Tirumala News: తిరుమలలో శ్రీహరిని కళ్లారా చూడాలని కోరుకుంటారు భక్తులు. కాకపోతే ఆ భాగ్యం కొందరికి మాత్రమే లభిస్తుంది. చాలామంది తిరుమల వెళ్తే పాపాలు పోతాయని చెబుతుంటారు. కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రం యువతకు ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనం అవకాశాన్ని కల్పిస్తుంది. మామూలు దర్శనమే లభించదు.. అలాంటిది వీఐపీ బ్రేక్ దర్శనా? ఇదేదో కొత్తగా ఉందికదూ? ఆ డీటేల్స్‌లోకి లోతుగా వెళ్దాం.స
యువతకు టీటీడీ స్పెషల్ ఆఫర్
తిరుమలలో అడుగుపెట్టామంటే చాలు ఏడు కొండలు గోవింద.. గోవింద అనే నామస్మరణతో మార్మోగుతుంటాయి. అంత పవిత్రమైనది తిరుమల. ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకుంటే కొంతలో కొంతైనా పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా భక్తులు తిరుమలకు వస్తుంటారు.
భక్తుల కోసం టీటీడీ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 25 ఏళ్ల యువత కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమానికి రెండేళ్ల కిందట మొదలుపెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే యువతలో ఆధ్యాత్మిక భావనలు పెంచడానికి, సనాతన ధర్మంపై ఆసక్తి కలిగించడానికి రూపొందించిన కార్యక్రమం అన్నమాట. ఈ కార్యక్రమం ప్రత్యేక ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
గోవింద అని కోటి రాసిన యువతకు వీఐపీ దర్శనం కల్పిస్తోంది. 25 ఏళ్లలోపు యువత 10 లక్షల 1,116 సార్లు గోవింద నామం అని పేపర్ మీద రాయాలి. అలా చేస్తేవారికి ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకునే మహాభాగ్యం కలుగుతుంది. అదే కోటి సార్లు రాస్తే కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది. అంతా ఉచితం, ఒక్కరూపాయి ఎవరికీ కట్టాల్సిన పని లేదు.
ALSO READ: కోట్లాది మందిని మోసం చేసింది.. కోర్టుకి ఈడుస్తా
ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనం
ఇక్కడ ఎలాంటి తప్పు చేయడానికి ఆస్కార్ ఉండదు. గోవింద అని నియమ నిష్టలతో రాస్తే అనుకోకుండా పూర్తి అవుతుంది. గోవింద కోటి నామాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ. టీటీడీ సమాచార కేంద్రాలు, పుస్తకాల షాపులు లేదంటే ఆన్‌లైన్‌లో ఆయా పుస్తకాలు లభిస్తాయి. ఒక పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి. ఒక్కో పుస్తకంలో 39,600 నామాలు రాసుకునే వీలుంది.
ఇలా 10 లక్షల 1,116 నామాలు రాయాలంటే దాదాపు 26 పుస్తకాలు అవసరం అవుతాయి. అదే కోటి నామాలు రాయడానికి తక్కువలో తక్కువ కనీసం మూడేళ్లు పడుతుందన్నది టీటీడీ ఓ అంచనా. పూర్తి చేసిన గోవింద నామాల పుస్తకాన్ని తిరుమలలోని టీటీడీ పేష్కార్ ఆఫీసులో అందజేయాలి. మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేస్తారు. ఈ విషయాన్ని పేష్కార్ నిర్వాహకులు వెల్లడించారు.
ఈ కార్యక్రమం రూపొందిన తర్వాత ముగ్గురు మాత్రమే యువతీ యువకులు ఉచితంగా వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగింది. గతేడాది కర్ణాటకకు చెందిన కీర్తన తొలిసారి ఈ పుస్తకాన్ని పూర్తి చేసింది. ఆమె 10 లక్షల 1,116 సార్లు గోవింద నామం రాసింది. ఆపై టీటీడీకి అందజేయడంతో వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది.
ఆ తర్వాత మరో ఇద్దరు యువకులు గోవింద కోటి నామాలు రాసి వీఐపీ బ్రేక్ దర్శనం పొందారని చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఇలాంటి అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని కోరుతోంది. సో.. యువతకు ఇదే సరైన అవకాశం అన్నమాట.