Acer Aspire Lite Ryzen 3 5400U: కాలేజీ స్టూడెంట్స్ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే.. ఉద్యోగులైనా చేతిలో మంచి ల్యాప్‌టాప్ ఉండటం ఇప్పుడు తప్పనిసరిగా మారిపోయింది. అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టి లగ్జరీ ల్యాప్ టాప్‌లు కొనలేమని టెన్షన్ పడుతున్నారా? మీకోసమే ప్రముఖ బ్రాండ్ ఏసర్ నుంచి సూపర్ బడ్జెట్ ధరలో .. ఒక అద్భుతమైన ల్యాప్‌టాప్ వచ్చేసింది. అదే ఈ మోడల్ థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్! కేవలం రూ.39,990 ధరకే .. లభిస్తున్న ఈ ల్యాప్‌టాప్ మార్కెట్లో హాట్ కేక్‌లా అమ్ముడుపోతోంది. అసలు దీని స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందామా..
డిజైన్, లుక్ :
ఈ ల్యాప్‌టాప్ పేరుకు తగ్గట్టుగానే చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. దీని ప్రీమియం మెటాలిక్ ఫినిషింగ్ లుక్ చూసేందుకు చాలా ట్రెండీగా ఉంటుంది. అంతే కాకుండా బ్యాగ్‌లో వేసుకొని కాలేజీకి లేదా ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఎలాంటి బరువు అనిపించదు. మీరు ట్రావెల్ చేసేటప్పుడు కూడా దీనిని ఈజీగా క్యారీ చేయొచ్చు.
పర్ఫార్మెన్స్, ప్రాసెసర్ :
ఈ ల్యాప్ టాప్ లో పవర్ ఫుల్ ప్రాసెసర్‌ను వాడారు. ఇది రోజువారీ ఆఫీస్ పనులు, ఆన్‌లైన్ క్లాసులు, కోడింగ్ ప్రాక్టీస్, ఎంఎస్ ఆఫీస్ వర్క్స్, వెబ్ బ్రౌజింగ్‌ను ఎలాంటి లాగ్ లేకుండా చాలా స్మూత్‌గా రన్ చేస్తుంది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా ఇది ఇబ్బంది లేకుండా చేస్తుంది.
మెమరీ, స్టోరేజ్:
స్పీడ్ విషయానికి వస్తే.. ఇందులో ఉన్న 8 GB RAM , 256 GB SSD స్టోరేజ్ అద్భుతంగా పని చేస్తాయి. ఎస్‌ఎస్‌డీ ఉండటం వల్ల ల్యాప్ టాప్ కేవలం కొన్ని సెకన్లలోనే ఆన్ అవుతుంది . అలాగే ఫైల్స్ కాపీ చేయడం, హెవీ యాప్స్ ఓపెన్ చేయడం చాలా వేగంగా జరుగుతుంది. ఒకవేళ భవిష్యత్‌లో మీకు స్టోరేజ్ లేదా ర్యామ్ పెంచుకోవాలనిపిస్తే అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది.
డిస్‌ప్లే,విజువల్ ఎక్స్‌పీరియన్స్:
పెద్ద స్క్రీన్‌పై మూవీస్ చూసే వారికి లేదా ఎక్కువసేపు వర్క్ చేసే వారికి దీని డిస్‌ప్లే చక్కటి ఫీల్ ఇస్తుంది. అద్భుతమైన కలర్ కాంబినేషన్ , క్లారిటీతో వచ్చే ఈ స్క్రీన్ కళ్లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చూస్తుంది. ఆన్‌లైన్ మీటింగ్‌లు అటెండ్ అయ్యేటప్పుడు లేదా ఓటీటీలో సినిమాలు చూసేటప్పుడు మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది.
Also Read: రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!
ఆపరేటింగ్ సిస్టమ్ , కనెక్టివిటీ:
ఈ లాప్‌టాప్ లేటెస్ట్ ‘Windows 11 Home’ ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. దీంతో మీరు ఎలాంటి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ టెన్షన్ లేకుండా నేరుగా ల్యాప్ టాప్‌ను వాడొచ్చు. అలాగే వివిధ రకాల పోర్ట్స్ , వైర్ లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉండటం వల్ల పెన్ డ్రైవ్‌లు, ప్రింటర్లు లేదా ప్రొజెక్టర్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.
మొత్తంగా చెప్పాలంటే.. రూ.40 వేల లోపు బడ్జెట్‌లో ఒక నమ్మకమైన, స్టైలిష్ , పవర్ ఫుల్ ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్. మీ చదువుకు లేదా కెరీర్‌కు చక్కటి సపోర్ట్ ఇచ్చే ఈ ల్యాప్‌టాప్‌ను ఇప్పుడే మీ ఆర్డర్ చేయండి