E-Paper
Advertisement

ఒకేసారి 10మంది నామినేషన్ లోకి.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళేది ఎవరంటే?

ఒకేసారి 10మంది నామినేషన్ లోకి.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళేది ఎవరంటే?
Advertisement

Bigg Boss 10:బిగ్ బాగ్ 10 లో తొమ్మిదవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగానే సాగింది. ముఖ్యంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియలో హౌస్ మేట్స్ మధ్య తీవ్రమైన వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ఎక్కువమంది హౌస్ మేట్స్ ముఖేష్, వర్షిణిలపై నామినేషన్ ఓట్లు వేస్తూ వారిని టార్గెట్ చేయడం గమనార్హం. వీరిద్దరి వల్లే హౌస్ లో గొడవలు, నిందలు, అపార్ధాలు మొదలయ్యాయి అంటూ కంటెస్టెంట్స్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. అలా మొత్తానికి అయితే హీటెక్కిన నామినేషన్ వార్ కాస్త ఆఖరికి ర్యాగింగ్గా మారిపోయింది. అలా హీటెక్కిన నామినేషన్ వార్ ఈ తొమ్మిదవ వారంలో నామినేషన్ లోకి వచ్చిన వారి లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

9వవారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

9వ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఏకంగా పదిమంది కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వచ్చారు. వారిలో ముఖేష్ గౌడ, వర్షిణి సౌందరరాజన్, అమన్ మసూద్, టెంపర్ వంశీ, నీతూ మాస్టర్, శివకుమార్ మరిహాల్, జబర్దస్త్ నరేష్, దేబ్జానీ మోదక్, సుధీర్ రెడ్డి, ఆటో రాంప్రసాద్ ఇలా మొత్తం పదిమంది కంటెస్టెంట్స్ నామినేషన్ లోకి వచ్చారు.

అందరి టార్గెట్ వారిద్దరే..

Advertisement

ఇకపోతే తనను నమ్మిన ఆడియన్స్ కోసం ఏదైనా చేయాలి అనే తపనతో హౌస్ లోకి అడుగుపెట్టిన ముఖేష్ ని .. ఉన్నన్ని రోజులు హౌస్ లో ఉండి బయటకు వెళ్లాల్సి వస్తే వెళ్ళిపోతాను అనే ఆలోచనతో హౌస్ లోకి వచ్చిన వర్షిణి మ్యానుపులేట్ చేస్తోంది అనే రేంజ్ లో మిగతా కంటెస్టెంట్స్ వీళ్లిద్దరినీ నామినేట్ చేయడం నామినేషన్ వార్ లో మరింత హీట్ పుట్టించింది. ముఖ్యంగా శివ , దెబ్జానీ, త్రిగుణ్ ఇలా చాలామంది వీరిని టార్గెట్గా చేసుకొని నామినేట్ చేశారు.

also read:ముఖేష్.. వర్షిణి వల్లే చెడిపోతున్నాడా?

ఈవారం హౌస్ నుండి వెళ్లేది ఎవరు?

Advertisement

ఇకపోతే గత ఎనిమిది వారాలుగా నామినేషన్ లోకి వస్తూ ఎలిమినేషన్ నుండి తప్పించుకుంటున్న వర్షిణి , ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్ళిపోవాలని.. అప్పుడైనా ముఖేష్ ఆట మెరుగు పడుతుంది అంటూ ముఖేష్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . ముఖ్యంగా వర్షిని అటు త్రిగుణ్ ను స్నేహం పేరిట బ్లాక్ మెయిల్ చేస్తోంది అనే కామెంట్లు వ్యక్తం అవుతుండగా.. ఇటు ముఖేష్ విషయంలో వర్షిని చేస్తున్నది తప్పు అంటూ తోటి కంటెస్టెంట్లు కూడా కామెంట్లు చేయడం గమనార్హం. ఈ వారం నామినేషన్ లో భాగంగా అందరూ వర్షిణి , ముఖేష్ లను నామినేట్ చేశారు. మరి కంటెస్టెంట్స్, ఆడియన్స్ కోరిక మేరకు వర్షిని ఈ వారం ఎలిమినేట్ అవుతుందా లేదా మరో కంటెస్టెంట్ ను ఈమె కోసం హౌస్ నుండి బయటకు పంపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Related News

సీఎం మనవడిగా పుట్టడం తప్పా.. మూడు నెలలు నరకం చూశా:నారా లోకేష్

ముఖేష్.. వర్షిణి వల్లే చెడిపోతున్నాడా?

రోహిత్ బిగ్ బాస్ రీ ఎంట్రీ.. వీడియో వైరల్.. అసలు నిజం ఏంటంటే?

బిగ్ బాస్ హౌస్ లో స్మోకింగ్ జోన్ పై దక్షి రియాక్షన్..ఆ ఒక్క రోజే ప్రశాంతత!

ఘనంగా బుల్లితెర నటి మేఘన లోకేష్ సీమంతపు వేడుక..

ముఖేష్ మరీ ఇంత దిగజారిపోయావా.. దేబ్జానీ కన్నీటికి సమాధానం చెప్పగలవా?

కాళ్ళలో మునుపటి బలం లేదు…కన్నీళ్లు పెట్టుకున్న పండు మాస్టర్!

Big Stories

Advertisement
×