Telugu TV Serials: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇటీవల కాలంలో ఏ సీరియల్ ప్రసారమైన కూడా అందులో హీరోయిన్ల గురించి పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే ఈమధ్య తెలుగు హీరోయిన్ల కంటే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా మెప్పిస్తుంది. ఈ మధ్యకాలంలో ప్రసరమైన కొత్త సీరియల్ తో పాటుగా పాత సీరియల్ కూడా అభిమానులు అనే విపరీతంగా ఆకట్టుకుని వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా టిఆర్పి రేటింగ్ విషయంలో కాస్త విభిన్న అభిప్రాయాలు వచ్చిన సరే.. అప్పుడప్పుడు రేటింగ్ భారీగా పెరగడంతో పాటుగా సీరియల్ కి మంచి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. మరి ఈవారం టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది? ఏ సీరియల్ టాప్ లో కొనసాగుతుంది అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారం అవుతున్న పొదరిల్లు సీరియల్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ మధ్యకాలంలో కొత్త సీజర్స్ ఎన్ని వచ్చినా సరే ఈ సీరియల్ కి మాత్రం డిమాండ్ మాత్రం అస్సలు తగ్గలేదు. చక్రి మహాలక్ష్మి ఎప్పుడు కలుస్తారని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూవున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకున్నాయి కానీ పొదరిల్లు సీరియల్ మాత్రం రోజురోజుకీ తన క్రేజ్ ను పెంచుకుంటూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ వస్తుంది. గతవరంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ భారీగా పెరిగిందని చెప్పాలి ఎందుకంటే మహాలక్ష్మి కొంచెం కొంచెంగా చక్రీకి దగ్గర అవుతుంది అని గత కొన్ని రోజులు ఎపిసోడ్లు చూస్తే అర్థమవుతుంది.. ఇక ప్రస్తుతం మహాలక్ష్మిని చక్రి ఎంత ప్రేమిస్తున్నాడో మహాలక్ష్మి కూడా అంతే ప్రేమిస్తుంది అని బాగా అర్థమైపోయింది. ఈ రెండు రోజుల నుంచి సీరియల్ టిఆర్పి రేటింగ్ కూడా భారీగా పెరగడంతో దీనికి డిమాండ్ కూడా ఇండస్ట్రీలో పెరుగుతూ వస్తుంది. అసలు చక్రి మహాలక్ష్మి ఎప్పుడు కలుస్తారు అన్న ఆసక్తి తెలుగు ప్రేక్షకులో రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ డిమాండు ఎక్కువ కాబట్టి రేటింగ్ కూడా ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది అని టాక్ వినిపిస్తుంది..
స్టార్ మా ఛానెల్లో ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ కథతో ఉండటంతో వీటి మధ్య పోటీ పెరుగుతూ ఉంటుంది.. ఇక్కడ ప్రసారం అవుతున్న సీరియల్స్లలో కార్తిక దీపం 2 మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ సీరియల్ రేటింగు 12.73 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఉంటుంది.. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.00 ఉంది. పొదరిల్లు 11. 85, ఇంటింటి రామాయణం 11.34, ఇల్లు ఇల్లాలు పిల్లలు 10.17, నువ్వులేక నేను లేను10.50, నిండు మనసులు 9.40, చిన్ని 8.73, బ్రహ్మముడి 8.37.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్‌ను నమోదు చేసుకున్నాయి. ఇంటింటి రామాయణం, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్స్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతున్నాయి.. పొదరిల్లు సీరియల్ కి ఈమధ్య డిమాండ్ పెరగడంతో ఈ సీరియల్ ట్రేడింగ్ పెరుగుతుంది మరి టాప్ పోసిషన్ లోకి సీరియల్ వస్తుందా లేదంటే వేరే సీరియల్ రాబోతుందన్నది చూడాలి..
Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు అవుట్..