫ్ కొస్తే.. 2009లో ఆర్తి ని పెళ్లి చేసుకున్న ఈయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక వీరి పెళ్ళై 16 సంవత్సరాలు అయినప్పటికీ వీరి మధ్య బంధం దాదాపు 20 సంవత్సరాల నుండి కొనసాగుతోందట. అయితే ఇన్నేళ్ల వీరి సంసార జీవితంలోకి కెనీషా ఎంట్రీ ఇవ్వడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంటున్నట్టు కోలీవుడ్ జనాలు మాట్లాడుకుంటున్నారు. అలా ఎప్పుడైతే జయం రవి విడాకులు తీసుకోబోతున్నట్టు చెప్పారో అప్పటినుండి ఆయనపై అలాగే సింగర్ కెనీషాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. చాలామంది సెలెబ్రిటీలు కూడా ఆర్తికే సపోర్ట్ చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా జయం రవి మనసు మార్చుకొని ఆర్తి దగ్గరికి వెళ్తారేమో చూడాలి.
also read:Akhanda 2 Teaser Reaction :ఒరేయ్ బుడ్డోడా.. అక్కడ ఉంది బూచోడు కాదు.. బాలయ్య తాతయ్యనే రా!