Bigg Boss 10: బిగ్ బాస్ సీజన్ 10 లోకి అగ్నిపరీక్ష సీజన్ 2 లో తనదైన పర్ఫామెన్స్ తో జడ్జెస్ ను మెప్పించి, కామనర్ గా అడుగు పెట్టాడు. రోహిత్ కామనర్ అయినప్పటికీ మొదటి మూడు వారాల్లోనే తనదైన ఆట తీరుతో, మాట తీరుతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హౌస్ లోకి వచ్చిన మొదటి వారమే సెలబ్రిటీలకు టార్గెట్ అయ్యాడు అంటే రోహిత్ పై క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన ఆట,మాట తీరుతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఖచ్చితమైన పాయింట్ పెడుతూ అటు నామినేషన్స్ లో కూడా సత్తా చాటారు రోహిత్.
అలాంటి రోహిత్ షాలినితో లవ్ ట్రాక్, గేమ్ పై ఫోకస్ పెట్టకపోవడం, త్రిగుణ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం, నోరు జారి దుర్భాషలాడడం, పైగా ప్రతివారం హోస్ట్ నాగార్జున చెప్పినా తన మాట తీరును మార్చుకోకపోవడం లాంటి పలు కారణాలవల్ల ఎట్టకేలకు ఎనిమిదవ వారం హౌస్ నుండి బయటకు వచ్చేశారు. అయితే రోహిత్ విజేత కావాల్సిన వాడు అని అటు ఆడియన్స్ మాత్రమే కాదు సాక్షాత్తు బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ కూడా ఈ మాట చెప్పడం సర్వత్ర వైరల్ గా మారింది. రోహిత్ ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో ఆయన అభిమానులే కాదు ఆడియన్స్ కూడా రోహిత్ ది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని, త్రిగుణ్ ను విజేతగా చేయడానికి రోహిత్ ను ఎలిమినేట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బిగ్ బాస్ పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇలాంటి సమయంలో తాజాగా రోహిత్ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 24 x7 స్ట్రీమింగ్ లో భాగంగా జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ కి కళ్ళకు గంతలు కట్టి మరీ తీసుకొచ్చినట్లు చూపించారు. రోహిత్ రీఎంట్రీ తో సుధీర్ తో పాటు మిగతా కంటెస్టెంట్స్ కూడా షాక్ అయినట్లు మనం ఆ లీక్ అయిన వీడియోలో చూడవచ్చు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రోహిత్ కనుక రీఎంట్రీ ఇస్తే మాత్రం రోహిత్ 2.0 చూస్తారు అనే కామెంట్లు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. మరి నిజంగానే రోహిత్ రీఎంట్రీ ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఎలిమినేషన్ తర్వాత ఇంటికి వెళ్ళిన రోహిత్ తొలిసారి తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తన మేనల్లుడిని చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా మురిసిపోతున్న ఫోటోని ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. మొత్తానికి అయితే హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షేర్ చేసిన ఈ క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read: గురూజీ – వెంకీ మ్యాజిక్ వర్కౌట్ కాలేదా? ఏకంగా అన్ని కోట్లు నష్టమా?