E-Paper
Advertisement

వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!

వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!
Advertisement

How to stop whatsapp auto download: స్మార్ట్‌ ఫోన్ వాడే ప్రతి ఒక్కరి ఫోన్‌లో వాట్సాప్ ఉండటం కామన్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ పంపే మెసేజ్‌లు, ఫన్నీ వీడియోలు, ఫొటోలతో మన ఫోన్ నిండిపోతుంటుంది. అయితే.. వాట్సాప్ డీఫాల్ట్ సెట్టింగ్స్ కారణంగా ఎవర్ని అడగకుండానే మీడియా ఫైల్స్ అన్నీ ఫోన్ గ్యాలరీలో సేవ్ అయిపోతుంటాయి. దీని వల్ల రెండు పెద్ద సమస్యలు వస్తాయి. మొదటిది మీ మొబైల్ ఇంటర్నెట్ డేటా త్వరగా ఖర్చైపోతుంది. రెండోది ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయి మొబైల్ హ్యాంగ్ అవ్వడం మొదలవుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి వాట్సాప్‌లో ఆటో-డౌన్‌లోడ్‌ను ఎలా ఆఫ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆటో-డౌన్‌లోడ్ ఆపడం ఎలా?

మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతుంటే.. ఈ క్రింది సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.

Advertisement

ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి. కుడి వైపు పైన ఉండే మూడు చుక్కల ఐకాన్‌పై క్లిక్ చేసి Settings (సెట్టింగ్స్)లోకి వెళ్లండి. అక్కడ మీకు Storage and Data (స్టోరేజ్ అండ్ డేటా) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. ఇప్పుడు Media auto-download సెక్షన్ కనిపిస్తుంది. ఇందులో Photos, Audio, Video, Documents అనే ఆప్షన్లు ఉంటాయి. ఒక్కొక్కదానిపై క్లిక్ చేసి, అక్కడ ఉన్న టిక్‌మార్క్‌లను అన్‌సెలెక్ట్  చేయండి. అలాగే మొబైల్ డేటా, వైఫై, రోమింగ్ మూడింటిలోనూ ఈ సెట్టింగ్ మార్చుకోవడం మంచిది. చివరగా OK లేదా Save మీద క్లిక్ చేయండి. అంతే! ఇకపై మీ అనుమతి లేకుండా ఏ ఫొటో లేదా వీడియో డౌన్‌లోడ్ కాదు.

ఐఫోన్ (iPhone / iOS) యూజర్ల కోసం ప్రాసెస్:

మీరు ఐఫోన్ వాడుతున్నట్లయితే ఈ పద్ధతిని ఫాలో అవ్వండి.

Advertisement

మీ ఐఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి, కుడివైపు కింద ఉండే Settings ట్యాబ్ పై నొక్కండి. అందులో Storage and Data ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి. ఇక్కడ Photos, Audio, Video, Documents ఆప్షన్లపై క్లిక్ చేసి వాటిని Never మోడ్‌కి మార్చండి. ఇలా చేయడం ద్వారా ఐఫోన్ గ్యాలరీలో వాట్సాప్ మీడియా అనవసరంగా స్టోర్ అవ్వడం ఆగిపోతుంది.

Also Read: రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!

దీనివల్ల కలిగే లాభాలు ఏంటి?

డేటా సేవ్: అనవసరమైన వీడియోలు, పెద్ద ఫైల్స్ డౌన్‌ లోడ్ కాక పోవడంతో మీ విలువైన మొబైల్ డేటా చాలా వరకు మిగులుతుంది.

స్టోరేజ్ సేఫ్: ఫోన్ మెమరీ ఎప్పుడూ ఫుల్ కాకుండా ఖాళీగా ఉంటుంది. మనకు ఏది ముఖ్యమో దానిని మాత్రమే మ్యాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫోన్ స్పీడ్: స్టోరేజ్ భారం తగ్గడం వల్ల ఫోన్ స్లో అవ్వకుండా స్మూత్‌గా పని చేస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే.. వాట్సాప్ ఆటో-డౌన్‌లోడ్ ఫీచర్ కొన్నిసార్లు మనకు ఇబ్బందికరంగా మారుతుంది. పైన చెప్పిన చిన్న ట్రిక్‌ను ఫాలో అవ్వడం ద్వారా మీ మొబైల్ డేటాను, స్టోరేజ్‌ను ఈజీగా కాపాడుకోవచ్చు. ఇప్పుడే మీ వాట్సాప్ సెట్టింగ్ మార్చుకుని ఈ సమస్య నుంచి బయట పడండి.

Related News

కార్ & ఇల్లు శుభ్రం చేసే మినీ వాక్యూమ్ క్లీనర్..ఫీచర్లు అదుర్స్!

వామ్మో.. ఫేస్ అన్‌లాక్ విషయంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ మధ్య ఇంత తేడా ఉందా?

ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?

రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!

వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!

18 నెలల వారంటీతో ‘యూగ్రీన్ 67W ట్రావెల్ ఛార్జర్’.. ల్యాప్‌టాప్, ఫోన్, బడ్స్ అన్నీ ఒకేసారి ఫుల్ చార్జ్!

బట్టలు కొత్తవాటిలా మెరిసిపోవాలా? వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు ఇవి మర్చిపోవద్దు!

Big Stories

Advertisement
×