E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 2nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కోసం భూమ్మీదకు వచ్చిన నారదుడు, గుప్త

Nindu Noorella Saavasam Serial Today Episode May 2nd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కోసం భూమ్మీదకు వచ్చిన నారదుడు, గుప్త
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: కొడైకెనాల్‌ వెళ్లిన అమర్‌ తాను ఉన్న ఇంటిని ఆరుతో గడిపిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గుప్త వస్తాడు. అమర్‌ను చూసి ఎమోషనల్‌ అవుతాడు. అమరేంద్రుడు తన పూర్వపు నివాసమునకు వచ్చెను. పాపం అరుంధతి బాలికకు సంబంధించిన గత స్మృతులు అతన్ని వెంటాడుచున్నట్టు ఉన్నవి. అమరేంద్రకు అరుంధతి బాలిక లేని లోటును ఎవ్వరూ పూడ్చలేరు. అని మనసులో అనుకుంటుండగానే.. అక్కడికి నారదుడు వస్తాడు. నారదుడిని చూసిన గుప్త షాక్‌ అవుతాడు.

ఈ సమయమున నారద మహర్షి వచ్చుచుండెను ఏమిటి అని భయపడుతుంటాడు. నారదడు దగ్గరకు వస్తాడు. నారద మహర్షులకు ప్రణామములు అని చెప్పగానే.. ప్రణామములు విచిత్రగుప్త అంతా కుశలమేనా అని అడగ్గానే.. తమరు వచ్చినాక ఎవరు కుశలముగా ఉండెదరు అని మనసులో అనుకుంటుంటే.. ఏమిటి గుప్త నీలో నీవే ఏమో సంభాషించుకుంటివి అని అడుగుతాడు నారదుడు. దీంతో ఏమీ లేదు మహర్షి తమరుండగా మా సుఖసంతోషములకు కొరత ఏమి ఉండును అని అనబోతుంటిని తమరు అడ్డు పడుచుంటిరి అని గుప్త చెప్తుండగానే.. నారదుడు అనుమానంగా అవును నీవు ఈ మధ్య తరచుగా అ భూలోకమందే సంచరించుచుంటివి ఏమైనా కార్యము ఉన్నదా అని అడగ్గానే.. వచ్చిన వెంటనే ఆరాలు మొదలు పెట్టితిరా అని మనసులో అనుకుంటూ.. ఏ కార్యము లేదు మహర్షి ఆ బాలకుణ్ని చూచుటకు వచ్చితిని అని గుప్త చెప్పగానే..

Advertisement

నారదుడు  ఆ బాలకుడు ఏదో కార్యార్థమై ఇక్కడకు వచ్చినట్టు ఉన్నాడు అని నారదుడు చెప్పగానే.. త్రిలోకా సంచారులు తమకు తెలియని విషయమా స్వామి అనగానే.. నారదుడు తన ధర్మపత్ని మరణ రహస్యం కనుగొనుటకై వచ్చునని మాకు అనిపించుచున్నది అని చెప్పగానే.. గుప్త ప్రతి సంవత్సరం అది కనుగొనుటకే వచ్చుచున్నాడు. ఈ సంవత్సరం అయిననూ తెలియునా స్వామి అని అడగ్గానే.. నారదుడు… మమ్ములను అడుగుతావేంటి..? విచిత్రగుప్త అక్కడకేదో నీకేమీ తెలియనట్టు అనగానే.. మాకు కొంతనే తెలియును కదా స్వామి తమకైతే సర్వము తెలియును కదా అంటాడు గుప్త. నారదుడు మాత్రం విధాత తలపు ఎట్లుండునో ఎవ్వరమూ గ్రహించలేము విచిత్రగుప్త వేచి చూడుము ఏమి జరుగునో అంటాడు నారదుడు.

అమర్‌ మాత్రం ఇంట్లోకి చూస్తూ.. కొద్ది సేపు అలాగే ఉండి అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతాడు. వెనకే వచ్చిన మనోహరి అమర్‌ను ఫాలో అవుతుంది. నారదుడు, గుప్త కూడా ఫాలో అవుతుంటారు. గుప్త మనోహరిని చూసి షాక్‌ అవుతాడు. మహర్షి ఆ దుష్ట బాలిక కూడా వచ్చిందేమిటి అని అడగ్గానే.. ఆ దుష్ట బాలిక గురించే తెలుసుకొనుటకే కదా అతను వచ్చినది.. అని చెప్పగానే.. గుప్త కోపంగా ఈ బాలిక ప్రతిసారి తప్పించుకొనుచున్నది మహర్షి అనగానే.. నారదుడు ఈ సారి విధి మరోలా సంకల్పించినది అని చెప్పగానే.. గుప్త అనిన అమరేంద్రకు నిజం తెలియునా మహర్షి అంటూ అడగ్గానే.. నారదుడు తెలియును కానీ కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి అని చెప్పగానే.. గుప్త ఈ సంఘటనలు ఏమీ స్వామి అని అడగ్గానే.. నారదుడు నన్నడుగుట ఏలా నువ్వే వీక్షించుము అంటాడు.

Advertisement

అమర్‌ కారులో వెళ్తుంటే.. డ్రైవర్‌ ఎక్కడికి వెళ్లాలి సార్‌ అని అడగ్గానే.. అమర్‌ టెంపుల్‌కు వెళ్లే దారిలో ఒక మైలు రాయి ఉంటుంది. అక్కడికి తీసుకెళ్లు అని చెప్పగానే.. డ్రైవర్‌ అలాగే సార్‌ అంటాడు. వెనక మనోహరి ఫాలో అవుతుంది. డ్రైవర్‌ కారు ఆపగానే.. అమర్‌ దిగి చూట్టూ చూస్తూ ఎమోషనల్‌ అవుతుంటాడు. వెనకాలే వచ్చిన మనోహరి మాత్రం ఇల్లు తర్వాత నువ్వు ఇక్కడికే వస్తావని నాకు తెలుసు అమర్‌. నీకోసం అరుంధతిని చంపించింది. నేను గెలిచింది ఇక్కడే.. అనుకుంటుంది.

అమర్‌ మాత్రం అరుంధతిని గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు. నా సగం ఊపిరిని ఇక్కడే పోగొట్టుకున్నాను. నువ్వు నాకు దూరం అయింది ఇక్కడే ఆరు. నీ శ్వాస ఈ గాలిలో కలిపిసోయింది. నా జీవితం అంతా వెతికిన అప్పుడు పోగొట్టుకున్న నీ శ్వాసను ఎప్పటికీ  దక్కించుకోలేను. నువ్వు మిగిల్చన జ్ఞాపకాలు. పిల్లలు తొడుగా లేకపోతే నేను కూడా ఈ గాలిలో కలిసిపోయేవాడిని.. అంటూ అమర్‌ ఎమోషనల్‌ అవుతుంటాడు. వెనక నుంచి మనోహరి, పై నుంచి   నారదుడు, గుప్త చూస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Big Stories

Advertisement
×