BigTV English

OTT Movie : ఫోన్ కి అడిక్ట్ అయ్యారంటే ఈ సైకో చేతిలో చావే… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : ఫోన్ కి అడిక్ట్ అయ్యారంటే ఈ సైకో చేతిలో చావే… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

OTT Movie : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. పది నిమిషాలు చేతుల్లో ఫోన్ లేకుంటే మనిషి మనుగడ సాగించడం కష్టమేమో అనే విధంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. కుటుంబాలు కూడా వారి కుటుంబ సభ్యులతో గడపడం కంటే స్మార్ట్ ఫోన్ తోనే ఎక్కువగా గడుపుతున్నారు. అందుకే స్మార్ట్ ఫోన్ కాన్సెప్ట్ తో సైకో కిల్లర్ చేసే అకృత్యాలు ఈరోజు మన మూవీ సజెషన్. స్మార్ట్ ఫోన్ ఎవరి చేతిలోనైనా కనిపిస్తే ఆ సైకోకి పిచ్చెక్కుతుంది. ఆ పాయింట్ తో వారిని చంపడానికి కూడా వెనకాడడు. థ్రిల్లర్, సైబర్ క్రైమ్ సబ్జెక్టుతో ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ గురించి తెలుసుకుందాం పదండి.


స్టోరీ ఏమిటంటే..

ఫోన్ వాడాలంటే భయపెట్టే ఈ సైకో థ్రిల్లర్ మూవీ పేరు ‘అన్ లాక్డ్’. ఫోన్ వాడే వారిని టార్గెట్ చేసి అత్యంత దారుణంగా చంపే సైకో కిల్లర్ మూవీ ఇది.  ఈ మూవీలో హీరోయిన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తను చేసే పనులను, తను వెళ్లే వెకేషన్స్ ను.. ఇలా తనేం చేసినా ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది ప్రతిరోజూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తను తన ఫ్రెండ్స్ తో వెకేషన్ వెళ్తుంది. అక్కడ ఫోన్ మర్చిపోతుంది. పోయి పోయి ఆ ఫోన్ ఆ సైకో కిల్లర్ చేతికే దొరుకుతుంది. ఆ తర్వాత ఆ సైకో కిల్లర్ ఆ అమ్మాయికి ఫోన్ చేసి మీ ఫోన్ నా దగ్గర ఉంది అని చెప్పి ఆ అమ్మాయిని తన తన దగ్గరకు రప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఈలోగానే అమ్మాయి ఫోన్ లోని రహస్యాలను తెలుసుకోవడానికి ఫోన్ అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అది సాధ్యం కాకపోవడంతో స్మార్ట్ ఫోన్ ని విరగ్గొడతాడు.


ఇదిలా ఉండగా వరుస హత్యలు చేస్తున్న ఈ సైకో కిల్లర్ చేతిలో మరొక అమ్మాయి బలైపోతుంది. ఆ అమ్మాయి ని అత్యంత దారుణంగా కాళ్లు, చేతులు, వేళ్ళు కట్ చేసి చంపేస్తాడు ఈ సైకో కిల్లర్. ఆ అమ్మాయి బాడీ దగ్గర ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ కి కొన్ని క్లూస్ దొరుకుతాయి. ఈ హత్యలు చేస్తున్న వ్యక్తి ఎవరో తెలిసిపోతుంది. మరోవైపు హీరోయిన్ ఫోన్ కోసం సైకో కిల్లర్ దగ్గరికి వస్తుంది ఆ ఫోన్ పగిలిపోయిందని దానిని బాగు చేయించి తీసుకువస్తానని చెప్పి ఫోన్ పాస్వర్డ్ కావాలని తీసుకుంటాడు. అప్పట్నుంచి ఆ అమ్మాయిని వెంటాడుతాడు. ఆ అమ్మాయి చేసే ప్రతి పనిని ఫోన్ ద్వారా పసిగడతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఆ సైకో కిల్లర్ చంపుతాడా లేదా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఆ సైకో కిల్లర్ దొరుకుతాడా ?ఈ వరుస హత్యలకు కారణం ఇతడేనా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఓటిటిలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ అన్ లాక్డ్ థ్రిల్లర్ మూవీని తప్పక చూడాల్సిందే

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×