Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) కూడా ఒకటి. హిస్టారికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ నుంచి తాజాగా మెగా ఫ్యాన్స్ ఎగిరి గంతేసే అప్డేట్ ఒకటి వచ్చేసింది. ఆ అప్డేట్ ప్రకారం త్వరలోనే పవన్ పండగ మొదలు కాబోతోంది. 15 రోజులకు ఒక అప్డేట్ తో మెగా ఫాన్స్ కు ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ట్రీట్ ఇవ్వబోతున్నారని సమాచారం.
పవన్ ఫ్యాన్స్ రెడీగా ఉండండమ్మా
పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతోంది. మొదటి భాగాన్ని ‘హరిహర వీరమల్లు పార్ట్ 1 : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ ను చిత్ర బృందం మొదలు పెట్టింది. కీరవాణి ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా, జనవరి 17న ‘హరిహర వీరమల్లు’ మూవీలో పవన్ కళ్యాణ్ పాడిన ‘మాట వినాలి’ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. తాజాగా మెగా ఫ్యాన్స్ దిల్ ఖుషీ అయ్యే మరో అప్డేట్ కూడా వచ్చేసింది.
ఈ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ ని రెండు లేదా మూడు వారాల్లో రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. అయితే ఈ పాట విజువల్ గ్రాండియర్ గా ఉండబోతుందని, పవన్ కళ్యాణ్ – పూజితపై మేకర్స్ ఈ పాటను అద్భుతంగా చిత్రీకరించారని సమాచారం. అంతేకాకుండా ‘హరిహర వీరమల్లు’ టీం ప్రతి 15 రోజులకు ఒక ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తోందట. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
‘హరిహర వీరమల్లు’ వాయిదా తప్పదా?
‘మాట వినాలి’ సాంగ్ ను ఊరించి ఊరించి రిలీజ్ చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికి కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉండటం వల్ల ఫుల్ బిజీగా ఉన్నారు. డేట్స్ ఇచ్చినప్పుడు నిర్మాతలు ఉపయోగించుకోకపోవడంతో సినిమాలు రోజురోజుకు మరింత ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది.
రీసెంట్ గా ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మూవీకి పవన్ కళ్యాణ్ వరుసగా డేట్స్ ఇచ్చారు. దీంతో ఈ మూవీ అయినా పూర్తి అవుతుందేమో అనుకుంటే, మళ్లీ నిర్మాతలు డేట్స్ కోసం వెయిట్ చేసే పరిస్థితి నెలకొంది. నిజానికి ఈ మూవీని గత ఏడాది మార్చి 28న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ ఐదేళ్ల క్రితం మొదలైన ఈ మూవీ ఇంకా నత్త నడకన సాగుతోంది. చివరగా ఈ మూవీని 2025 మార్చి 28న రిలీజ్ చేస్తామని అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ అప్పుడు కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని అంటున్నారు.