Satyabhama Today Episode November 11 th : గత ఎపిసోడ్ లో మహాదేవయ్య ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతాయి. సత్య మహాదేవయ్యకు ఇచ్చిన షాక్ లోనే ఉంటాడు. ఇక సత్య అలక తీర్చడానికి క్రిష్ చేసిన ప్రయత్నాలు ఎపిసోడ్ కు హైలెట్ అయ్యాయి. వాటిని చూసిన భైరవి, పంకజం కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఇక భైరవి సత్యకు సంతోషాన్ని ఎక్కువగా ఉంచకూడదు అని ఎలాగైనా బాధ పెట్టాలని కిట్టి పార్టీ ఉందని ఫ్రెండ్స్ కోసం దగ్గరుండి అన్ని చెయ్యాలని చెబుతుంది. కానీ భైరవి కాలు జారి పడటంతో ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుంది. ఇక దీన్ని మనసులో పెట్టుకొని మరో రివేంజ్ ప్లాన్ చేస్తుంది. కరెంట్ షాక్ ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ కూడా రివర్స్ అయ్యి భైరవికి తగులుతుంది. డాక్టర్ లిక్విడ్ ఫుడ్ మాత్రమె పెట్టాలని చెప్పడంతో జయమ్మ కోడలికి షాక్ ఇస్తుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఈరోజు భైరవికి డాక్టర్ వైద్యం చేసి షాక్ ఎక్కువగా తగిలింది. ఈ ఒక్క రోజు జ్యుస్ లు, నీళ్లు ఎక్కువ ఇవ్వండి అని చెబుతారు. ఇంట్లో వాళ్లు అంతా భైరవికి బిర్యానితో షాక్ ఇస్తారు. సత్యం బిర్యాని చెయ్యడంతో జయమ్మ కావాలనే భైరవి ముందు లోట్టలేసుకొని తింటుంది. ఇది ఎపిసోడ్ కు ఫన్నీగా ఉంటుంది. ఇక క్రిష్ మహాదేవయ్య ఐదు కోట్లు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తాడు. నేను తప్ప ఇంకెవ్వరు వరంగల్ MLA అయినా కానీ నా చిన్నకొడుకు బతకనీయడు అని పార్టీకి సంబంధించిన వ్యక్తిని బెదిరిస్తాడు మహదేవయ్య. ఎప్పుడూ బెదిరింపులతోనే పనికాదని కాల్ చేస్తాడు అట్నుంచి.. డబ్బులు ఇస్తాను అని మహాదేవయ్య గట్టిగా చెబుతాడు. ఐదు కోట్లు అంటే కష్టం కదా ఎలా ప్లాన్ చేద్దాం అని క్రిష్ అడుగుతాడు.
మహాదేవయ్య తన పలుకుబడితో డబ్బులను సీతారామ్ అనే వ్యక్తిని అడుగుతాడు. ఇప్పటికిప్పుడు 5 కోట్లు ఎట్లా తెస్తాం అని క్రిష్ అంటే.. వెళ్లి సీతారామ్ ని కలువు అంటాడు. అతను ఐదు కోట్లు కాదు మీరు అడిగితే పది కోట్లు కూడా ఇవ్వడానికి రెడీ వచ్చి తీసుకోండి అని చెబుతాడు. దానికి మహాదేవయ్య నా చిన్నకొడుకు వస్తాడు. డబ్బులు ఇచ్చి పంపండి అంటాడు. అవతల వ్యక్తి అలాగే మీ కోసం వెయిట్ చేస్తానని చెబుతాడు. మైత్రి ప్రయాణం సంగతి గుర్తుచేస్తుంది నందిని.. మీరుణం ఎలా తీర్చుకోవాలని మైత్రి అంటే..టైమ్ కి ఫ్లైట్ ఎక్కితే రుణం తీర్చుకున్నట్టే అని సెటైర్ వేస్తుంది నందిని. నువ్వు ఎంత హడావుడి చేసినా లాభం లేదు..నేను ఫారెన్ వెళ్లేది లేదంటుంది మైత్రి..
భోజనం చేస్తూ ఉలుకుపలుకు లేకుండా మౌనంగా ఉంటాడు. ఏదో ఆలోచనలో పడడం చూసి..ఏంటో చెప్పండి నేను చూసుకుంటాను అంటాడు సంజయ్. ముచ్చటపడుతున్నాడు కదా మావయ్య కొన్ని రోజులు క్రిష్ కి అప్పగించి ఆ హీరోగారికే అప్పగించొచ్చు కదా అంటుంది సత్య. నేను రెఢీగా ఉన్నానంటాడు క్రిష్.. ఈ రోజు నుంచి సంజయ్ కి అన్నీ నేర్పించు క్రిష్ అంటుంది సత్య.. ఇక ఇంట్లో సంజయ్ కూడా అన్ని నేర్పించండి అంటాడు. ఇంక ఆపుతావా అని ఫైర్ అవుతాడు మహదేవయ్య.. ఎందుకంత కోపం వచ్చందని జయమ్మ అడుగుతుంది. సత్య ఏ తప్పు మాట్లాడిందని క్రిష్ అడుగుతాడు. ఏదో చికాకులో అరిచాను ఏమీ అనుకోకు సత్యా అని మహదేవయ్య కవర్ చేస్తాడు. నీ చికాకేంటో చెప్పు అంటాడు క్రిష్.. వాడు చుట్టం చూపుగా వచ్చాడు. వాడికి ఇవన్నీ ఎందుకు అనగానే సంజయ్ నేర్పిస్తే నేను పనికొస్తాను కదా అంటాడు.
ఇక అప్పుడే చక్రవర్తి వస్తాడు సంజయ్ ఏమంటున్నాడని అడుగుతాడు. కత్తిసాము, కర్రసాము నేర్చుకుంటానంటుండాన్ని సత్య అంటుంది. ఆ నిర్ణయం మా అన్నయ్యదే అంటాడు. సంజయ్ కి సంబంధాలు తీసుకొస్తాడు కానీ.. ఆ అందం నాకు సరిపోదు అంటాడు సంజయ్.. సత్య వైపు చూస్తూ ప్రమాదం అని తెలిసినా క్రిష్ ని డబ్బులకోసం పంపించేందుకు సిద్ధమవుతాడు మహదేవయ్య. సత్య అడ్డు పడుతుంది. క్రిష్ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తాడు. సత్య మహదేవయ్యతో వాదనకు దిగుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో.. క్రిష్ అసలు తండ్రి ఎవరో తెలుసుకుంటానంటుంది సత్య.. మీరు ఎక్కడైతే నిజాన్ని పాతిపెట్టారో అక్కడి నుంచి మొదలు పెడతా అంటుంది. నీ భర్త చేయి ఎప్పటికీ నా చేతిలోనే ఉంటుంది అంటాడు మహదేవయ్య… ఇక నందిని మైత్రి ఎలాగైనా ఫారిన్ వెళ్లనని అనుకుంటుంది.. ఏం జరుగుతుందో రేపు చూడాలి..