E-Paper
Advertisement

మంగ్లీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ వెనుక ఉన్నది ఈయనే.. మాట్ల తిరుపతి కథ తెలిస్తే షాకే!

మంగ్లీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ వెనుక ఉన్నది ఈయనే.. మాట్ల తిరుపతి కథ తెలిస్తే షాకే!
Advertisement

Tirupati Matla:యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మిలియన్ల వ్యూస్ కొల్లగొడుతున్న ఎన్నో జానపదాలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయి.ముఖ్యంగా తెలంగాణా మట్టి వాసన గుభాలించే పాటలకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది.అదిగో అలాంటి పాటలని రాస్తూ పాడుతూ,పాడిస్తూ ఈ ఫోక్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన మల్టీ టాలెంటెడ్ తిరుపతి మాట్ల గురించి మనం ఇక్కడ ప్రతేకంగా చెప్పుకోవాలి.ఇక మంగ్లీ కెరీర్ లో ది బెస్ట్ అని చెప్పుకునే పాటల్ని కూడా తిరుపతి మాట్ల కలం నుండి జాలు వారడం విశేషం .

మాట్ల పుట్టింది 

Advertisement

తిరుపతి మాట్ల విషయానికి వస్తే పుట్టింది సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం,మరి గండ్ల అని పల్లెటూరిలో.తల్లిదండ్రుల పేర్లు లక్ష్మి,పోచయ్య.అయితే తిరుపతి తల్లి కడుపులో ఉన్నప్పుడే తండ్రి పోచయ్య దుబాయికి పోయి తిరిగి తిరుపతి ఏడెనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు రావడం గమనార్హం. ఇక తిరుపతి చిన్నప్పటి నుండే తన గ్రామంలో అంతా పాటలు ఎక్కువ పాడటం, కూలీలు ,రైతులు ఇలా అందరు తమ శ్రమని మర్చిపోవడానికి పాటలు పాడుకోవడం చూసి తాను కూడా చిన్నప్పటి నుండే పాటలకి బాగా అలవాటైపోయాడు.

ఏడో తరగతిలోనే ఏకంగా 8 పాటలు

Advertisement

ఇక చిన్నప్పుడు తల్లి కూలీ నాలీ చేస్తూ కొడుకు తిరుపతిని చదివించదని,ఒకవైపు పాటలు ,మరో వైపు ఆర్ధిక సమస్యలు..అలా చిన్నప్పుడే ఎన్నో అనుభవాలని పోగేసుకున్నాని ఒక చోట చెప్పుకొచ్చాడు తిరుపతి.ఇక తిరుపతి ఏడో తరగతి వచ్చే సమయానికే అతడి వద్ద ఏకంగా 8 పాటలు రాసి ఉన్నాయంటే పాటపై చిన్న తనంలోనే ఎంత గ్రిప్ సంపాదించాడో అర్థం అవుతుంది .

అలా పాటలు పాడటమే కాకుండా రాయడం కూడా ఒంటబట్టించుకున్న నుండి తిరుపతి ఇప్పటి వరకు ఎన్నో మంచి మంచి పాటలు వచ్చి ప్రేక్షకులని అలరించాయి.వాటిలో మంగ్లీ పాడిన ‘ఎండి కొండాలు ఎలెటోడా’ ..అనే పాట 2019లో శివ రాత్రి సమయంలో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది.దాము రెడ్డి దర్శకత్వంలో SK బాజీ సంగీతంలో మాట్ల రాసిన ఈ పాట ఏకంగా 26 కోట్ల మందికి పైగా చూశారంటే మాట్ల పదాలకి మంగ్లీ ఇచ్చిన గొంతు ఎంత మ్యాజిక్ చేసిందో అర్థం అవుతుంది.

ఇప్పటికీ 19 కోట్లకి పైగా వ్యూస్

ఇక మాట్ల రాసిన ఏమే పిల్లా అన్నప్పుడల్లా అనే ఫోక్ సాంగ్ ఇప్పటికీ ఆడియన్స్ ని ,ముఖ్యంగా ఫోక్ లవర్స్ ని ఉర్రూతలుగిస్తుందన్న సంగతి తెల్సిందే.సై టీవీలో వచ్చిన ఈ పాటని ఇప్పటికి మాట్ల రాసి సంగీతం అందించగా,శిరీష పాడి ,పాటకి నటించి పాటని మరో లెవెల్ కి తీసికెళ్ళిపోయారు.ఇక ఇప్పటికీ 19 కోట్లకి పైగా వ్యూస్ సాధించిన ఈ పాట ఇప్పటికీ తెలంగాణా రాష్టాలతోపాటు తెలుగు వారు ఉన్న ప్రతి చోటా వినిపిస్తుందని చెప్పక్కర్లేదు.

దాదాపు 137 మిలియన్ల వ్యూస్

ఇక ధన్ ధన్ ధన్ అనే పాట కూడా సోషల్ మీడియాని షేక్ చేసిందే. స్పూర్తి జితేందర్ పాడిన ఈ పాట ఇప్పటి వరకు 16 కోట్లకి పైగా జనాలని ఆకర్షించింది అంటే మాట్ల జానపదాలకి ఎంత పవర్ ఉందొ అర్థం అవుతుంది.ఇక తిరుపతి మాటల రాసిన రాములో ఓ రాముల పాట ఇప్పటి వరకు 137 మిలియన్ల వ్యూస్ రాబట్టగా, మాట్ల రచన సంగీతంలో లక్ష్మి గాత్రంలో ఫోక్ క్వీన్ నాగ దుర్గ నటించిన తిన్నా తీరం పడుతలే అనే పాట కూడా దాదాపు 137 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.

ఇక తిరుపతి మాటల రాసిన బావల్ల నా బావల్ల పాట కూడా 126 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి సత్తా చాటిందే,ఇక ఆ క్రమంలో బావా ఓ సారి రావా,నిన్నేమన్నంటినా తిరుపతి, పోడిపొడి వాన వంటి పాటలు కూడా మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టి తిరుపతి పాటలకి ఎంతటి పవర్ ఉందొ ప్రూవ్ చేసినవే.

మాట్ల పాటల లిస్ట్ 

ఇక వీటితో పాటు పుడమి ఎదలపైన, కోయిలాలో కోయిలమ్మో తెలంగాణ,వద్దురా బలిదానము,రండి రండి అన్నలారా,తరగని సంపదున్న నా తెలంగాణ,ఏడేడు ఏడేడు అల్లి, పూలు,బస్సుల కూసుంది,పోదు పాదులు రెండు,నజీర్ నగర్,ఏమవుతావని వంటి పాటలు ఎన్నో రాసి తిరుపతి మాట్ల ఫోక్ ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానం సెట్ చేసుకున్నాడని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.దివ దివ,లాయిరే లల్లాయిరే,ధరణి,అలై బలై,తుంపర్ల తుంపర్ల ,జనపదం,సింగిడి చినబోయినాది అమ్మని చూసి,ఆ రంగులే తడబడినాయి బొడ్డెమ్మని చూసి అంటూ మంగ్లీ కాంబోలో వచ్చిన పాటలకి ,అలాగే కేసీఆర్ పై రాసిన నీ ఉక్కు గుండెను ఒక్కసారైనా అనే పాటకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది

ఒక్కో పాటకి 1 నుండి 2 లక్షల వరకు

ఇక మాట్ల తిరుపతి పారితోషికం విషయానికి వస్తే డిమాండ్ ని బట్టి ఒక్కో పాటకి 1 నుండి 2 లక్షల వరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.ఇక సందర్భాన్ని బట్టి 10 నుండి ముప్పై వేల మధ్యలో కూడా పాటని పూర్తి చేసినట్టు నెట్టింట వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతో మాట్ల చెబితే కాని తెలీదు.ఏది ఏమైనా కష్టాల నుండి పెరిగిన మాట్ల తన స్వయం కృషితో ఈ స్థాయికి ఎదగడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం.

ALSO READ :ఇదెక్కడి క్రేజ్ రా మామా.. గోరటి వెంకన్న పాటకు అప్పట్లో అంత డబ్బా?

Tags

Related News

ఇండస్ట్రీలో విషాదం.. ‘సీఐడీ’ డైరెక్టర్ బీ.పీ.సింగ్ మృతి!

‘గోట్స్’లోనే ఐక్యత లేదు.. మీరేం జడ్జెస్ అయ్యా సామీ!

తెలుగు వాళ్లకు అవకాశాలు కరువయ్యాయా.. నిజాలు బయట పెట్టిన బిగ్ బాస్ దక్షి !

బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక షాలిని ఏం చేస్తోందో తెలుసా?

యాంకర్ తో పెళ్లిపై సుధీర్ క్లారిటీ!

‘సరిగమప’ కంటెస్టెంట్స్ కి అనిల్ రావిపూడి బంపర్ ఆఫర్!

బిగ్ బాస్ త్రిగుణ్ కి ఫేవర్ గా నడుస్తోందా.. రోహిత్ మాటలకు గీతూ రియాక్షన్!

Big Stories

Advertisement
×