Nindu Noorella Saavasam Serial Today Episode : నిర్మల చేసిన టిఫిన్ నచ్చక పిల్లలు బయట టిఫిన్ చేయాలనుకుంటారు. అందుకోసం ప్లాన్ చేసి మరీ స్కూల్‌కు రాథోడ్ తీసుకెళ్లేలా చేస్తారు. రాథోడ్ కారులో పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్తుంటే.. మధ్యలో మంచి టిఫిన్ సెంటర్ దగ్గర ఆపమని పిల్లలు అడుగుతారు. రాథోడ్ ఆపనని చెప్పడంతో పిల్లలు రాథోడ్ ను బ్లాక్ మెయిల్ చేస్తారు. సాయంత్ర డాడీ లేని టైంలో నువ్వు ఏం చేస్తున్నావో మాకు తెలుసని డాడీకి చెప్తామని చెప్పడంతో రాథోడ్ భయపడినట్టు నటించి సరే మంచి టిఫిన్ సెంటర్ దగ్గర ఆపేస్తాను అంటాడు. పిల్లలు సరేనని కారు ఎక్కుతారు. రాథోడ్ నేరుగా స్కూల్ కు తీసుకెళ్లి వదిలేస్తాడు.
పిల్లలు అందరూ రాథోడ్ ను తిడతారు. మధ్యలో ఎందుకు ఆపలేదని బాధపడతాడరు. నేను చెప్పానా.. స్కూల్ వచ్చే వరకు ఈ రాథోడ్ కారు అపడని.. నేను ముందే చెప్పానా.. అంటూ అంజు అరుస్తుంది. అమ్ము కూడా రాథోడ్ నువ్వు ఇంత మోసం చేస్తావు అనుకోలేదు. నీవల్ల ఇవాళ మేము అంతా ఆకలితో ఉండాలి అంటుంది. దీంతో రాథోడ్ భాదపడినట్టు నటిస్తూ.. పిల్లలు ఆగండి.. మిస్సమ్మ ఉండగా మిమ్మల్ని ఆకలితో ఉండనిస్తుందా..? అదే నేను ఉండగా మిమ్మల్ని ఆకలితో ఉండనిస్తానా..? మీరు లోపలికి వెళ్లి క్లాస్ రూంలో బ్యాగ్స్ పెట్టే లోపు నేను టిఫిన్ పార్శిల్ తీసుకుని వస్తాను అని చెప్తాడు. దీంతో అనంద్ నువ్వు కనక టైం కి రాకపోతే.. వెళ్లేటప్పుడు మేము నలుగురం కలిసి నాలుగు లాంగ్వేజ్ ల్లో ఒక్కటే సినిమా చూపిస్తాము అంటాడు.
సరేనని పిల్లలు ఎవరికి ఏం ఏం కావాలో చెప్పేలోపే వినకుండా కారేసుకుని వెళ్లిపోతాడు రాథోడ్. వెళ్తూ గేటు దగ్గర ఉన్న రామ్మూర్తికి సైగ చేస్తాడు. రామ్మూర్తి వెంటనే లోపలికి వెళ్లి టిఫిన్ బాక్సులు ఒక టేబుల మీద పెల్లి ఓపెన్ చేయడానికి రావడం లేదేంటి అని బాధపడుతుంటాడు. రామ్మూర్తిని చూసి అమ్మూ వచ్చి నేను తీసిస్తాను ఇవ్వు తాతయ్య అని అడుగుతుంది. టిఫిన్ బాక్స్ ఇవ్వగానే అమ్ము ఓపెన్ చేసి అందులో వెజిటేబుల్ ఉప్మా చూసి అలాగే చూస్తుండి పోతుంది. ఇంతలో అంజు కోపంగా అమ్ము మూత తీశావు కదా ఇవ్వు మనం వెళ్దాం అంటుంది. రామ్మూర్తి అది ఒక్కటే కాదమ్మా.. ఇంకా ఉన్నాయి ఇవి కూడా తీయండి అని మిగతా ముగ్గురికి మూడు బాక్సులు ఇస్తాడు రామ్మూర్తి.
అవి ఓపెన్ చేసి తన ఫేవరెట్ టిఫిన్స్ ఉన్నాయని పిల్లలు అలాగే చూస్తుంటారు. అంజు మాత్రం ఇప్పుడు ఈ టిఫిన్స్ కు లొంగిపోయి మనం మన లక్ష్యాన్ని మరిచిపోకూడదు అంటుంది. అంజు మాట్లాడుతుండగానే పిల్లలు ముగ్గురు వెనక్కి వెళ్లి బెంచీ మీద కూర్చుని టిఫిన్ తింటుంటారు. అంజు వెనక్కి తిరిగి చూసి ఓరేయ్ నేను మాట్లాడుతుండగానే మీరు మెదలుపెట్టేశారేంటి అని అడుగుతూ తాను బెండీ మీద కూర్చుని టిఫిన్ తింటుంది. చాటు నుంచి చూసిన రాథోడ్ హ్యాపీగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
పిల్లలు టిఫిన్ చేశార రామ్మూర్తి, మిస్సమ్మకు ఫోన్ చేస్తాడు. రామ్మూర్తి ఫోన్ కోసమే ఎదురుచూస్తున్న మిస్సమ్మ.. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న పిల్లలు తిన్నారా…? టిఫిన్స్ నచ్చాయన్నారా..? వాళ్లు ఎలా ఉన్నారు. రాత్రి బాగా పడుకున్నారటనా…? అని అడుగుతుంది మిస్సమ్మ. అమ్మా భాగీ నీ పిల్లలు చాలా బాగా ఉన్నారమ్మ. కడుపునిండా మనఃస్పూర్తిగా తిన్నారు. నీ లాగే వాళ్లు కూడా చాలా బెంగ పెట్టుకున్నారు అమ్మ. బయటకు చెప్పలేకపోతున్నారు కానీ ముఖంలో కనిపిస్తున్నాయి. అమ్మా.. నీ పిల్లలు తినేశారు అమ్మా.. నువ్వు రాత్రి కూడా తినలేదు. ఇప్పుడైనా తిను తల్లి అని రామ్మూర్తి చెప్పగానే మిస్సమ్మ సరే నాన్నా తింటాను అని ఫోన్ కట్ చేస్తుంది.
రాత్రంతా అమర్ గార్డెన్ లో కూర్చుని మిస్సమ్మ గురించి ఆలోచిస్తుంటాడు. మిస్సమ్మ ఇంటి వచ్చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది ఎం చేసింది గుర్తు చేసుకుంటాడు. అలాగే ఆరు.. మిస్సమ్మను ఫోన్ లో మేడం అనొద్దని అక్కా అనమని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. ఆరు కూడా అమర్ పక్కనే కూర్చుని గమనిస్తూనే ఉంటుంది. ఇంత టైం అయినా ఈయనేంటి ఇంకా ఏదేదో ఆలోచిస్తూ ఇక్కడే కూర్చున్నారు అనుకుంటుంది.
మరుసరోజు ఆరు కిటికిలోంచి ఇంట్లోంకి చూస్తుంది. ఇంతలో అక్కడకు గుప్త వస్తాడు. గుప్త గారు మిస్సమ్మ లేదని మా ఆయన బాగా బాధపడుతున్నట్టున్నారు. ఆయన అలా ఫీలవుతుంటే చూడలేకపోతున్నాను. అయినా ఏంటి గుప్త గారు ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు అని అడుగుతుంది. అవును బాలిక ఆ బాలిక ఉన్నన్ని రోజులు నువ్వు ఇంట్లోకి వెళ్లుటకు భయపడితివి ఇప్పుడు ఇంట్లో ఎవ్వరికి నువ్వు కనబడవు కదా..? ఇంకెందుకు ఇక్కడి నుంచి చూస్తున్నావు అని గుప్త చెప్పగానే ఆరు అవును కదా..? మిస్సమ్మ లేనప్పుడు నేను దర్జాగా ఇంట్లోకి వెళ్లొచ్చు కదా..? పదండి వెళ్దాం. అని ఇద్దరూ లోపలికి వెళ్తారు.
బెడ్ రూంలో నిర్మల, శివరాం డల్లుగా కూర్చుని ఉండటం చూసి.. మిస్సమ్మ వెళ్లినప్పటి నుంచి అత్తయ్య, మామయ్య చాలా బాధపడుతున్నారు. నేను వీళ్లను ఇలా చూడలేకపోతున్నాను గుప్తగారు అంటూ నాకు స్పర్శ శక్తి ఉంది కదా..? ఇప్పుడే నేను మా ఆయన రూంలోకి వెళ్లి డైరీలో దీనికంతటికి కారణం మనోహరి అని రాస్తాను. అంటూ పైకి పరుగెత్తుకెళ్తుంది ఆరు వద్దని గుప్త వెనకే వెళ్తాడు. ఇంతలో కింద అమర్ వచ్చిన సౌండ్ విని ఆరు అలాగే ఉండిపోతుంది. అమర్ రూంలో డల్లుగా కూర్చున్న శివరాం, నిర్మలను పిలుస్తాడు. ఎందుకు అలా ఉన్నారని అడుగుతాడు. దీంతో వాళ్లు నువ్వు వెళ్లి మిస్సమ్మను ఇంటికి తీసుకురావాలని చెప్తారు. కింద నుంచి అంతా వింటున్న మనోహరి ఎలాగైనా అమర్ వెళ్లకుండా చేయాలని పైకి వెళ్లి కిందపడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. అందరూ ఏమైంది మనోహరి అని వస్తారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.