OTT Movie : కొంతమంది అమ్మాయిలనే కాదు, అమ్మాయిల రూపంలో ఉండే బొమ్మకనపడితే చాలు అదే ఆలోచిస్తూ ఉంటారు. వీళ్లకు ఇక వేరే పని ఉండదు. లైంగిక వ్యసనానికి బానిస అయిపోతారు. ఈ కాన్సెప్ట్ తో వచ్చిన ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘షేమ్‘ (Shame). ఈ మూవీలో ఏకాంత వీడియోలు చూస్తూ పెళ్లి కూడా చేసుకోకుండా ఉండిపోతాడు హీరో. ఈ లైంగిక వ్యసనం నుంచి హీరో బయటపడతాడా? అనే స్టోరీ చుట్టూ మూవీ నడుస్తుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరో ఒక కంపెనీలో మంచి పొజిషన్లో ఉంటాడు. ఇతనికి 40 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా, అమ్మాయిలతో జల్సా చేస్తుంటాడు. నచ్చితే డబ్బులు ఇచ్చి ఇంటికి కూడా తెచ్చుకుంటాడు. ఒకరోజు ట్రైన్లో వస్తుండగా ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు. ఇంటికి వచ్చాక ఆమెను తలుచుకుంటూ సంతృప్తి చెందుతాడు. అంతలా ఆ వ్యసనానికి బానిస అవుతాడు. అయితే హీరో ఉండే ఇంటికి అతని చెల్లెలు వస్తుంది. బాయ్ ఫ్రెండ్ మోసం చేయడంతో వచ్చానని చెప్తుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఫంక్షన్ కి వెళ్తారు. అక్కడ హీరో ఫ్రెండ్ వీళ్లిద్దరిని కలుస్తాడు. హీరో చెల్లెలు అతనితో క్లోజ్ గా మూవ్ అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత హీరో చెల్లెలు, హీరో ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తుంది. అక్కడికి వచ్చిన హీరోకి అది చూసి మండుతుంది. ఎందుకంటే లోపల నుంచి అరుపులు వినపడుతూ ఉంటాయి. ఆ ఫ్రెండ్ తనకు పై స్థాయి ఉద్యోగి కావడంతో ఏమీ అనలేకపోతాడు. ఆ తర్వాత చెల్లెల్ని ఇంట్లో నుంచి పంపించేస్తాడు.
ఇక్కడే ఉంటాను అని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపొమ్మంటాడు. ఆమెకు ఆ ప్రాంతంలో ఇతను తప్ప ఎవరూ తెలియదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా హీరో లిఫ్ట్ చేయడు. ఆ తర్వాత ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయితో ఏకాంతంగా గడుపుతాడు. అయితే ఫీలింగ్ మాత్రం పెద్దగా అనిపించదు. ఆ తర్వాత రైల్వే స్టేషన్ కి వస్తాడు. అక్కడ ఎవరో సూసైడ్ చేసుకున్నట్లు తెలుసుకుంటాడు. కంగారుపడి తన చెల్లెలికి ఫోన్ చేస్తాడు. ఎంతసేపైనా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, ఆ తర్వాత తెలుస్తుంది అతని చెల్లెలు సూసైడ్ చేసుకోబోయిందని. తనకు సారీ చెప్పి ఇంటికి తెచ్చుకుంటాడు. చివరికి హీరో ప్రవర్తనలో మార్పు వస్తుందా? ఈ వ్యసనానికి ముగింపు పలుకుతాడా? కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.