E-Paper
Advertisement

Botsa Anusha: కూటమి సవాల్‌.. భీమిలి టూ విజయనగరం ఫైటర్‌ గా బొత్స అనూష!

Botsa Anusha: కూటమి సవాల్‌.. భీమిలి టూ విజయనగరం ఫైటర్‌ గా బొత్స అనూష!
Advertisement

Botsa Anusha: రాజకీయాల్లో విజయాలే కాకుండా, ప్రతికూల పరిస్థితుల్లో చూపించే తెగింపు కూడా ఒక నాయకురాలిని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమి ప్రభంజనం వీస్తున్న తరుణంలో విజయనగరం జిల్లా రాజకీయాల్లో డాక్టర్ బొత్స అనూష వ్యవహారశైలి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ ఆలోచనే లేదు
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెకు స్థానిక ఎన్నికల్లో నేరుగా జెడ్పీటీసీ బరిలో నిలబడే ఆలోచన లేదు. అయితే గజపతినగరం పరిధిలోని బొండపల్లిలో పార్టీ పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో అధిష్టాన ఆదేశాల మేరకు ఎలాంటి సంకోచం లేకుండా ఆమె రంగంలోకి దిగారు. బొండపల్లి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవాలని కూటమి ప్లాన్‌ చేస్తే.. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు కీలక నేతల ఒత్తిళ్లను కాదని అనూష నామినేషన్ వేయడం రాజకీయంగా హాట్‌ టాపిక్‌ గా నిలిచింది.

Advertisement

కూటమికి గట్టి పోటీగా
ఒకవైపు భీమిలిలో జీవీఎంసీ కార్పొరేటర్ స్థానాలను గెలిపించుకోవడానికి వ్యూహాలు రచిస్తూనే మరోవైపు బొండపల్లిలో ఉత్కంఠభరిత ప్రచారంతో కూటమి అగ్రనేతలకు చెమటలు పట్టించారు. అధికార యంత్రాంగం, బెదిరింపులు, చివరి నిమిషంలో జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా బొండపల్లిలో స్వల్ప తేడాతో ఓటమి ఎదురైనప్పటికీ.. అధికార బలగాలను ఎదుర్కొని ఆమె నిలబడిన తీరు ఆకట్టుకుంది.

ఓడినా అసలైన ఫైటర్
అంతేకాకుండా అనూష గతంలో చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్మించిన బలమైన కేడర్ నెట్‌వర్కే.. గరివిడి, గుర్ల మండలాల్లో వైఎస్సార్సీపీ అభ్య్రధుల అఖండ విజయాలకు బలమైన పునాదిగా నిలిచింది.  ప్రత్యర్థుల ఉమ్మడి వ్యూహాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, భీమిలి నుంచి విజయనగరం పల్లెటూర్ల వరకు క్రియాశీలక పాత్ర పోషించిన బొత్స అనూష పోరాట పటిమ.. రాజకీయ వర్గాల్లో ఆమె నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతోంది. సంఖ్యాబలంతో వచ్చే విజయాల కంటే, కష్టకాలంలో ఒంటరి పోరాటం చేసి సాధించిన ఈ నైతిక ధైర్యమే ఆమెను అసలైన ఫైటర్‌గా నిలబెట్టింది.

Related News

AP Elections: గరివిడి, గుర్ల ZPTC లు వైసీపీ కైవసం.. బొత్స అనూష గ్రౌండ్ వర్కేనా?

‘సర్’ పై వ్యూహాత్మక మౌనం ! బీఆర్‌ఎస్ సైలెంట్ మోడ్‌..! ఆ మౌనం వెనుక మతలబేమిటీ…? పైగా ప్రతిపక్షంపైనే విమర్శల దాడి!

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకం ఫెయిలైందిక్కడే! ఇందిరమ్మ ఇండ్లు ఓకే.. ‘టవర్స్‌’ పై జిల్లాల్లో అనాసక్తి! లబ్దిదారుడి వాటే అసలు సమస్య?

బీజేపీని గెలిపించడం కచ్చితంగా ప్రజల తప్పేనట! భావోద్వేగాలకు లొంగితే ఇలాంటి సీఎంలే వస్తారన్న పీకే! బీహార్‌ సీఎంపై ట్రోలింగ్స్‌..!

కరువు నేపథ్యంలో సర్కార్ పై బీఆర్‌ఎస్‌ పంజా! మరింత ఇరకాటంలో పెట్టేలా వ్యూహాలు! రైతు భరోసాతో రాజకీయం!

నాలుగేళ్ల తరువాత మనసు మార్చుకున్న మోడీ! ఆరేళ్ల సర్వీసు.. పర్మినెంట్‌కు అవకాశం.. అయినా..?

పాఠశాలల్లో మౌళిక సదుపాయాలపై పోరాట బాట పడుతున్న జనరేషన్‌ అల్ఫా! ఉపాధ్యాయుల కొరత, సౌకర్యాల కరువు.. సమస్యేదైనా పోరాటంతోనే పరిష్కారమని భావించి!

Big Stories

Advertisement
×