Nindu Noorella Saavasam Serial Today Episode : నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ లో మేఘసందేశం సీరియల్ క్లబ్ అయింది. అందులోని అర్టిస్టులందరూ ఈ సీరియల్ లోకి వచ్చేశారు. దీంతో ఇవాళ సీరియల్ ఎంతో ఇంట్రస్టింగ్ గా జరిగింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా అమర్ కుటుంబం మొత్తం గుడికి వెళ్తుంది. గుడి బయట కారు ఆగగానే కారు దిగిన మిస్సమ్మ కాలుకు పెంకు గుచ్చుకోవడంతో బాధపడుతుంది. అమర్ ఏమైందని అడుగుతాడు. ఏం లేదని మిస్సమ్మ చెప్పగానే లోపలికి నడవగలవా..? అంటూ అమర్ అడుగుతాడు. దీంతో మనోహరి ఇరిటేటింగ్ గా ఇవాళ ఇంకా ఎన్ని దరిద్రాలు చూడాలో అనుకుంటుంది. వీళ్లిద్దరిని విడదీయాలని నేను ప్రయత్నిస్తుంటే.. వీళ్లేమో బంధం గట్టి పడాలని పూజలు చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది. తర్వాత అమర్ గుడి ముందు ఆడవాళ్లను టీజ్ చేస్తున్న పోకిరీలను చూసి మీరు లోపలికి వెళ్లండి నేను వస్తాను అంటాడు. ఇంతలో గగన్, భూమి కూడా కారులో గుడి దగ్గరకు వస్తారు. గగన్ కూడా ఆ పోకిరీలను చూసి వాళ్లను కొట్టడానికి వెళ్తాడు. అమర్, గగన్ కలిసి ఇద్దరు కొడతారు. తర్వాత ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు.
గుడిలోపలికి వెళ్లిన మనోహరి కోపంగా కొబ్బరికాయ విసిరిపడేస్తుంది. అది గమనించిన భూమి, మనోహరిని తిడుతుంది. మీరు విసిరిన కొబ్బరికాయ ఎవరికైనా తగిలితే పరిస్తితి ఏంటని నిలదీస్తుంది. దీంతో భూమిని చూసిన మనోహరి ఈ అమ్మాయి శోభా, శరత్ చంద్ర వాళ్ల అమ్మాయిలా ఉంది. అపూర్వకు ఈ పిల్లకు అసలు పడదు కదా..? అని మనసులో అనుకుని వెళ్లిపోతుంది. పక్కనే ఉన్న గగణ్ భూమిని తిడతాడు. అసలు నీకు సెన్స్ ఉందా..? తెలియని వాళ్లతో గొడవ పడతావేంటి..? అంటాడు. దీంతో భూమి మీరేంటి నన్ను అంటారు. తప్పు చేసింది ఆవిడ అంటూ ఇద్దరూ గొడవ పడుతుంటారు. ఇంతలో శారద, పూరి వస్తారు. ఇద్దరిని ఓదార్చి అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తారు.
ఆరు, గుప్త కూడా గుడికి వస్తారు. మిస్సమ్మకు కనిపించకుండా ఆరు వాళ్లను ఫాలో అవుతుంది. మరోవైపు మిస్సమ్మను దూరం నుంచి చూసిన భూమి వెళ్లి వెనక నుంచి కళ్లు మూసి నేను ఎవరో చెప్పు అని అడుగుతుంది. మిస్సమ్మ నలుగురు పేర్లు చెప్తుంది. భూమి కాదంటుంది. చివరకు భూమిని గుర్తుపడుతుంది మిస్సమ్మ. దీంతో ఇద్దరూ హ్యాఫీగా హగ్ చేసుకుంటారు. ఒకరి గురించి ఒకరు వివరాలు తెలుసుకుంటారు. ఇంతలో భూమి, మిస్సమ్మ మీద అలుగుతుంది. పెళ్లి చేసుకుని కూడా నాకు చెప్పలేదు అంటుంది. దీంతో నాకు పెళ్లి అయిందని నాకే చాలా రోజులకు తెలిసింది అని నిట్టూరుస్తుంది మిస్సమ్మ.
వాళ్లందరూ హ్యపీగా ఉండటం చూడలేని మనోహరి పక్కకు వెళ్లి అపూర్వకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చూసిన అపూర్వ మనోహరి ఇన్నాళ్లకు ఫోన్ చేస్తుందేంటి అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నేస్తమా చాలా రోజులకు గుర్తొచ్చినట్టు ఉన్నాను. ఎక్కడున్నావు. ఎలా ఉన్నావు అని అడుగుతుంది. అమర్ ను పెళ్లి చేసుకోలేదు కదా అస్సలు బాగాలేను. నువ్వు కూడా బాగా లేవని ఇప్పుడే తెలిసింది. ఇందాక గుడికి వచ్చిన నీ శత్రువును చూస్తుంటే అర్థం అవుతుంది అని మనోహరి చెప్తుంది.
ఆ భూమి గుడికి వచ్చిందా…? అని అడుగుతుంది అపూర్వ. దీంతో అవును అపూర్వ నీ శత్రువు నా శత్రువు కలిసిపోయి చాలా సంతోషంగా ఉన్నారు అంటుంది. అయితే నాకొక హెల్ఫ్ చేయ్ మనోహరి ఆ భూమిని అక్కడే దీపపు మంటల్లో కాలి బూడిదూపోయేలా చేయాలి అని అడుగుతుంది. మనోహరి సరే అంటుంది. ఒక్క నీ శత్రువే కాదు నా శత్రువు కూడా కాలిపోయేలా చేస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది.
గుప్త గారు నేను ఈరోజు ఎవరి శరీరంలోకి వెళ్లకూడదని నాతో మాట తీసుకున్నారు కదా..? నేను మాట ఇవ్వాలంటే మీరు నాకో సాయం చేస్తానని మాటిచ్చారు కదా..? ఆ సాయం ఇప్పుడు చేస్తారా..? అని ఆరు గుప్తను అడుగుతుంది. ఆ సాయం ఏంటో చెప్పు చేస్తానో లేదో చెప్తాను అంటాడు గుప్త. నా కోసం అయితే కాదు గుప్త గారు అని ఆరు చెప్పగానే అయితే అడుగు అంటాడు గుప్త. దీంతో ఆరు ఆ శోభాచంద్ర ఆత్మను ఒక్కసారి ఈ భూలోకానికి రప్పించండి అని అడుగుతుంది. ఫస్ట్ కుదరదు అని చెప్పిన గుప్త, ఆరు బతిమాలగానే సరేనని శోభ ఆత్మను భూమి మీదకు రప్పిస్తాడు.
శోభాచంద్ర ఆత్మను చూసి ఆరు సంతోషంగా దగ్గరకు వెళ్లి తనను పరిచయం చేసుకుంటుంది. అయితే నన్ను ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది శోభ. నీ తీరని కోరిక నెరవేర్చుటకు మేమే నిన్ను కిందకు రప్పించాము బాలిక అంటాడు గుప్త. దీంతో శోభా చంద్ర అయితే నా బిడ్డను నాకు చూపిస్తారా..? అని అడుగుతుంది. అవునని అక్కడ నీ కూతురు ఉంది. నువ్వే గుర్తు పట్టుకో అంటుంది ఆరు. భూమిని చూసిన శోభాచంద్ర తనే నా కూతురు అని దగ్గరకు వెళ్లి హగ్ చేసుకోవాలని చూస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.