E-Paper
Advertisement

చిన్న వయసులోనే పెద్ద పెద్ద మాటలు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు ఎంతో పరిణతితో ఆలోచిస్తారు

చిన్న వయసులోనే పెద్ద పెద్ద మాటలు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు ఎంతో పరిణతితో ఆలోచిస్తారు
Advertisement

Numerology Mature Kids| కొంతమంది పిల్లలను చూస్తే వారి వయసు కంటే ఎక్కువ పరిణతి ఉన్నట్లు అనిపిస్తుంది. తోటి పిల్లలతో ఆడుకోవడం కంటే పెద్దవాళ్ల మాటలు వినడానికి ఇష్టపడతారు. కుటుంబ విషయాలపై తమ అభిప్రాయాలు చెబుతారు. ఒక్కోసారి పెద్దలు కూడా ఆశ్చర్యపోయేలా మంచి సలహాలు ఇస్తారు. ఇలాంటి పిల్లల ఆలోచనా విధానం వెనుక వారి పుట్టిన తేదీ ప్రభావం ఉంటుందని న్యూమరాలజీ చెబుతోంది. ముఖ్యంగా రెండు ప్రత్యేక మూల అంకాలు ఉన్న పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. మరి ఆ రెండు సంఖ్యల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.

1. మూల అంకం 7.. ఈ పిల్లలు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు

ఏ నెలలోనైనా 7, 16, 25 తేదీల్లో పుట్టిన పిల్లల మూల అంకం 7 అవుతుంది. న్యూమరాలజీ ప్రకారం ఈ సంఖ్యకు ఆలోచన, పరిశీలన, ఆధ్యాత్మికత వంటి లక్షణాలతో సంబంధం ఉంది. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడటం కంటే ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినడానికి ఇష్టపడతారు. ఇతరుల ప్రవర్తనను గమనిస్తూ ఉంటారు. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
చిన్న వయసులోనే విషయాలను లోతుగా ఆలోచించడం వల్ల వీరు తమ వయసు కంటే పెద్దవారిలా ప్రవర్తిస్తారు. తోబుట్టువులతో ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఎక్కువ ఓర్పు, అర్థం చేసుకునే గుణాన్ని చూపిస్తారు. న్యూమరాలజీ ప్రకారం.. వీరు ఒంటరిగా సమయం గడపడానికే ఎక్కువగా ఇష్టపడతారు. సాధారణ విషయాల కంటే ఆసక్తికరమైన చర్చలకు ప్రాధాన్యత ఇస్తారు. సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. వీరి అభిప్రాయాలు చూసి ఒక్కోసారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను సైత్యం ఆచ్చ ఆశ్చర్యపోతారు.

2. మూల అంకం 8.. ఈ పిల్లలు బాధ్యతగా, స్వతంత్రంగా ఉంటారు

Advertisement

ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీల్లో పుట్టిన పిల్లల మూల అంకం 8 అవుతుంది. న్యూమరాలజీలో ఈ సంఖ్యను శని గ్రహంతో అనుసంధానిస్తారు. శని క్రమశిక్షణ, సహనం, బాధ్యతలకు ప్రతీకగా భావిస్తారు.
ఈ పిల్లలు చిన్నప్పటి నుంచే స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. కుటుంబ విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ముఖ్యమైన నిర్ణయాల్లో తమ అభిప్రాయాలను చెప్పడానికి ప్రయత్నిస్తారు.
కొన్నిసార్లు వీరి ఆత్మవిశ్వాసం మొండితనంలా కనిపించవచ్చు. చేసిన తప్పును వెంటనే అంగీకరించకపోవచ్చు. చెప్పిన మాట వినడానికి కూడా కొంత సమయం తీసుకోవచ్చు.
అయితే తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా ఉంటే వీరిలో బాధ్యతాయుతమైన లక్షణాలు మరింత పెరుగుతాయని నమ్ముతారు. తమ అభిప్రాయాలకు విలువ ఇచ్చే తల్లిదండ్రులను వీరు ఇష్టపడతారు. క్రమశిక్షణతో పాటు పట్టుదల, నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో కనిపించవచ్చని న్యూమరాలజీ చెబుతోంది.

Also Read: ముఖం చూడగానే మనసులో ఏముందో పట్టేస్తారు.. ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు ఫేస్ రీడింగ్‌లో దిట్ట

3. ఈ పిల్లలను తల్లిదండ్రులు ఎలా ప్రోత్సహించాలి?

Advertisement

మీ పిల్లల మూల అంకం 7 లేదా 8 అయితే వారిపై చిన్నప్పటి నుంచే పెద్దవారిలా ప్రవర్తించాలనే ఒత్తిడి పెట్టకండి. ప్రతి పిల్లవాడికి ఆడుకోవడానికి, ఆనందంగా గడపడానికి తగిన సమయం అవసరం.
వారితో స్నేహపూర్వకంగా ఉండండి. వారి అభిప్రాయాలను వినండి. భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచే అవకాశం ఇవ్వండి. స్వతంత్రంగా ఆలోచించేలా ప్రోత్సహిస్తూ అవసరమైనప్పుడు సరైన మార్గదర్శకత్వం అందించండి.

Also Read: ఉద్యోగానికి దరఖాస్తు చేయనే లేదు.. విద్యార్థికి రూ.50 లక్షలు జీతం ఇస్తామని రెండు కంపెనీ ఆఫర్లు

గుర్తుంచుకోవాల్సింది

న్యూమరాలజీ అనేది సంప్రదాయ నమ్మకం మాత్రమే. పుట్టిన తేదీ ఆధారంగా పిల్లల వ్యక్తిత్వాన్ని శాస్త్రీయంగా నిర్ణయించలేం. ప్రతి పిల్లవాడి ఎదుగుదల, ఆలోచనా విధానం భిన్నంగా ఉంటాయి. కాబట్టి బర్త్ మూల అంకంల కంటే వారి ప్రత్యేకతలు, అవసరాలను అర్థం చేసుకోవడమే తల్లిదండ్రులకు ముఖ్యం.

Related News

30 ఏళ్ల వయసులోనే తెల్ల జుట్టు.. హెయిర్ కలర్ ఎన్నిసార్లు వేయాలి.. ఈ జాగ్రత్తలు పాటించండి

భారీ పెరిగిన పాల ధరలు.. అయినా నో టెన్షన్.. తక్కువ ఖర్చుతో పోషకాలు ఇచ్చే 7 ఫుడ్స్ ఇవిగో

1911లో చనిపోయిన దొంగ.. 66 ఏళ్లుగా ఆ శవాన్ని పూడ్చలేదు.. కాల్చలేదు, చివరికి..

పెసరపప్పుతో నమక్‌పారా.. ఇలా చేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా అదిరిపోద్ది!

ఎప్పుడూ పకోడీలు, బజ్జీలేనా? ఈసారి ఇలా అటుకుల బొండాలు చేసుకుని తిని చూడండి!

ఖరీదైన క్రీములు అక్కర్లేదు..డ్రై హ్యాండ్స్‌ను సాఫ్ట్‌గా మార్చే నేచురల్ టిప్స్!

పాత ట్రెండ్స్‌కి నో.. కొత్త వైబ్స్‌కి యస్.. Gen Z హాంగ్ అవుట్ సీక్రెట్స్!

Big Stories

Advertisement
×