Jabardast:’శ్రీదేవి డ్రామా కంపెనీ’.. బుల్లితెరపై ప్రేక్షాదరణ పొందిన షోలలో ఈ షో కూడా ఒకటి. అయితే ఈ షోకి ఇంద్రజ జడ్జిగా..రష్మీ యాంకర్ గా చేస్తున్నారు. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి, సోషల్ మీడియాలో తాజాగా ఒక ఎపిసోడ్ ప్రోమో వదిలారు మల్లెమాల మేకర్స్. అయితే ఈసారి శ్రీదేవి డ్రామా కంపెనీలో ‘రిపబ్లిక్ డే’ స్పెషల్ ప్రోగ్రామ్ చూడబోతున్నాం. జనవరి 26న రిపబ్లిక్ డే కావడంతో దానికి సంబంధించి ఎన్నో స్కిట్లు పాటల రూపంలో దేశభక్తిని చాటుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. మరోవైపు.. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో పంచ్ ప్రసాద్,నూకరాజు ఇద్దరు లైవ్ లోనే గొడవ పడడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. అంతే కాదు వీరి గొడవ మరీ తీవ్రతరం అవ్వడంతో వెంటనే లైట్స్ కూడా ఆపేశారు.మరి వీరి మధ్య జరిగిన ఆ గొడవ ఏంటి..? అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే వీరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు..? అనేది ఇప్పుడు చూద్దాం..
స్టేజ్ పైనే గొడవపడ్డ కమెడియన్స్..
ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో మొదట్లో రామ్ ప్రసాద్ (Ram prasad ) కామెడీ వచ్చింది. ఆ తర్వాత చిన్న స్కిట్ వేసి చూపించారు. అలాగే ఇండియన్ ఆర్మీ గురించి పాడిన పాట చూపించారు. ఆ తర్వాత కార్డ్స్ తో ఒక చిన్న గేమ్ కూడా ఆడిపించారు. ఇక ఈ ప్రోమోలో పంచ్ ప్రసాద్,నూకరాజు ఇద్దరు గొడవపెట్టుకుంది కూడా చూపించారు. మొదట పంచ్ ప్రసాద్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని నూకరాజు నేను చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళం.నూకరాజు నాకు బ్రదర్ కంటే ఎక్కువ. కానీ వాడు ఈ మధ్య నాతో ఎందుకో మాట్లాడడం లేదు అని అంటాడు. దానికి వెంటనే నూకరాజు స్టేజి మీదకు వస్తూ ఒక మనిషికి దూరంగా ఉంటున్నాము అంటే ఎందుకు మాట్లాడడం లేదో నాకు తెలుసు అని చెప్పాడు. ఆయన మాటలకు ప్రసాద్ మాట్లాడుతూ.. అదే ఎందుకు మాట్లాడటం లేదురో చెప్పరా.. అని అంటే వెంటనే నూకరాజు అది మనం ఎప్పుడో డిస్కస్ చేసాం.. కానీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలని అనుకోవడం లేదు అని అంటాడు.
ప్రోమో కోసమేనా..?
కానీ పంచ్ ప్రసాద్ మాత్రం వదలకుండా ఎందుకో చెప్పురా.. ఎందుకు మాట్లాడడం లేదో ఇప్పుడు చెప్పాలి అంటూ గట్టిగా అరుస్తారు.కానీ నూకరాజు మాత్రం ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడానికి అస్సలు ఇష్టపడడు.ఆ తర్వాత వీరిద్దరి మధ్య బాగానే మాటల వార్ జరిగింది. కానీ వీరు మాట్లాడుకున్న మాటలను మ్యూట్ లో పెట్టేసి ఇద్దరి మధ్య గొడవ బాగానే జరిగినట్టు చూపించారు. అలాగే వీరి గొడవ తీవ్రతరం అవ్వడంతో లైట్స్ కూడా ఆఫ్ చేశారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ అసలు నూకరాజుకి,పంచ్ ప్రసాద్ కు మధ్య గొడవ ఎక్కడ వచ్చింది..? వీరిద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు అని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ప్రోమోలో ఉంది నిజంగానే జరిగిందా.. లేక ఎప్పటిలాగే షో హైప్ కోసం స్కిట్ చేయించి, ఇద్దరి మధ్య ఏమీ లేదు తూచ్ ప్రోమో కోసమే అలా చేసాం అని కవరింగ్ లు ఇస్తారా.. అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో పంచ్ ప్రసాద్,నూకరాజుల గొడవ చూశాక కచ్చితంగా ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి వీరి మధ్య జరిగింది నిజమైన గొడవ నేనా.. లేక షో కోసం అలా చేశారా అనేది.