Karthika Deepam : ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా ఛానెల్ ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ కు అడ్డా.. ఇప్పటివరకు ఎన్నో హిట్ సీరియల్స్ స్టార్ మా లో ప్రసారమవుతున్నాయి. గతంలో భారీ సక్సెస్ ని అందుకున్న సీరియల్స్ విషయానికి వస్తే.. కార్తీకదీపం సీరియల్ కూడా అందులోకి వస్తుంది. ఈ సీరియల్ సక్సెస్ఫుల్గా ఎన్నో ఎపిసోడ్లు సాగింది. ప్రస్తుతం ఈ సీరియల్ గా కార్తీకదీపం 2 ప్రసారం అవుతుంది. ఇందులో మెయిన్ లీడ్ లో నటించిన దీప అలియాస్ వంటలక్క పాత్రకు జనాల్లో ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు.. ఆమె తెలుగు నటి కాదు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఆమె నటనకు అందరు ఫిదా అయ్యారు. అందుకే సీక్వెల్ గా ప్రసారం అవుతున్న సీరియల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.. అయితే వంటలక్క కు తెలుగు నాట క్రేజ్ ఎక్కువ.. అయితే ఆమె రెమ్యూనరేషన్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
వంటలక్క రెమ్యూనరేషన్..
కార్తీక దీపం సీరియల్ లోని వంటలక్క పాత్ర జనాలను ఎంతగా జనాలకు ఎంతగా నచ్చేసిందో అందరికి తెలుసు.. ఆ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ పేరు ప్రేమీ విశ్వనాథ్. ఈమె స్వతహాగా మలయాళీ.. ఈ సీరియల్ బాగా క్రేజ్ ను అందించింది.. దాంతో అమ్మడుకు సీజన్ 2 లో కూడా ఛాన్స్ వచ్చేసింది .. ఆమె ప్రతి ఇంట్లోనూ మనిషి అయిపోయింది ఈ మలయాళీ అందం ప్రేమి విశ్వనాథ్. ఈ భామ రెమ్యూనరేషన్ కూడా గట్టిగానే అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్క రోజు సీరియల్‌లో నటించినందుకు గాను 1 లక్ష రూపాయలు తీసుకొంటున్నారు. ఆ లెక్కన నెలకు రూ. 12 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఈ రేంజులో స్టార్ హీరోకు కూడా రాదు..
నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న వంటలక్క..
2017లో ప్రారంభంలో ప్రారంభమైన కార్తీకదీపం సీరియల్ నటించి తన ప్రత్యేక గుర్తింపు చెప్పుకుంది. ఎంతలా అంటే.. ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం అనే పాట వినిపిస్తే చాలు.. బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. దాదాపు ఐదున్నర ఏళ్ల పాటు ఈ సీరియల్ కొనసాగింది. మహిళా మణులు వంటలక్క క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అయ్యారు. మార్చి 25 నుంచి బుల్లితెరపై ‘కార్తీక దీపం’ సీరియల్ సందడి మళ్లీ మొదలు కావడంతో మహిళా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే ఈ సీరియల్లోని వంటలక్క రెమ్యూనరేషన్ మాత్రమే కాదు ఆమె హైదరాబాద్ కు షూటింగ్ కు రావడం కోసం నిర్మాతలకు బోలెడు ఖర్చులు కూడా.. కేరళ నుంచి ఫ్లైట్ టిక్కెట్, హోటల్ రూమ్, ట్రావెల్ ఖర్చులు, ఫుడ్ కు, ఆమె అసిస్టెంట్ కు కలిపి మొత్తం లక్షకు పైగానే అవుతుంది. ఈ లెక్కన చూస్తే ఆమెకు రోజుకు 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా నిర్మాతలకు పెద్ద భారమే. ఒక్క సీరియల్ కు ఈ రేంజులో పెట్టడం మామూలు విషయం కాదు. అయితే ఈ సీరియల్ బాగా పోతుంది కాబట్టి అది పెద్ద ఖర్చులా భావించలేదు.. ఇక ప్రస్తుతం ఈ సీరియల్ సక్సెస్ అయ్యింది కాబట్టి సీజన్ 3 కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.