BigTV English

Nindu Noorella Saavasam Serial Today May 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోల్‌ కతా వెళ్లిన అమర్‌ – నిజం చెప్పిన నన్‌

Nindu Noorella Saavasam Serial Today May 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కోల్‌ కతా వెళ్లిన అమర్‌ – నిజం చెప్పిన నన్‌

Nindu Noorella Saavasam Serial Today Episode :  మిస్సమ్మను ఆపినా ఆగకుండా వినోద్‌ ను పలకరించడానికి వెళ్తుంది. కంగారుగా అనామిక కూడా మిస్సమ్మ వెనకాలే పరుగెడుతుంది. మిస్సమ్మ డోర్‌ దగ్గరకు వెళ్లగానే.. మిస్సమ్మను చూసిన మనోహరి ఆరు ఫోటోకు అడ్డంగా నిలబడుతుంది. వెనకాలే వచ్చిన అనామిక అది చూసి ఊపిరి పీల్చుకుంటుంది. మిస్సమ్మ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నావు వినోద్ అని పలకరిస్తుంది. వినోద్‌ ముక్తసరిగా బాగానే ఉన్నాను అంటాడు. వినోద్‌ మాట తీరు తేడాగా ఉండటంలో మిస్సమ్మ అదోలా చూస్తుంది. మనోహరి కల్పించుకుని ఏంటి వినోద్‌ అలా పట్టిపట్టనట్టు మాట్లాడుతున్నావు. తను మీ వదినే కదా బాగా మాట్లాడు.. అంటుంది.


దీంతో వినోద్ నా వరకు నాకు ఒక్కరే వదిన ఉన్నారు. మీరు ఈ ఇంటి కోడలు.. మా అన్నయ్య భార్య అయ్యుండొచ్చు.. కానీ నా వరకు మీరు నాకు పరాయి వాళ్లే కాబట్టి మా వదిన స్థానాన్ని వేరొకరికి ఇవ్వలేను అంటూ వినోద్‌ వెళ్లిపోతాడు. మనోహరి వెటకారంగా ఏంటి బాగీ పాపం నువ్వేంటో ప్రేమగా పలకరించడానికి వస్తే తనేంటి అలా మాట్లాడిపోయాడు. నిన్ను చూస్తుంటే.. బాధేస్తుంది.. ఏమిటో అమర్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనఃశాంతి లేకుండా పోతుంది. ఫస్ట్‌ అమర్‌,తర్వాత పిల్లలు అందరినీ నీ వైపు తిప్పుకున్నావు.. ఇంతలో వినోద్‌ వచ్చి కథ మొత్తం మొదటికి తీసుకెళ్లాడు.. అంటుంది. దీంతో మిస్సమ్మ ఏంటి మను వినోద్‌ బాధను అవకాశంగా తీసుకుందామనుకుంటున్నావా..? ఆయన నీ మాట వినాలి అంటే నువ్వు మోసం చేయాలి. కానీ నేను నాలా ఉంటే చాలు నన్ను ఇష్టపడతారు.. అర్థం చేసుకుంటారు. అయినా నువ్వు బాధపడాల్సింది నా గురించి కాదు. నీ గురించి నీకు అర్థం అవుతుందో లేదో అబద్దాలతో నువ్వు కట్టిన కోట కూలిపోతుంది. నీ నిజ స్వరూపం ఆయనకు తెలిసిపోతుంది. జాగ్రత్త.. అంటూ హెచ్చరించి వెళ్లిపోతుంది మిస్సమ్మ.

అమర్‌ బట్టలు సర్దుకుంటుంటే రాథోడ్‌ వచ్చి సార్‌ ఫ్లైట్ కు టైం అవుతుంది. అని చెప్తాడు. రెండు నిమిషాలు రాథోడ్‌.. ఇంట్లో ఎవరు అడిగినా మనం ఢిల్లీ వెళ్తున్నాం అని చెప్పు.. గుర్తుంది కదా అంటాడు. గుర్తింది సార్ అంటూ సూట్‌కేసు తీసుకుని వెళ్లిపోతాడు రాథోడ్‌. కిందకు వచ్చిన రాథోడ్ ను చూసి నిర్మల రాథోడ్‌ ఈ లగేజీ ఎక్కడిది.. అని అడుగుతుంది. రాథోడ్‌ సార్‌ ది మేడం అని చెప్తాడు. ఆశ్చర్యంగా శివరాం.. అమర్‌ దా..? ఎక్కడికైనా వెళ్తున్నాడా..? అని అడుగుతాడు. నిర్మల కూడా ఇంత సడెన్‌గా ప్రయాణం ఏంటి రాథోడ్‌ ఎక్కడికి వెళ్తున్నాడు అని అడుగుతుంది. రాథోడ్‌ ఏమో నాకు తెలియదు మేడం అని చెప్తాడు.  ఇంతలో అమర్‌ రాగానే.. శివరాం దగ్గరకు వెళ్లి అమర్ ఏంటి ఎక్కడికో వెళ్తున్నావు అంట ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. దీంతో చిన్న పనుంది నాన్న రేపు ఈవినింగ్‌కు వచ్చేస్తాను అని అమర్‌ చెప్తాడు.


దీంతో మనోహరి భయంగా పొద్దున్నే నా గురించి అడిగాడు. ఇప్పుడు ఊరు వెళ్తున్నాను అంటున్నాడు నా గతాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడా..? అమర్‌ను అనుమానం దగ్గరే ఆపేయాలి.. ఆధారాల దాకా వెళ్లనివ్వకూడదు అని మనోహరి మనుసులో అనుకుంటుంది. ఇంతలో శివరాం  రేపు ఈవెనింగ్‌ వస్తావా..? ఏ ఊరికి వెళ్తున్నావు అమర్‌ అని అడగ్గానే.. అమర్ ఢిల్లీ నాన్నా చిన్న మీటింగ్‌ ఉంది అని చెప్తాడు. మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. మిస్సమ్మ మాత్రం అదేంటండి వినోద్‌ ఇప్పుడే వచ్చారు..మీరేమో ఢిల్లీ వెళ్తున్నారు. మీటింగ్‌ రెండు రోజులు పోస్ట్‌ పోన్‌ చేయకూడదా..? అని అడుగుతుంది.  లేదు భాగీ వెంటనే వెళ్లాలి ఇప్పటికే చాలా లేట్‌ అయింది అని అమర్‌ చెప్పగానే.. వినోద్‌ ఏమైంది అన్నయ్యా ఏదైనా కొత్త అసైన్‌మెంట్‌ ఇచ్చారా..? అని అడుగుతాడు.

దీంతో అమర్‌ అసైన్‌మెంట్‌ లాంటిదే వినోద్‌ కాకపోతే కొత్తగా మళ్లీ మొదలు పెడుతున్నాను. కొన్నేళ్ల ముందు మొదలు పెట్టి కొన్ని కారణల వల్ల ఆపేశాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే.. నా చుట్టు ఉన్న చాలా సమస్యలకు సమాధానం ఆ అసైన్‌ మెంట్‌ను ఫినిష్‌ చేస్తే సాల్వ్‌ అవుతాయని నమ్ముతున్నాను అందుకుఏ అర్జెంట్‌గా వెళ్తున్నాను అని అమర్‌ చెప్పగానే.. మిస్సమ్మ దగ్గరకు వెళ్లి ఏవండి మీరు చెప్తుంటే అదేదో చాలా ప్రమాదకరంగా అనిపిస్తుందండి.. మీరు తప్పకుండా వెళ్లాలా..? అని అడుగుతుంది. దీంతో అమర్‌ నాకు ముఖ్యమైనవి కాపాడుకోవాలి అనుకుంటే నేను కచ్చితంగా వెళ్లాలి భాగీ. ఇప్పుడు కూడా నేను వెళ్లకుంటే.. అసైన్‌మెంట్‌ కంప్లీట్‌ చేయకుంటే ఇక ఎప్పటికీ నా మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం దొరకదు నాకేం కాదు అని చెప్పి అమర్‌ వెళ్లిపోతాడు.

కొల్‌కతా వెళ్లిన అమర్‌ అక్కడ మనోహరి గురించి ఎక్వైరీ చేస్తాడు. అక్కడి మథర్‌ థెరిస్సా అనాథ ఆశ్రమానికి వెళ్లి మనోహరి గురించి అడుగుతాడు. అక్కడి ఆశ్రమ నిర్వాహకురాలు మనోహరి గురించి తను వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలు మొత్తం చెప్తుంది. అలాగే రణవీర్‌ను పెళ్లి చేసుకున్న విషయం కూడా చెప్తుంది. దీంతో అమర్‌ అశ్రమం నుంచి నేరుగా రణవీర్‌ ఇంటికి వెళ్తాడు. అమర్‌ ను చూసిన రణవీర్ షాక్‌ అవుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ గొడవ.. సాగర్, నర్మద సరసాలు.. శ్రీవల్లికి టెన్షన్..

Brahmamudi Serial Today August 7th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ఆచూకి తెలిసిందన్న కావ్య – ఆనందంలో  నిజం చెప్పబోయిన కళావతి

Nindu Noorella Saavasam Serial Today August 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చంభాకు దొరికిపోయిన ఆరు

Anchor Ravi: ఆ స్వామీజీతో కలిసి నాపై చేతబడి చేయించారు.. యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్!

Intinti Ramayanam Today Episode: తల్లికి మాటిచ్చిన అక్షయ్.. అవనిని మోసం చేసిన ప్రణతి..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ముగ్గుతో షాక్.. మనోజ్, రోహిణికి బాలు దిమ్మతిరిగే షాక్.. సంజూకు సర్ ప్రైజ్..

Big Stories

×