E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఐసీయూలో అమర్ ను చూసి షాకైన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode May 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఐసీయూలో అమర్ ను చూసి షాకైన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రాథోడ్ తో కలిసి కొడైకెనాల్‌ లో హాస్పిటల్‌కు వెళ్లిన మిస్సమ్మ ఐసీయూలో ఉన్న అమర్ ను చూసి బోరున ఏడుస్తుంటుంది. రాథోడ్‌ ఏడుస్తుంటాడు. అప్పుడే అక్కడ ఉన్న డాక్టర్‌ ఎవరీవిడ అని అడుగుతాడు. రాథోడ్‌ అమర్‌ సార్‌ వైఫ్‌ అని చెప్తాడు. మిస్సమ్మ ఏడుస్తూనే.. చిన్న యాక్సిడెంట్‌ అని చెప్పావు కదా రాథోడ్‌.. ఏవండి మీకేమైంది అండి.. కళ్లు తెరవండి.. నాతో మాట్లాడండి.. డాక్టర్‌ ఆయనకు ఏమీ కాదు కదా డాక్టర్‌.. ఆయన సేఫ్ గా బయటపడతారు కదా… అని అడగ్గానే.. డాక్టర్‌ సివియర్‌ ఇంజ్యూర్‌ అయింది మేడం. ఇంటర్నల్‌ బీడింగ్‌ అవుతుంది. వెంటనే సర్జరీ చేయాలి. సిస్టర్‌ ఆ ఫామ్‌ ఇటువ్వు.. మేడం ఈ ఫామ్‌ మీద సంతకం చేయండి.. అని చెప్పగానే.. మిస్సమ్మ ఎందుకు అంటూ అడగ్గానే.. రాథోడ్‌ సర్జరీ కి ముందు ఫార్మాలిటీ మిస్సమ్మ.. సంతకం చేయ్‌ అని చెప్పగానే.

డాక్టర్‌.. మేడం మీకు అసలు విషయం చెప్పాలి. చేయబోయే సర్జరీ చాలా రిస్క్‌ తో కూడుకున్నది. కొంచెం అటు ఇటూ అయినా పేషెంట్ బ్రెయిన్‌ డెడ్‌ అయి కోమాలోకి పోవచ్చు. లేదా ప్రాణాలు పోయినా పోవచ్చు అంటూ డాక్టర్‌ చెప్పగానే.. మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఏం అంటున్నారు డాక్టర్‌ అనగానే… డాక్టర్‌ సారీ మేడం మేము మీకు ముందే చెప్పాలి కాబట్టి చెప్తున్నాము.. పేషెంట్‌ కండీషన్‌ చాలా సీరియస్‌గా ఉంది అనగానే.. మిస్సమ్మ ఏడుస్తూనే.. ఆయనకు ఏం కాకూడదు.. ఆయనకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను.. ఏమైనా.. అయితే.. అంటూ చెప్తుంటే.. డాక్టర్‌ మా ప్రయత్నం మేము చేస్తాము మేడం.. అంటాడు. ఏవండి నాకు భయం వేస్తుంది అండి.. మీకు ఏమీ కాకూడదండి.. అంటూ ఏడుస్తుంది. రాథోడ్‌ కూడా ఏడుస్తూ.. మిస్సమ్మ సార్‌కు ఏమీ కాదు సైన్‌ చేయ్ మిస్సమ్మ అని చెప్పగానే.. డాక్టర్‌ కూడా త్వరగా సైన్‌ చేయండి మేడం లేట్‌ అయిందంటే మరీ డేంజర్‌ అంటూ చెప్పగానే..

Advertisement

మిస్సమ్మ సైన్‌ చేయబోతూ.. అమర్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఏడుస్తూ.. తాళి తీసుకుని కళ్లకు అద్దుకుని సంతకం చేస్తుంది. ఏడుస్తూనే.. డాక్టర్‌ ఆయనకు ఏం కాకూడదు.. ఫ్లీజ్‌ ఎలాగైనా ఆయనను బతికించండి డాక్టర్‌ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. డాక్టర్‌ ష్యూర్‌ మేడం మా ప్రయత్నం మేము చేస్తాము.. సిస్టర్‌ వెంటనే పెషెంట్‌ను ఆపరేషన్‌ థియేటర్‌కు షిప్ట్‌ చేయండి అంటూ డాక్టర్‌ వెళ్లిపోతాడు. మిస్సమ్మ, రాథోడ్‌ బయటకు వస్తారు. మిస్సమ్మ ఏడుస్తూనే ఉంటుంది. రాథోడ్‌ మిస్సమ్మ ఏడవకండి సార్‌కు ఏమీ కాదు.. మీరు ధైర్యంగా ఉండండి.. సారుకు ఈ యాక్సిడెంట్‌ ఎలా అయింది ఎస్సై గారు.. అని అడగ్గానే.. ఎస్సై ఎవరో వాంటెడ్‌గా చేశారు సార్‌. ఇది పక్కా హత్యా ప్రయత్నం అని చెప్పగానే.. మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఏమంటున్నారు ఎస్సై గారు అని అడగ్గానే.. ఎస్సై అవును మేడం అని చెప్పగానే.. రాథోడ్‌ మా సారు ఆరు మేడం సంవత్సరీకానికి కదా వచ్చారు అనగానే..

ఎస్సై తెలుసు సార్‌ అమరేంద్ర గారే చెప్పారు. అరుందతి గారి మర్డర్‌ మిస్టరీ గురించి తెలుసుకోవాలనుకున్నారు. నాకు తెలిసిన విషయాలు చెప్పాను. అనగానే.. రాథోడ్ మీకు తెలిసిన విషయాలు అంటే అని అడగ్గానే.. అదే అరుంధతి గారి హత్య వెనక ఆమె స్నేహితురాలు మనోహరి పాత్ర గురించి అరుందతి గారి హత్యతో మనోహరి గారి ప్రమేయం ఉందన్న విషయం మా ఎంక్వైరీలో తేలింది. అమరేంద్ర గారితో ఆ విషయం చెప్తానంటే ఆరోజు మీరు వద్దన్నారు కదా మేడం ఆదే విషయం చెప్పాను. ఆ తర్వాత అమరేంద్ర గారు ఇంకో ఎంక్వైరీ చేశారు. అప్పుడే ఈ యాక్సిడెంట్‌ జరిగింది. కావాలని ఆయనను చంపాలనుకున్నారు మీకు ఎవరిమీదైనా అనుమానం ఉందా..? నాకు అయితే ఇది కూడా ఆ మనోహరే చేయించింది అనిపించింది..కానీ ఎవిడెన్స్‌ లేదు అనగానే..

Advertisement

రాథోడ్ కోపంగా కచ్చితంగా ఇది ఆ మనోహరే చేయించి ఉంటుంది మిస్సమ్మ.. తన గురించి నిజం బయట పడేసరికి సార్‌నే చంపాలి అనుకుంది. ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంది అంటూ చెప్తుండగానే.. మనోహరి కారు దిగి లోపలి వెళ్లి ఐసీయూ దగ్గర నిలబడి ఏడుస్తూ.. అయ్యో అమర్‌ నీకు ఇలా అయిందేంటి అమర్‌..ఎవరు చేశారు ఇలా.. అంటూ ఏడుస్తుంటే.. రాథోడ్‌ కోపంగా చూస్తూ.. అంతా తనే చేసి మళ్లీ ఎలా ఏడుస్తుందో చూశావా మిస్సమ్మ అంటూ తిడుతుంటాడు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×