BigTV English

Sree Vishnu : ‘మస్త్ షెడ్స్ ఉన్నాయి రా’ డైరెక్టర్ తో శ్రీవిష్ణు.. ఈ టైంలో రిస్క్ అవసరమా?

Sree Vishnu : ‘మస్త్ షెడ్స్ ఉన్నాయి రా’ డైరెక్టర్ తో శ్రీవిష్ణు.. ఈ టైంలో రిస్క్ అవసరమా?

Sree Vishnu : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు హీరోలకు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఇప్పుడు హీరోగా బ్యాక్ టూ బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. గతేడాది స్వాగ్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన శ్రీవిష్ణు ఆ సినిమాతో మిక్స్డ్ టాక్ ని అందుకున్నాడు.. ఈ ఏడాది సింగిల్ మూవీ మరో సాలిడ్ హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు. థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో కూడా దుమ్ము దులిపేస్తుంది.. ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో అని ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే తాజాగా శ్రీ విష్ణు నెక్స్ట్ మూవీ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈయన ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు సమాచారం..


ఓటీటీలో ‘సింగిల్ ‘ కు సెన్సేషనల్ రెస్పాన్స్..

శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరో, హీరోయిన్లు గా నటించిన లేటెస్ట్ మూవీ సింగిల్..కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.. ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ సినిమా ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో ఇది కూడా టాప్ లో ఉండటం విశేషం.


ఫ్లాప్ డైరెక్టర్ కు శ్రీవిష్ణు ఛాన్స్.. ఫ్యాన్స్ లో టెన్షన్..

సింగిల్ మూవీ తర్వాత భారీ బడ్జెట్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో అని అందరు అనుకున్నారు. సక్సెస్ ఫుల్ చిత్రాలకు కేరాఫ్ గా మారిన ఈ హీరో రాజమౌళి లాంటి డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడేమో అని అనుకున్నారు. కానీ అస్సలు ఊహించని విధంగా ఓ ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన అభినవ్ గోమటం నటించిన ‘మస్త్ షెడ్స్ ఉన్నాయి రా’ డైరెక్టర్ తిరుపతి రావు ఇండ్ల తో నెక్స్ట్ మూవీకి సైన్ చేసినట్లు ఫిలిం నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు.. ఈ మూవీ గురించి త్వరలోనే ప్రకటన రాబోతుందని సమాచారం.. ఏది ఏమైన హీరోగా సక్సెస్ అయిన ఈయన ఇలా ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వడం పై ఆయన అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు..

Also Read: ప్రిజం పబ్‌లో వీరంగం.. హీరోయిన్ కల్పికకు గట్టి షాక్ ఇచ్చిన పోలీసులు… ఇక బయటకు రావడం కష్టమే ?

శ్రీవిష్ణు సినిమాలు.. 

శ్రీవిష్ణు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సామజవరగమన మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో హీరోగా శ్రీ విష్ణు సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ఓం బీమ్ బుష్ సినిమాతో భారీ విషయాన్ని అందుకున్న శ్రీ విష్ణు.. గత ఏడాది స్వాగ్ మూవీ తో ప్రేక్షకులను నిరాశపరచాడు. ఈ ఏడాది సింగిల్ మూవీతో మరో హిట్ మూవీని తన ఖాతాలో వేసుకున్నాడు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×