BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి నిజం చెప్పిన ఘోర – అంజు గురించి ఆరా తీసిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today October 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరికి నిజం చెప్పిన ఘోర – అంజు గురించి ఆరా తీసిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode:   ఇంట్లో గ్లాస్‌ ను పట్టుకుని చూసిన ఆరు తనకు స్పర్శ వచ్చిందని కన్‌ఫం చేసుకుంటుంది. అదే విషయం గుప్తను అడగాలనుకుంటుంది. బయట గార్డెన్‌ లో ఉన్న గుప్త కూడా ఆరుకు శక్తులు వచ్చిన విషయం చెప్పకూడదని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడకు ఆరు వస్తుంది. ఇంట్లో జరిగిన విషయం గుప్తుకు చెప్తుంది. ఎందుకు అలా జరిగిందంటారు అని అడుగుతుంది. అయితే గుప్త తనకు ఏం తెలియదని చెప్పడంతో అయితే నిజమేంటో నేనే కనుక్కుంటానని అంటుంది.


గుప్త కనుక్కోవడం కాదు బాలిక నువ్వు అనుకున్నది నిజమే. ఏదైనా ఒక ఆత్మ 4 మండలముల పాటు భూలోకంలో ఉన్నచో ఆ ఆత్మకు శక్తులు వచ్చును. ఇప్పుడు నీకు కూడా వచ్చినాయి.  నీవు దేనినైననూ తాకవచ్చును. నీ మనసున ఏదైనా సంకల్పించుకున్నచో అది కచ్చితంగా జరుగును. కానీ ఒక్కమాట బాలిక  నీ శక్తులను నువ్వు దుర్వినియోగ పరిచినచో ఆ వరమే నీకు శాపం అగును. అని గుప్త చెప్తూ హెచ్చరించడంతో ఆరు పలకకుండా దూరంగా వెళ్తుంది. గుప్త అనుమానంగా ఏమైంది ఈ బాలికకు అనుకుంటుండగా ఆరు తిరిగి సంతోషంగా తీన్మార్‌ డాన్స్‌ వేస్తుంది.

అప్పుడే స్కూల్‌ నుంచి వచ్చిన మిస్సమ్మ కూడా కారు దిగి వచ్చి ఆరుతో కలిసి స్టెప్పు లేస్తుంది. ఎందుకక్కా ఇంత ఆనందంగా ఉన్నావు. అని అడుగుతుంది. దీంతో ప్లోలో ఆరు మిస్సమ్మ నీ కథలో ఎవ్వరూ ఊహించిలేని అద్బుతమైన ట్విస్టు ఒకటి జరిగింది. అంటూ వెంటనే తేరుకుని అంటే దొరికింది. ఆ ట్విస్టు వల్ల నాకైతే చాలా మేలు జరగనుంది అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. వాళ్లిద్దరి డాన్స్‌ చూస్తున్న గుప్త చిన్నారుల వలే ఒకరి సంతోషాన్ని ఒకరు ఎటుల పంచుకుంటున్నారు. ఇటువంటి వారిని ఎటుల విడదీయాలనిపించింది స్వామి. ఈ బంధము ఎటులకు దారి తీయునో.. ఎంతటి ప్రమాదం తెచ్చిపెట్టునో అని భయంగా ఉంది జగన్నాథ నువ్వే రక్ష అనుకుంటూ ఆనందబాష్పాలు కారుస్తుంటాడు.


మనోహరి ఒక సీక్రెట్‌ ప్లేస్‌కు వెళ్లి ఘోరను కలుస్తుంది.   ఘోర ఏంటి ఇక్కడికి రమ్మన్నావు. ఈ ప్లేస్‌ ఇంత భయంకరంగా ఉంది అని మనోహరి అడగగానే   మనల్ని చూసి జనాలు భయపడాలి మనం భయపడకూడదు మనోహరి అంటాడు ఘోర. అయినా నువ్వేంటి ఘోర ఇక్కడికి మకాం మార్చావు అని అడుగుతుంది మనోమరి. తమరి ప్రేమ వల్లే నేను ఇక్కడకి రావాల్సి వచ్చింది. అనగానే సరే  ఏంటి అర్జెంట్‌ గా కలవాలని ఫోన్ చేశావు. ఏం లేదు మనోహరి ఆ ఆత్మ భూమి మీద ఉండబట్టి 4 మండలాలు దాటింది అని ఘోర చెప్పబోతుంటే అయితే ఏంటి రేపు జిల్లాలు కూడా దాటమని చెప్తానులే అంటుంది మనోహరి.

ఘోర కోపంగా మనోహరి అంటూ ఆ ఆత్మలో ఏమైనా మార్పులు గమనించావా? అని అడుగుతాడు. అది నాకు రోజు కనబడి హాయ్‌ చెప్తుందా..? ఏంటి..?  కలర్ తగ్గిందా? బరువు పెరిగిందా? అని గమనించడానికి అని మనోహరి వెటకారంగా మాట్లాడగానే మనోహరి ఏంటలా మాట్లాడుతున్నావు. దయచేసి నేను అడిగిన వాటికే సమాధానం చెప్పు అంటూ ఘోర ఈ మధ్యన ఇంట్లో కానీ ఏమైనా అనుమానాస్పదం లాంటి సంఘటనలు జరిగాయా అని అడుగుతాడు ఘోర. అవును జరిగాయని.. పొద్దున నేను దానితో మాట్లాడుతుంటే ఒక కొబ్బరి బొండం నా మీద పడబోయింది. ఇంతకు ముందు ఇక్కడకు  వస్తుంటే ఇంట్లో  ఏమీ లేదు. కానీ ఏదో తగిలినట్టు కిందపడిపోయాను అని మనోహరి చెప్పగానే..

ఘెర అయితే నా అనుమానం నిజం అయింది. నాలుగు మండలాలు ఆత్మ భూమ్మీద ఉంటే ఆత్మకు శక్తులు వచ్చాయి అని హ్యాపీగా ఫీలవుతుంటాడు. అయితే మనోహరి మాత్రం ఆత్మకు శక్తులు వచ్చాయంటే నన్ను చంపేస్తుందా? అంటూ బయపడుతుంది. దీంతో ఆ ఆత్మ నిన్నేం చేయలేదని రేపు పొద్దున్న నేను నీకో వస్తువు ఇస్తాను. అది తీసుకెళ్లి ఆ ఆత్మ ముట్టుకునేట్టు చేయ్‌ అప్పుడు దాన్ని బంధించొచ్చు అంటాడు ఘోర. సరే అంటుంది మనోహరి.

అమర్‌ ఇంటికి వచ్చి  మిస్సమ్మను పిలిచి షాపింగ్‌ కు వెళ్లాలి రెడీ అవ్వమని చెప్తాడు. ఇప్పుడు షాపింగ్‌ ఎందుకని మిస్సమ్మ అడగ్గానే రేపు అంజు బర్తుడే అని చెప్తాడు అమర్‌. దీంతో ఇంత సడెన్‌ చెప్తున్నారేంటి అని మిస్సమ్మ అడుగుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన నిర్మల నీకు ఒకరోజు ముందే చెప్తాడు మిస్సమ్మ. కానీ అంజలి పుట్టిన కొద్ది రోజులకు మా దగ్గరకు తీసుకొచ్చాడు. ఏంటిది అంటే కొన్ని ప్రాబ్లమ్స్‌ వల్ల మీకు చెప్పలేదు అన్నాడు అని చెప్తుంది. అలా ఎలా దాచిపెడతారండి అంటూ మిస్సమ్మ అడగడంతో అమర్‌ మౌనంగా ఉంటాడు.

అంతా కిటికీలోంచి గమనిస్తున్న ఆరు బాధపడుతుంది. అమర్‌ మౌనంగా ఉండటానికి కారణం నాకు తెలుసని మీరు పడుతున్న బాధ ఎవ్వరికీ చెప్పుకోలేరని అదే నేను బతికి ఉంటే మీ బాధను నాతో పంచుకునే వారని అనుకుంట గార్డెన్‌ లోకి వెళ్తుంది. అక్కడ కూర్చుని నిర్మల, శివరాం చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Brahmamudi Serial Today September 26th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన రాజ్‌

Intinti Ramayanam Serial Today September 25th: ‘ఇంటింటి రామాయణం’ సీరియల్‌: జాబ్‌ కు రిజైన్‌ చేసిన అక్షయ్‌

Illu Illalu Pillalu Serial Today September 25th: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: రామరాజు మీద పగ తీర్చుకుంటానన్న విశ్వ

Gunde Ninda Gudi Gantalu Serial Today September 25th: ‘గుండె నిండా గుడి గంటలు’ సీరియల్‌: రోహిణిని అనుమానించిన బాలు    

Brahmamudi Serial Today September 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను గల్లా పట్టుకుని నిలదీసిన కావ్య  

Nindu Noorella Saavasam Serial Today September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని తోసేసిన మిస్సమ్మ

Tv Actress: విడాకులు తీసుకొని విడిపోయిన బుల్లితెర జంట…పెళ్లైన నాలుగేళ్లకే?

Nindu Noorella Saavasam Serial Today September 24th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు నిజం చెప్పిన సరస్వతి   

Big Stories

×