E-Paper
Advertisement

మీ ఇంట్లో భార్య,బిడ్డలు లేరా.. నెగెటివ్ ట్రోల్స్ పై ప్రియాంక ఫైర్!

మీ ఇంట్లో భార్య,బిడ్డలు లేరా.. నెగెటివ్ ట్రోల్స్ పై ప్రియాంక ఫైర్!
Advertisement

Priyanka Jain: ప్రియాంక జైన్ ప్రస్తుతం తన ప్రియుడు శివకుమార్ ను గట్టిగా ప్రమోట్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శివకుమార్ బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss 10)కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్లిన శివకుమార్ (Shiva Kumar)అద్భుతమైన ఆటతీరుతో ముందుకు వెళ్తున్నారు అయితే ముఖేష్ వర్షిని వంటి తదితరులు ఉద్దేశపూర్వకంగానే శివకుమార్ ను టార్గెట్ చేస్తున్నారంటూ ప్రియాంక జైన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ షేర్ చేస్తూ ఉన్నారు.

నెగిటివ్ కామెంట్లతో టార్గెట్..

ఈ నేపథ్యంలోనే హౌస్ లో ఉన్నటువంటి కొంతమంది కంటెస్టెంట్ల పిఆర్ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రియాంక జైన్ ను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఒక అమ్మాయి గురించి మాట్లాడని విధంగా బూతు పదాలతో కామెంట్లు చేయడంతో ప్రియాంక జైన్ ఈ నెగిటివ్ కామెంట్ లపై స్పందిస్తూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అసలు నా గురించి ఎందుకు ఇలాంటి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు? నేను కేవలం నా శివ్ కోసం స్టాండ్ తీసుకున్నాను ఆ బాధ్యత నాది మీకు ఇష్టమైతే వీడియోస్ చూడండి లేదంటే ఫోన్ పక్కన పెట్టండి కానీ ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటి అంటూ మండిపడ్డారు.

సైబర్ క్రైమ్ కు కంప్లైంట్..

Advertisement

అసలు ఒక అమ్మాయిని ఉద్దేశించి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా మీకు భార్య పిల్లలు ఉన్నారు కదా వారిని కూడా ఇలాగే మాట్లాడతారా? అంటూ ప్రియాంక జైన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ కార్యక్రమం గురించి అక్కడ జరుగుతున్నదే తాను మాట్లాడుతున్నాను. శివను టార్గెట్ చేయడం కోసం నాపట్ల ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని తెలిపారు అయితే ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటే తాను కూడా చూస్తూ ఊరుకోనని కచ్చితంగా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని ప్రియాంక జై ఈ సందర్భంగా తెలియజేశారు.

Advertisement

హౌస్ లో రోహిత్, త్రిగుణ్ ,ముఖేష్ వర్షిని ఆడుతున్న ఆట తీరు చూసి కామెంట్స్ చేయండి అని తెలిపారు. ఇక రోహిత్ ఎలిమినేట్ కావడంతో అది అన్ ఫైర్ ఎలిమినేషన్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అది అన్ ఫైర్ ఎలిమినేషనా అంటూ ఈమె మండిపడ్డారు. ప్రతివారం రోహిత్ ఆట గురించి నాగ్ సర్ తనని హెచ్చరిస్తూనే ఉన్నప్పటికీ ఆయన ఏమాత్రం మారలేదనీ, హౌస్ లో ఆడాలి, గెలవాలి అనే తాపత్రయం రోహిత్ లో ఎక్కడ కనిపించలేదని తెలిపారు.వాళ్ళు ఏం మాటాడుతున్నారో మీకు వినిపించలేదా? వాళ్ళు ముందు నుంచి ఉన్నారని ఓట్లు వేసేస్తున్నారు అంటూ ఈమె మండిపడ్డారు. ఇక రోహిత్ మాట్లాడుతూ రాడ్ కు నూనె పూసి అంటూ మాట్లాడిన మీకు వినపడదు గుడ్డిగా ఓట్లు వేసేస్తున్నారంటూ రోహిత్ ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుతూ అది అన్ ఫైర్ ఎలిమినేషన్ కాదని, కర్మ రిటర్న్స్ అంటూ ప్రియాంక షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Also Read: ప్రాణభయంలో బిగ్ బీ..బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ సాయంతో ఫ్యాన్స్ కు అభివాదం!

Related News

రోహిత్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా?

ఎట్టకేలకు లైవ్ లో దీపికాకు ప్రపోజ్ చేసిన జీవన్!

బిగ్ బాస్ హౌస్ లో ప్రేమాయణం.. దెబ్బకు రంగంలోకి పేరెంట్స్.. కట్ చేస్తే!

నాన్న అరెస్ట్ తట్టుకోలేకపోయాను..పవన్ కళ్యాణ్ పై నారా లోకేష్ కామెంట్స్ వైరల్!

ఝాన్సీ ఎలిమినేషన్ కి ముఖేష్ కారణమా.. హీటెక్కిన నామినేషన్ వార్!

అదొక్కటి ఉంటే చాలు.. పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాస్ అశ్విని!

8 వారాలకు గానూ రోహిత్ రెమ్యూనరేషన్ ఎంత? ఎలిమినేషన్ కి అసలు కారణం?

Big Stories

Advertisement
×