Intinti Ramayanam Today Episode November 4th : రమ్య ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్నయ్య ప్రవర్తన అస్సలు బాగోలేదు అని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే రమ్యకు ఎవరైనా తోడు ఉంటే బాగుంటుంది అని ఒక ఆవిడ వచ్చి చెప్పి వెళ్తుంది.. మీ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోతేనే నీ జీవితం బాగుంటుంది లేకపోతే నువ్వు ఇలానే జీవితాంతం బాధ పడిపోతూ ఉండాలి అని ఆవిడ చెప్తుంది. ఇకపోతే ఆరాధ్య చాలా అందంగా ఉంది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి కారణం రమ్యని తనకి థాంక్స్ చెప్పాలి అని అంటారు. రమ్యకి థాంక్స్ చెప్పడానికి అవని ఫోన్ చేస్తే తను చాలా బాధగా ఉండడంతో నువ్వు ఇక మీదట నుంచి నన్ను మేడం అని పిలవద్దు అక్క అని పిలువు అని అంటుంది. ఆ మాట వినగానే రమ్య అలాగే అక్క అని అంటుంది మొత్తానికి కమల్ కి రమ్య సెట్ అయిపోయేలా కనిపిస్తుంది..
పల్లవి ఇంకా ఇంటికి రాలేదేంటి అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు అటు మీనాక్షి ఒకసారి పల్లవికి ఫోన్ చేయండి ఎక్కడుందో అర్థం కావడం లేదు అని అంటుంది. ఫోన్ చేసిన తను తీస్తుంది అని అస్సలు అనుకోలేదు కదా ఎలా తీస్తుంది అని చక్రధర్ అంటాడు. అయితే చక్రధర్ మాట విన్న పల్లవి అప్పుడే సడన్గా ఇంట్లోకి ఏంటో ఇచ్చి కనీసం కూతురు ఎక్కడుందని కూడా ఫోన్ చేసి కనుక్కోవాలని లేదని అరుస్తుంది.. కారు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుంది దాన్ని అమ్మేసి కొత్త కారు కొనొచ్చు కదా.. అని పల్లవి వాళ్ళ నాన్నని డిమాండ్ చేస్తుంది. ఇక చక్రధర్ కూడా పల్లవికి తెలిసి వచ్చేలా చెప్పిన కూడా పల్లవి అర్థం చేసుకోదు..
మీనాక్షి పల్లవి పరిస్థితి ఇలా మారిపోయిందని చాలా బాధపడిపోతూ ఉంటుంది. చక్రధర్ మాత్రం పల్లవి మాటలు విన్నావు కదా.. ఎందుకు పల్లవి మారుతుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు అసలు మారదు నువ్వు అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు అని అంటాడు. ఎలాగైనా సరే నిలబెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అవని తన మాట వినదు అని చక్రధర్ చెప్పేస్తాడు. పల్లవి జీవితాన్ని పల్లవి నీ చేతులారా నాశనం చేసుకుంది. మనము తనకి ఎంత చెప్పినా కూడా తను అర్థం చేసుకోదు కదా ఏం చేయాలి అర్థం కావడం లేదు అని ఇద్దరు కూడా తమ కూతుర్లకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు.
అవని మీనాక్షికి ఫోన్ చేసి చాలా రోజుల తర్వాత మేము పండగ చేసుకోవాలని అనుకుంటున్నాము. దసరా పండుగని ఇంట్లో చేసుకుంటున్నం కాబట్టి నువ్వు అమ్మ రావాలి అని చక్రధర్ తో అవని చెప్తుంది. నేను స్వయంగా వచ్చి పిలుద్దామని అనుకున్నాను కానీ పల్లవి అక్కడ ఎలా ఉంటుందో చెప్పలేం కదా.. పల్లవి గురించి మీకు తెలుసు కదా నాన్న తను ఎలా రియాక్ట్ అవుతుందో అని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అవని అంటుంది. అమ్మని పల్లవి గురించి ఆలోచించి బెంగ పెట్టుకోవద్దని చెప్పండి ఏం జరగాలనుకుంటే అది జరుగుతుంది అని అవని అంటుంది.. ఇంట్లో పండగ అంటే పల్లవి కూడా చెప్పాలి అలా అయితే పల్లవి కూడా వెళ్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పల్లవిని ఎలాగైనా సరే ఆ ఇంటికి పంపించాలి అని అనుకుంటుంది మీనాక్షి.
పల్లవి చాలా సీరియస్గా ఎలాగైనా సరే అని ఆలోచిస్తూ ఉంటుంది.. అక్కడికి వచ్చిన మీనాక్షి వాళ్ళకి ఇంట్లో పండగ జరుపుకుంటున్నారు.. మీరు వెళ్లాలి కాబట్టి పిలిచారు. ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అని మీనాక్షి తో పల్లవి దురుసుగా ప్రవర్తిస్తుంది. ఈ వంకతో అయినా నీ ఇంటికి వెళ్లి నీ భర్తని సొంతం చేసుకోవాలని చూడు అని మీనాక్షి ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం అస్సలు వినదు. ఇక భానుమతి మీనాక్షి చెప్పింది కరెక్టే కదా.. నువ్వు ఆ ఇంటికి వెళ్లాలి అది మీ ఇల్లు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అని క్లాస్ పీకుతుంది. ఇక పల్లవి నువ్వు వస్తానంటే నేను కూడా వెళ్తాను అని అంటుంది. ఇద్దరు కలిసి ఆ ఇంట్లో రచ్చ చేయాలని అనుకుంటారు..
పండగ కాబట్టి అందరు సంతోషంగా ఉన్న సమయంలో పల్లవి సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ కూడా షాక్ అవుతారు. అయితే ఎందుకు వచ్చావు కోట్లు తేల్చుకుంటానని వెళ్ళావు కదా.. ఇప్పుడు నువ్వు రావాల్సిన అవసరం ఏంటి కమల్ గనుక చూస్తే నేను చంపేస్తాడు అని అందరూ అంటారు. కానీ భానుమతి మాత్రం ఇది నా కొడుకు ఇల్లు నా మనవరాలిని తీసుకొచ్చే హక్కు నాకుంది అని పల్లవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇక అందరూ ఎంతగా మాట్లాడుతున్నా సరే పల్లవి మాత్రం మౌనంగా ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.రేపటి ఎపిసోడ్లో పల్లవి గురించి తెలుసుకున్న కన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Also Read :Podarillu Today Episode : ఛీ.. చక్రీ మారాడు.. చక్రికీ దిమ్మతిరిగే షాక్.. అడ్డంగా బుక్కయ్యాడే..?