Anchor Sreemukhi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో శ్రీముఖి ఒకరు. ఇటీవల ఈమె యాంకర్ గా వరుస కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ యాంకర్ గా పేరు సంపాదించుకున్నారు. ఇక శ్రీముఖి(Sreemukhi) వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న కార్యక్రమాలలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం (Aadivaram with star maa parivaram) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందిస్తుంది.
ఇకపోతే ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ రెట్రో థీమ్ ద్వారా ప్రసారం కాబోతోంది ఈ నేపథ్యంలోనే సీరియల్ నటీనటులందరూ కూడా ఓల్డ్ సెలబ్రిటీ గెటప్ లో హాజరై సందడి చేశారు. ఎప్పటిలాగే కమెడియన్స్ అందరి మధ్య సరదా సన్నివేశాలు చోటు చేసుకోవడం ఒకరిపై మరొకరు పంచ్ వేయడం వంటి వాటి ద్వారా ఈ ప్రోమో సరదాగా సాగిపోయింది. ఇక ఈ ప్రోమో వీడియోలో భాగంగా యాంకర్ శ్రీముఖి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీముఖి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి పురుషుడు నన్ను చూడగానే చెమటలు కక్కుతున్నారు అంటూ మాట్లాడటంతో వెంటనే ఇమ్మానియేల్ మాట్లాడుతూ అది మీ వల్ల వచ్చిన చెమటలు కాదు అలవాటు లేని పనులు చేయటం వల్ల వస్తున్న చెమటలు అంటూ ఆయన పెట్టుకున్న విగ్గు తీసి చూయిస్తారు. దీంతో అందరూ సరదాగా నవ్వుకున్నారు. ఇక రోహిణి డాక్టర్ బాబు మధ్య కూడా సరదా సన్నివేశం సాగింది. ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ ద్వారా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
RETRO SPECIAL 🥳
Get ready for a crazy dose of entertainment 😂🔥Watch #AdivaramWithStarMaaParivaram Sunday at 11 AM only on #StarMaa#StarMaaPromo pic.twitter.com/z9RNY9QObs
— Starmaa (@StarMaa) October 27, 2026
ఇక శ్రీముఖి విషయానికి వస్తే ఈమె పటాస్ షో ద్వారా యాంకర్ గా బుల్లితెరకు పరిచయమయ్యారు ఇలా పలు టీవీ ఛానల్ లో యాంకర్ గా కొనసాగిన శ్రీముఖి ప్రస్తుతం స్టార్ మా కార్యక్రమాలలో యాంకర్ గా కొనసాగుతూ బిజీగా ఉన్నారు. స్టార్ మా నిర్వహించే ప్రతి స్పెషల్ ఈవెంట్స్ అలాగే అగ్ని పరీక్ష ఆదివారం విత్ స్టార్ మా పరివారం వంటి కార్యక్రమాలకు ఈమె యాంకర్ గా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. మరోవైపు యూట్యూబ్, ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా శ్రీముఖి భారీగా సంపాదిస్తున్నారు అలాగే ఈమె రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
Also Read: కావ్య అనిరుద్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా? కాస్ట్ ఎంతో తెలిస్తే మతి పోవాల్సిందే!