E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను బెదిరించిన బుజ్జమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode June 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్‌ను బెదిరించిన బుజ్జమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: షాపింగ్‌ మాల్‌ లో మిస్సమ్మకు ఒకడిని భర్తగా సెట్‌ చేసి మిస్సమ్మ పీడ విరగడి చేసుకోవాలని మనోహరి చేసిన ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ అవుతుంది. రణవీర్‌తో పంపించిన ఆ వ్యక్తిని అమర్‌ పిచ్చకొట్టుడు కొట్టి పంపిచేస్తాడు. దీంతో రణవీర్‌ భయంగా బయటకు పరుగెత్తుకుంటూ వెళ్లి కారులో కూర్చుని మనోహరికి విషయం చెప్తాడు. మనోహరి వెంటనే రణవీర్‌ను ధైర్యంగా ఉండమని ఎవ్వరూ చూడకుండా ఆ బుజ్జమ్మను కిడ్నాప్‌ చేయమని చెప్తుంది. అప్పుడు అమర్‌ తో మిస్సమ్మను బయటకు గెంటించే కార్యక్రమం నేను పూర్తి చేస్తాను అని చెప్తుంది. దీంతో రణవీర్ అలాగే అంటూ మాల్‌లోకి వెళ్తాడు.

షాపింగ్‌ మాల్‌లో బట్టలు చూస్తున్న బుజ్జమ్మకు అంజు, ఆనంద్, ఆకాష్‌ సెలెక్షన్‌ చేస్తుంటే.. బుజ్జమ్మ తన బట్టలు తాను సెలెక్షన్‌ చేసుకుంటానని వాళ్ల బట్టలు వాళ్లు సెలెక్షన్‌ చేసుకోమని  తనను ఫ్రీగా వదిలేయమని చెప్తుంది. దీంతో పిల్లలు ముగ్గురు తమ బట్టలు చూసుకునే పనిలో పడిపోతారు. ఎవరి సెలెక్షన్‌ వాళ్లు చేసుకుంటుంటారు. బుజ్జమ్మ కూడా తన కోసం వెరైటీ డ్రెస్సులు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడే షాపింగ్‌ మాల్‌ లోకి వెళ్లిన రణవీర్‌ బుజ్జమ్మను ఎత్తుకుని వెళ్లి కింద స్టోర్‌ రూంలో బంధిస్తాడు.

Advertisement

అంతా మాయా అద్దలో చూస్తున్న గుప్త, నారదుడు షాక్ అవుతారు. గుప్త భయంగా అదేంటి మహర్షి ఈ అమ్మాయిని కిడ్నాప్‌ చేసి ఏం చేయబోతున్నారు. అక్కడ బాల అరుంధతి ఊపిరి ఆడక చనిపోయే పరిస్థితుల్లో ఉంది..? ఇప్పుడు తనను ఎవరు రక్షిస్తారు.. జగన్నాథ నువ్వే ఆ బాల అరుంధతి బాలికను రక్షించాలి అంటూ ప్రార్థించగానే.. నారదుడు ఆ బాల అరుంధతిని రక్షించేది జగన్నాథుడు కాదు గుప్త.. ఆ బాలిక తనను తానే కాపాడుకుంటుంది అని చెప్తాడు. గుప్త ఆశ్చర్యంగా చూస్తుంటాడు.

మాల్‌లో ఉన్న అమర్‌, మిస్సమ్మకు బుజ్జమ్మ మిస్‌ అయిందన్న విషయం తెలిసి మాల్‌ మొత్తం వెతుకుతుంటారు.  మరోవైపు బుజ్జమ్మను బంధించిన దగ్గర రణవీర్‌ నిలబడి చూస్తుంటాడు. రణవీర్‌ చూస్తుండగానే.. బుజ్జమ్మకు కట్టిన కట్లు మొత్తం మాయం అయిపోతాయి. అది చూసిన రణవీర్‌ షాక్‌ అవుతాడు. మాయా అద్దంలో చూస్తున్న గుప్త ఆశ్చర్యపోతాడు. బుజ్జమ్మ లేచి రణవీర్‌ వైపు వెళ్తుంది. బుజ్జమ్మ నడుస్తుంటే.. రణవీర్‌కు అరుంధతి కనిపిస్తుంది. దీంతో రణవీర్‌ భయంగా వద్దు నన్నేం చేయోద్దు అంటూ భయంతో వణికిపోతుంటాడు.

Advertisement

కట్ చేస్తే.. మాల్‌లో బుజ్జమ్మ కోసం అంతా వెతికిన అమర్‌, మిస్సమ్మ బాధపడుతూ బుజ్జమ్మ కనిపించలేదని పోలీస్‌ కంప్లైట్‌ ఇద్దామని అనుకుంటుండగానే.. బుజ్జమ్మ నడుచుకుంటూ వస్తుంది. బుజ్జమ్మను చూసిన అమర్‌, మిస్సమ్మ ఊపిరి పీల్చుకుంటారు. ఎక్కడికి వెళ్లావు బుజ్జమ్మ అని అడిగితే తాను వాష్‌ రూంకు వెళ్లానని చెప్తుంది. బుజ్జమ్మ వెనకే వచ్చి చాటు నుంచి చూస్తున్న రణవీర్‌ మాత్రం షాక్‌ అవుతాడు. ఆనంద్‌, ఆకాష్‌, అంజు మాత్రం బుజ్జమ్మను ఇంక ఎక్కడికీ వెళ్లొద్దని తమ వెంటే ఉండమని చెప్తారు. బుజ్జమ్మ సరే అంటుంది. అయితే అమర్‌ మీరు బట్టలు మొత్తం తీసుకున్నారా అని అడగ్గానే.. పిల్లలు తీసుకున్నామని చెప్తారు. అయితే ఇంటికి వెళ్దాం పదండి అంటూ అందరినీ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అమర్‌. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×