E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 
Advertisement

Karthika Deepam 2 serial today Episode:  జ్యోత్స్న ఆలోచనలతో దక్షిణమూర్తి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ సూరజ్‌ కారు డ్రైవ్‌ చూస్తూ శివనారాయణ ఇంట్లోంకి వెళ్లిపోతాడు. కారు దిగి అటూ ఇటూ చూస్తూ ఇక్కడికి వచ్చానేంటి అనుకుంటుంటే అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఏంటి ఇలా వచ్చావు.. పరధ్యానంగా వచ్చావా..? నిజంగానే వచ్చావా..? అని అడుగుతుంది. అందుకు సూరజ్‌ మా ఇల్లు అనుకుని మీ ఇంటికి వచ్చేశా అంటాడు.

నువ్వు మారిపోయావు.. నీ మనసులో రియలైజ్‌ స్టార్ట్‌ అయింది కాబట్టే ఇలా వచ్చావు అంటూ జ్యోత్స్న చెబితే నేనేం తప్పు చేయలేదు మారడానికి అంటూ సూరజ్‌ చెప్పగానే.. నువ్వు తప్పు చేశావో లేదో నీ మనసును అడుగు చెప్తుంది. తప్పు చేసిన ఫీలింగ్‌లో నీ మనసే నీ అదుపు తప్పి ఇక్కడి దాకా తీసుకొచ్చింది అంటూ జ్యోత్స్న చెప్పగానే.. కొన్నింటిని పట్టుకోవడం కన్నా వదిలేయడం బెటర్‌ అంటూ సూరజ్‌ వెళ్లిపోతుంటే.. కొన్నింటినీ వదిలేయడం అంత ఈజీ కాదు అందుకే నువ్వు ఇంతదాకా వచ్చావు అంటుంది జ్యోత్స్న.

Advertisement

శివనారాయణ ఆఫీసుకు వచ్చిన బ్యాంక్‌ మేనేజర్‌ కార్తీక్‌, దీపలతో మీ రెస్టారెంట్‌ గ్రాఫ్‌ పడిపోతుందని.. డీఎం రెస్టారెంట్‌ లాభాల్లో దూసుకుపోతుందని మీ ఉద్యోగులు కూడా కంపెనీని వదిలేసే క్రమంలో ఉన్నారని చెప్తాడు. అప్పుడే శివనారాయణ వచ్చి బ్యాంక్‌ మేనేజర్‌ మాటలకు కోప్పడతాడు. మీ లోన్‌ నేను తీరుస్తాను.. మా రెస్టారెంట్స్‌ గురించి మీరేం వర్రీ అవ్వొద్దు.. నేను లేకపోయినా నా కొడుకు ఉంటాడు మీ అప్పు తీర్చడానికి ఇక మీర వెళ్లొచ్చు అంటాడు. మేనేజర్‌ వెళ్లిపోతాడు.

శివనారాయణ కోపంగా కార్తీక్‌, దీపలను కూడా ఆఫీసు నుంచి వెళ్లిపోమ్మని చెప్తాడు. తప్పు చేయకుండా తాము వెళ్లమని కార్తీక్‌, దీపలు చెబితే శివనారాయణ మరింత కోపంగా మీ ప్రవర్తన వల్ల మేము ఇంత వరకు నష్టపోయింది చాలు నేను చైర్మన్‌ గా ఉన్నన్ని రోజులు మీరు ఈ కంపెనీలో అడుగుపెట్టొద్దని రెండు చేతులు జోడించి రిక్వెస్ట్‌ చేస్తే.. మీరేం చేసినా మేము ఈ కంపెనీ వదిలి వెళ్లమని కార్తీక్‌ అంటాడు. అప్పుడే శ్రీధర్‌ వచ్చి కార్తీక్‌ను కొట్టి ఇంటికి తీసుకెళ్తుంటే.. శివనారాయణ ఆగండి అంటూ అందరినీ ఇంటికి తీసుకెళ్లి పదికోట్ల చెక్‌ తీసుకొచ్చి కార్తీక్‌కు ఇస్తాడు. ఎందుకు తాత అని అడిగితే.. దీపను సీఈవోగా తీసేస్తే పది కోట్లు ఇవ్వాలని అగ్రిమెంట్‌ ఉంది కదా అందుకే ఇది అంటూ శివనారాయణ ఇస్తాడు.

Advertisement

కట్‌ చేస్తే కార్తీక్‌ వాళ్ల ఇంట్లో కార్తీక్‌, దీప, కాంచన మాట్లాడుకుంటూ ఉంటారు. జ్యోత్స్న పెళ్లి బాధ్యత మీరు తీసుకోవడమే తప్పు అంటాడు శ్రీధర్‌. అందుకు వేరే కారణం ఉందిలే మాస్టారు అంటూ కార్తీక్‌ చెబితే.. ఆ కారణం ఏంటో చెప్పొచ్చు కదా అంటాడు శ్రీధర్‌. టైం వచ్చినప్పుడు అదే తెలుస్తుందిలే అంటాడు కార్తీక్‌. అప్పుడే అక్కడకు దక్షిణమూర్తి వస్తాడు. ఆయనను చూసిన కాంచన వెటకారంగా మాట్లాడుతుంది. మీరు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు…? సూరజ్‌ తప్పు చేశాడు కాబట్టే ముఖం చూపించలేక బయటే ఉండిపోయాడా..?  అంటుంది.

దక్షిణమూర్తి మాత్రం తాను అన్ని మర్చిపోయి ప్రశాంతంగా మన రెండు కుటుంబాలు బతకాలని కోరుకుంటున్నానని తన కూతురు మనవరాలి కోసం ఎంత వరకైనా దిగడానికి సిద్దంగా ఉన్నానని కానీ శివనారాయణ వచ్చి తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తాడు. అందుకు కార్తీక్‌ మధ్యవర్తిగా ఉండాలని చెప్తాడు. శ్రీధర్‌ కోపంగా మరో కొత్త నాటకం ఆడుతున్నారా..? అంటూ ప్రశ్నిస్తే లేదని దక్షిణమూర్తి చెప్తాడు. అప్పుడే అక్కడకు శివనారాయణ వస్తాడు. శివనారాయణను చూసిన కార్తీక్‌, కాంచన, దీప షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×