E-Paper
Advertisement

ముఖేష్.. వర్షిణి వల్లే చెడిపోతున్నాడా?

ముఖేష్.. వర్షిణి వల్లే చెడిపోతున్నాడా?
Advertisement

Bigg Boss 10:ప్రముఖ సీరియల్ యాక్టర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ముఖేష్ (Mukhesh) టైటిల్ విజేత గానే హౌస్ లోకి అడుగుపెట్టాడు.తనదైన ఆట తీరుతో మాట తీరుతో ప్రేక్షకులను మెప్పించి, హౌస్ లోకి వచ్చిన తొలివారాలలో బాగా ఆకట్టుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఆయన ఆట తీరులో విపరీతమైన మార్పు రావడం, ఇతర కంటెస్టెంట్లను దూషించడం, ఏకంగా నిందలు వేయడం లాంటివి చూస్తుంటే ఆయనలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా దేబ్జాని వెంట శివా పడుతున్నాడు అన్న ఒక్క మాట ఆయన బిహేవియర్ పై కూడా మచ్చ పడేలా చేసింది. అయితే ఇప్పుడు సడన్గా ముఖేష్ ఇలా మారిపోవడానికి కారణం వర్షిణి అంటూ సుధీర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మారుతున్నాయి.

నామినేషన్ లో ముఖేష్ చేసింది తప్పా..

బిగ్ బాస్ 58వ రోజుకు సంబంధించి విడుదల చేసిన ఐదవ ప్రోమోలో ముఖేష్, వర్షిణిల గురించి సుధీర్, నరేష్ తో చెప్పిన మాటలు వైరల్ గా మారుతున్నాయి. ప్రోమో విషయానికి వస్తే.. నరేష్ మాట్లాడుతూ..” ముఖేష్ ను మాటలు వదలకు అని నువ్వైనా చెప్పొచ్చుగా అని అంటే.. సుధీర్ మాట్లాడుతూ.. నేను ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. నామినేషన్స్ లో కూల్ గా ఉండు.. ఓవర్ రియాక్ట్ అవ్వకు అని చాలా చెప్పాను. ముఖ్యంగా ఆయన అరిచిన ప్రతిసారి కూడా నేను వెనుక నుండి కొడుతూనే ఉన్నాను. కంట్రోల్ అవ్వమని.. కానీ ఆయన కంట్రోల్ అవ్వలేదు అంటూ సుధీర్ నరేష్ తో చెప్తాడు. అటు వీళ్ళ బ్యాచ్ లో ఉన్న సుధీర్ ఏకంగా వీళ్ళ గురించి మాట్లాడుతూ.. నేను ఇకపై ఇండివిజువల్ గానే ఆడి నా గేమ్ ఏంటో చూపించుకుంటాను అంటూ కామెంట్ చేశారు. అటు వర్షిణి, ముఖేష్ కూడా సుదీర్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ తెగ ఫీల్ అయిపోయారు.

Advertisement

also read:బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ పై దక్షి రియాక్షన్..ఆ ఒక్క రోజే ప్రశాంతత!

ముఖేష్, వర్షిణి పై సుధీర్ ఫైర్..

ఇక సుధీర్ మాట్లాడుతూ.. ఆమెకి అసలు కొంచమైనా బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నాను అని.. ఆ అమ్మి ఇప్పటి కూడా చెబుతోంది నేను కప్పు కొట్టడానికి రాలేదు. ఎన్ని రోజులు హౌస్ లో ఉంటానో అన్ని రోజులు ఉండి వెళ్తాను అని చెబుతోంది. కానీ ముఖేష్ మాత్రం ఏదో ప్రూవ్ చేసుకోవాలి నన్ను నమ్మిన ఆడియన్స్ కోసమని హౌస్ లోకి వచ్చాడు ఇద్దరిలో ఎంత తేడా ఉంది? అంటూ చెప్పుకొచ్చాడు. ఇక కట్ చేస్తే సుదీర్ దగ్గరకు ముఖేష్, వర్షిణి వచ్చారు. ముఖేష్ మాట్లాడుతూ.. అసలు నీకు అనిపించింది చెప్పు అంటే.. నేను చెప్పనన్నా అంటూ సుధీర్ అన్నాడు.

వర్షిణి వల్లే ముఖేష్ చెడిపోయాడా?

Advertisement

ఏ స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా నువ్వు రెడీగా లేవు ఎందుకు ? అని ముఖేష్ ప్రశ్నించగా.. నేను రెడీగా లేనన్న.. నేను ఇంతే.. మీరు చేసిందంతా తప్పు.. ఈరోజు ఓపెన్ గా చెబుతున్నాను. నేను నిజం చెప్తున్నాను వర్షిని నువ్వే వెనకాల నుండి ఆయనను ప్రమోట్ చేసావు అంటూ వర్షిణి వల్లే ముఖేష్ అలా అవుతున్నాడు అంటూ డైరెక్ట్ గానే కామెంట్ చేశారు సుధీర్. మొత్తానికైతే సుధీర్ అన్న మాటలను బట్టి చూస్తే ముఖేష్ చెడిపోవడానికి వర్షిణినే కారణం అన్నట్టుగా నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

సీఎం మనవడిగా పుట్టడం తప్పు.. మూడు నెలలు నరకం చూశా:నారా లోకేష్

ఒకేసారి 10మంది నామినేషన్ లోకి.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళేది ఎవరంటే?

రోహిత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే?

బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ పై దక్షి రియాక్షన్..ఆ ఒక్క రోజే ప్రశాంతత!

ఘనంగా బుల్లితెర నటి మేఘన లోకేష్ సీమంతపు వేడుక..

ముఖేష్ మరీ ఇంత దిగజారిపోయావా.. దేబ్జానీ కన్నీటికి సమాధానం చెప్పగలవా?

కాళ్ళలో మునుపటి బలం లేదు…కన్నీళ్లు పెట్టుకున్న పండు మాస్టర్!

Big Stories

Advertisement
×