E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెళ్లి జరుగుతుందా..? పెళ్లి ఆపేందుకు నందు వేసిన ప్లాన్ సక్సెస్ అయిందా..?   

Brahmamudi Serial Today Episode November 4th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెళ్లి జరుగుతుందా..? పెళ్లి ఆపేందుకు నందు వేసిన ప్లాన్ సక్సెస్ అయిందా..?   
Advertisement

Brahmamudi serial today Episode:  ఇందు పెళ్లి గురించి అపర్ణ టెన్షన్‌ పడుతుంది. ఇందు ఎందుకు మౌనంగా ఈ పెళ్లికి ఒప్పుకుందో అర్థం కావడం లేదు అంటూ బాధపడుతుంటే.. సుభాష్‌ మాత్రం రాజు వచ్చి ఈ పెళ్లి ఆపేస్తాడన్న నమ్మకంతో ఉందేమో అంటాడు. ఇప్పుడు మనం రేఖను శాసించే స్థాయిలో లేమని చెప్తాడు. అందుకే రేఖ ఆలా ప్రవర్తిస్తుందని అంటాడు. దానికి తోడు భ్రమరాంబ ఒకటి ఇద్దరూ కలిసి ఇంటిని ఇష్టమొచ్చినట్టు ఆడుకుంటున్నారు.. నేను ఒక్కసారి చలపతి ఇంటికి వెళితే అంటూ అపర్ణ అంటే మొన్న చలపతి ఎలా మాట్లాడాడో విన్నావు కదా..? ఇప్పుడు ఫోన్‌ కూడా ఎత్తడం లేదు.. ఇప్పుడు చలపతి మనసు మారాలి.. అంటే ఆ భగవంతుడే చలపతి మనసు మార్చాలి అంటుంది అపర్ణ.  అక్కడి నుంచి ఇందు దగ్గరకు వెళ్లి మూడు ముళ్లు వేసే టైంకు రాజు రాకపోతే ఏం చేస్తావు అని అపర్ణ అడిగితే.. తన ప్రేమ మీద తనకు నమ్మకం ఉందని తనను తన ప్రేమ ఓడిపోనివ్వదని చెప్తుంది ఇందు. బావ వస్తాడని నువ్వు ధైర్యంగా ఉండు నాన్నమ్మ అంటూ అపర్ణకు భరోసా ఇస్తుంది.

ఇంటికి వచ్చిన పెళ్లికొడుకు నందుతో వెటకారంగా మాట్లాడుతుంటాడు. సీరియస్‌ గా జోకులు వేస్తుంటే.. నందు కూడా నవ్వుతూ కామన్‌సెన్స్‌ లేని వెధవ నీ జోకులు భలే ఉన్నాయి అంటుంది. అందుకు పెళ్లి కొడుకు నందును తిట్టి లోపలికి వెళ్లిపోతాడు. పెళ్లికొడుకును రూంలోకి తీసుకెళ్లిన నందు జ్యూస్‌ ఇస్తే.. తాగినట్టు యాక్టింగ్‌ చేసి నేను ఇది తాగుతాను అనుకున్నావు కదా నువ్వు ఇందులో మోషన్‌ టాబ్లెట్‌ వేశావు కదా అంటూ నందు చేతిలో ఉన్న ఒంకో జ్యూస్‌ తాగి… నీ తెలివి తేటలు నాతో చూపించకు నేను చాలా క్లెవర్‌ అంటే.. అప్పుడే కడుపులో గుడగుడ అనడంతో అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిపోతాడు పెళ్లికొడుకు. నందు నవ్వుకుంటుంది.

Advertisement

చలపతి తనకు ఆకలిగా ఉందని భోజనం వడ్డించమని అడిగితే.. నీకు భోజనం కాదు గడ్డి పెట్టాలి అంటూ మనసులో తిట్టుకుంటుంది లక్ష్మీ.. ఆ అనేదేదో బయటకు అనొచ్చు కదా అంటాడు. లక్ష్మీ బయటకే తిడుతుంది. అక్కడ ఇందు పెళ్లి అవుతుంటే.. అన్నయ్య బాధపడుతుంటే నువ్వేంటి నాన్న ఇలా ఉన్నావు అంటాడు వెంకీ.. లక్ష్మీ కోపంగా చలపతిని రాజును తిడుతుంది. అందుకు చలపతి కోపంగా లక్ష్మీని తిడుతాడు. అప్పుడే రాజు వచ్చి నార్మల్‌ కూర్చుని భోజనం చేస్తుంటాడు. లక్ష్మీ బాధగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

దుగ్గిరాల ఇంట్లో పెళ్లి మండపంలో నిల్చున్న రేఖను, భ్రమరాంబ నీ ప్లాన్‌ సక్సెస్‌ అయింది అంటే తనకెందుకో నమ్మకం లేదని సరిగ్గా ముహూర్తం టైంకు రాజు వస్తే మీ ఆశలన్నీ అడియాసలు అవుతాయి అంటే ఈసారి నీ ప్రడిక్షన్‌ రాంగ్‌ అవుతుంది అన్నయ్య అంటుంది రేఖ. పంతులు పెళ్లికూతురు, పెళ్లి కొడుకును తీసుకురమ్మని చెబితే.. అపర్ణ ఇందును తీసుకొస్తూ.. ఇప్పటికైనా ఆలోచించుకో ఇందు అంటే ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలోచించుకోవడం దేనికి నాన్నమ్మ రాజు వస్తాడు అని చెప్తుంది ఇందు. నందు చేసిన పనికి పెళ్లికొడుకు రాడు.. అందరూ పెళ్లికొడుకు కోసం కంగారు పడుతుంటే.. నందు మాత్రం పాపం బాత్రూంలో ఎంత బాధపడుతున్నాడో అని మనసులో అనుకుంటూ నవ్వుతుంటే.. అప్పుడే పెళ్లికొడుకు వస్తాడు.

Advertisement

అందరూ హ్యాపీగా ఫీలయితే ఇందు, నందు, అపర్ణ బాధపడుతుంటారు. అపర్ణ వెంటనే బయటకు వెళ్లి రాజుకు ఫోన్‌ చేస్తుంది. లక్ష్మీ ఫోన్‌ లిఫ్ట్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేస్తుంది. అపర్ణ మాట్లాడేది మొత్తం మౌనంగా రాజు వింటాడు. అపర్ణ ఎమోషనల్‌ గా మాట్లాడుతుంది. ఇందు పెళ్లికూతురుగా ముస్తాబయిన ఫోటో నీకు పంపిస్తాను అది చూసిన తర్వాత కూడా నీ మనసు చలించకపోతే నేనేం చేయలేను అంటూ కాల్‌ కట్‌ చేసి ఇందు ఫోటో సెండ్‌ చేస్తుంది. ఫోటో ఓపెన్‌ చేసి రాజుకు చూపిస్తుంది లక్ష్మీ. ఆ ఫోటో చూసి ఏడుస్తుంటాడు రాజు. నువ్వు ఇక్కడ కూర్చుని ఏడిస్తే అక్కడ పెళ్లి ఆగిపోదురా మీ నాన్న మాట పట్టించుకోకు వెళ్లు అంటూ రాజు మౌనంగా ఇంట్లోకి వెళ్లిపోతాడు. వెనకే వెళ్లిన లక్ష్మీ రాజును వెళ్లి పెళ్లి ఆపి ఇందును పెళ్లి చేసుకోమని చెప్తుంది. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

దీపిక ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిద్రమాత్రలు మింగిన మనోహరిని వైజయంతి నుంచి అమర్‌ కాపాడతాడా..?     

హైపర్ ఆది పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనా?

సీఎం మనవడిగా పుట్టడం తప్పా.. మూడు నెలలు నరకం చూశా:నారా లోకేష్

ఒకేసారి 10మంది నామినేషన్ లోకి.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళేది ఎవరంటే?

ముఖేష్.. వర్షిణి వల్లే చెడిపోతున్నాడా?

Big Stories

Advertisement
×