E-Paper
Advertisement

iPhone 20 సిరీస్ చూడటానికి ఇలా ఉండబోతోందా? లుక్ మొత్తం మార్చేస్తున్న యాపిల్!

iPhone 20 సిరీస్ చూడటానికి ఇలా ఉండబోతోందా? లుక్ మొత్తం మార్చేస్తున్న యాపిల్!
Advertisement

iPhone 20 Pro Max Leaks: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్.. తమ వినియోగదారులకు త్వరలోనే ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వనుంది. ఐఫోన్ వచ్చి 20 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా.. కంపెనీ అత్యంత వినూత్నమైన డిజైన్‌తో ఒక ప్రత్యేక ఐఫోన్‌ను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. మార్కెట్లోకి ఇవి iPhone 20 సిరీస్‌గా 2027లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా తయారుచేస్తున్న ఈ మోడల్స్ ఐఫోన్ లవర్స్‌లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి.

పెద్ద స్క్రీన్లు.. సరికొత్త అనుభూతి:

ఈ సారి రాబోయే iPhone 20 Pro, Pro Max మోడళ్లలో డిస్‌ప్లే పరిమాణాన్ని మరింత పెంచుతున్నారట. మునుపటి మోడళ్లతో పోలిస్తే.. స్క్రీన్ సైజ్ కాస్త పెరగడం వల్ల ఫోన్ చూడటానికి చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. వీడియోలు చూడటానికి, గేమింగ్ ఆడటానికి ఈ సిరీస్ ఫోన్లు సరికొత్త అనుభూతిని అందిస్తుందని టెక్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Advertisement

Also Read: రూటు మార్చిన ఐటెల్.. జస్ట్ రూ.949కే టైప్-C ఛార్జింగ్, ఏఐ బ్యాటరీతో Ace 3 Heera లాంచ్!

సరికొత్తగా కర్వ్డ్ డిజైన్:

ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లకు భిన్నంగా, ఈ కొత్త ఫోన్‌కు నాలుగు వైపులా వంగిన కర్వ్డ్ గ్లాస్‌ను వాడనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్ అంచులకు స్వస్తి చెప్పి, అసలు అంచులే (బెజెల్స్) కనిపించని విధంగా పూర్తి స్క్రీన్‌తో ఈ ఫోన్ రాబోతోంది. పట్టుకోవడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉండేలా ఈ మార్పులు చేస్తున్నారు.

డైనమిక్ ఐలాండ్‌కు గుడ్ బై:

Advertisement

స్క్రీన్ పైన కనిపించే నోచ్ లేదా డైనమిక్ ఐలాండ్‌ను తీసేసి, ఫేస్ ఐడీ సెన్సార్లను స్క్రీన్ కిందనే అమర్చేందుకు యాపిల్ ప్రయోగాలు చేస్తోంది. దీనివల్ల డిస్ప్లేపై ఎటువంటి ఆటంకం లేకుండా, మునుపెన్నడూ చూడని రీతిలో స్క్రీన్ మొత్తం క్లీన్‌గా, భవిష్యత్ టెక్నాలజీని తలపించేలా కనిపిస్తుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్:

కేవలం డిజైన్ మాత్రమే కాకుండా.. ఈ కొత్త ఐఫోన్‌లో ఏ21 ప్రాసెసర్‌ను వాడనున్నారు. ఇది ఫోన్ వేగాన్ని పెంచడమే కాకుండా, బ్యాటరీ లైఫ్‌ను కూడా మెరుగుపరుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు మరింత వేగంగా పనిచేయడానికి ఈ ప్రాసెసర్ ఉపయోగపడుతుంది. ఈ మార్పులన్నీ నిజమైతే, ఐఫోన్ చరిత్రలోనే ఇది ఒక ల్యాండ్‌మార్క్ మోడల్‌గా నిలిచిపోతుంది.

Also Read: 8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

Related News

టైటాన్ మీదకు మీ పేరు.. నాసా నుంచి బోర్డింగ్ పాస్ కూడా, ఈ ఛాన్స్ మిస్ కావద్దు!

జియో సెన్సేషనల్ ప్లాన్.. జస్ట్ రూ.84తో నెల మొత్తం సిమ్ యాక్టివ్.. బడ్జెట్ సేవ్ చేసుకోండిలా!

వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్..నంబర్,తేదీపై ట్యాప్ చేస్తే చాలు షార్ట్‌కట్లు ఓపెన్!

కళ్లు చెదిరే ఫీచర్లతో..కొత్త గోబోల్ట్ ఇయర్ బడ్స్ లాంచ్

ప్రీమియం లెదర్ లుక్‌తో నాయిస్ బడ్స్..ఫీచర్లకు ఫిదా అవ్వాల్సిందే!

వాచ్‌తో ECG తీసి డాక్టర్‌కు రిపోర్ట్ పంపొచ్చు.. భారత్‌లోకి వచ్చిన గార్మిన్ కొత్త ఫీచర్ ఇదే!

బోట్ నుంచి అదిరిపోయే పవర్ బ్యాంక్ లాంచ్..ఒకే సారి 4 గాడ్జెట్లకు ఛార్జింగ్

Jio vs Airtel.. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లలో దేనివి బెస్ట్? సూటిగా సుత్తిలేకుండా!

Big Stories

Advertisement
×