Cyclone Arnab Impact: అర్నబ్ తుఫాను ఈసారి ఏపీలో భారీగా డ్యామేజ్ అయ్యింది. ప్రాణ, ఆస్తి, పంట నష్టం కూడా సంభవించింది. దీనికి సంబంధించి రేపో మాపో కేంద్రానికి నివేదిక ఇవ్వనుంచి చంద్రబాబు సర్కార్. తాజాగా అర్నబ్ తుఫాను కారణంగా ఏపీలోని పాఠశాలలకు గురువారం కూడా సెలవు ప్రకటించారు అధికారులు.
ఏపీలో అర్నబ్ తుఫాను బాగా డ్యామేజ్ చేసింది. రోడ్లు, విద్యుత్ స్తంభాలు, పంటలు నష్టం, చివరకు ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడడంతో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు గురువారం సెలవు ప్రకటించారు అధికారులు.
అందులో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పు గోదావరి జిల్లా, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఉన్నాయి. తుఫానుకు ముందు అధికారులు 27 నుంచి 29 వరకు సెలవులు ప్రకటించారు. అయితే వెస్టు గోదావరి, కృష్ణా జిల్లాలకు ప్రభావితం కావడంతో అక్కడ కూడా సెలవులు ప్రకటించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమ్మెటివ్ అసెస్మెంట్-I పరీక్షల షెడ్యూల్ రెడీ చేసినట్టు సమాచారం. పరీక్షలు నవంబర్ నుంచి 9 నుంచి 20 వరకు జరుగుతాయి. ఒకటి నుండి ఐదో తరగతి, ఎనిమిది నుంచి 10 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 పరీక్షలు జరుగుతాయి.
ALSO READ: ఏపీలో ‘అర్నబ్’ తుఫాన్ కదలికలపై.. సచివాలయంలో చంద్రబాబు రాత్రంతా పర్యవేక్షణ!
6-7 తరగతులకు మధ్యాహ్నం 1.15 నుంచి సాయంత్రం 4.15 వరకు పరీక్షలు జరగనున్నాయి. జూన్ నుండి అక్టోబర్ వరకు చెప్పిన పాఠాలు ఈ పరీక్షలో రానున్నాయి. మొత్తం 80 మార్కులు ఉంటాయి. 7 నుంచి 10 వరకు PS-BS అనే రెండు పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్ 40 మార్కులు. 10వ తరగతి పబ్లిక్ పరీక్ష నమూనాలో 100 మార్కుల పరీక్ష ఉంటాయి. ఇక PS – BS చెరి 50 మార్కులకు ఉండనున్నాయి.