Rithu Chowdary : తెలుగు బుల్లితెర పై జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయిన నటి రీతూ చౌదరి.. అందం, చలాకీతనంతో పాటు తనదైన కామెడీ టైమింగ్‌తో వరుస అవకాశాలను దక్కించుకున్నారు రీతూ. అతి తక్కువ కాలంలోనే ఈమె బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం తెగ ట్రై చేస్తుంది. అందుకే సోషల్ మీడియాలో సెగలు పుట్టించేలా హాట్ ట్రీట్ ఇస్తుంది. ఆమె ఫోటోల పై నెట్టింట అభ్యంతరాలు వినిపించిన పట్టించుకోకుండా గ్లామర్ డోస్ పెంచుతు ఫోటోలను నింపేస్తూ విమర్శలను అందుకుంటుంది.. ఇక తాజాగా ఈ హాట్ బ్యూటీ రీతూ ఓ భారీ స్కామ్ లో ఇరుక్కున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. అసలేమైంది..?
ఏపీ ల్యాండ్ స్కామ్ లో రీతూ…
జబర్దస్త్ బ్యూటీ రీతూ ఏపీలోని భారీ ల్యాండ్ స్కామ్ లో ఇరుక్కుంది.. ఏపీలో 700 కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్ ఇప్పుడు సంచలనంగా మారింది. విజయవాడ, ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లు ఓ ముఠా కొట్టేసిందని వార్త కలకలం రేపుతుంది. కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు చేయించారని సబ్ రిజిస్టర్ ధర్మ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ లో జరిగిన భారీ స్కామ్ గురించి బయట పెట్టారు. ఏపీ మాజీ సీఎం జగన్ అనుచరులు, చీమకుర్తీ శ్రీకాంత్, ఆయన భార్య రీతూ చౌదరి పేరు మీద భారీగా ఆస్తులు ఉన్నట్లు ఆయన అన్నారు. రీతూ అసలు పేరు వనం దివ్య.. చీమకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య.. వీరిద్దరి తో పాటుగా మరికొంత మంది పేరు మీద భూములు రిజిస్టేషన్ అయ్యినట్లు వార్తలు సింగ్ మీడియా ముఖంగా చెప్పారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సింగ్ రాసిన లేఖ ఆధారంగా ఈ స్కామ్ బయట పడింది. ఇప్పటివరకు జబర్దస్త్ లో స్కిట్స్ చేసుకుంటూ వచ్చిన రీతూ అలియాస్ వనం దివ్య ఈ స్కామ్ లో ఉండటం చర్చనీయాంసంగా మారింది. మరి దీనిపై అసలు నిజాలు ఏంటనేది రీతూ చౌదరి స్పందిస్తేనే తెలుస్తుంది. ఆమె ఎలా రియాక్ట్ అవుతారో, పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేదా ఈమె నిజానిజాలను బయట పెడుతుందా అన్నది ఆసక్తిగా మారింది.
ఇక ఈమె కేరీర్ విషయానికొస్తే…యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన రీతూ చౌదరి.. కొన్నేళ్లలోనే పలు సీరియల్స్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. అయితే జబర్దస్త్‌లోకి ఎంటరై జనానికి బాగా నోటెడ్ అయ్యింది. జబర్దస్త్‌తోనే కాకుండా బుల్లితెర పై ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటుగా పలు షోలలో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ రెండు కార్యక్రమాలే కాకుండా తెలుగు బుల్లితెరపై పలు షోలలో తన హవా చూపిస్తోంది రీతూ.. హైపర్ ఆది టీమ్‌లో ఉన్నప్పుడు ఆయనకు పలుమార్లు స్టేజ్ మీదే ఐ లవ్ యూ చెప్పి అందరికీ షాకిచ్చింది రీతూ చౌదరి. దీంతో వీరిద్దరిపై రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. కానీ ఇదంతా షో కోసమేనని అంతా సర్దిచెప్పుకున్నారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాంత్ అనే వ్యక్తితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి షాకిచ్చింది…