OTT Movie : ఓటీటీలో ఒక పిచ్చెక్కించే మూవీ ఇప్పటికీ మంచి వ్యూస్ తో నడుస్తోంది. ఈ చిత్రం భారతదేశంలో విడుదల కావడానికి ముందు సెన్సార్ బోర్డ్ (CBFC) నుండి నిషేధాన్ని ఎదుర్కొంది. కానీ చివరకు విడుదలై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇది నలుగురు మహిళల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ (Lipstick Under My Burkha). 2016 లో వచ్చిన ఈ బ్లాక్ కామెడీ-డ్రామా మూవీకి అలంకృత శ్రీవాస్తవ దర్శకత్వం వహించారు. దీనిని ప్రకాశ్ ఝా నిర్మించారు. ఇందులో రత్నా పాఠక్ షా, కొంకణా సేన్ శర్మ, ఆహానా కుమ్రా, ప్లబితా బోర్థాకుర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సుశాంత్ సింగ్, విక్రాంత్ మస్సీ, శశాంక్ అరోరా సహాయక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా నలుగురు మహిళల జీవితాలను, వారి కోరికలను, సమాజం పై తిరుగుబాటు ధోరణిని చూపిస్తుంది. IMDB లో ఈ సినిమాకి 6.8 / 10 రేటింగ్ ఉంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ భోపాల్‌లోని ఒక రద్దీగా ఉండే ప్రాంతంలో నలుగురు మహిళల జీవితాలను అనుసరిస్తుంది. వీళ్ళు సమాజం విధించిన ఆంక్షల మధ్య తమ స్వేచ్ఛ, కోరికల కోసం పోరాడుతారు. ఈ నలుగురు మహిళల వయసులో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఒకే భవనంలో నివసిస్తుంటారు.
ఉషా పర్మార్ : 55 ఏళ్ల ఈ మహిళ భర్త లేకపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటుంది. ఉషాను అక్కడ ఉన్నవాళ్ళు ఆంటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆమె ఒక గౌరవనీయ మహిళగా ఉన్నప్పటికీ, ఆమె లోపల ఒక యువతికి ఉన్న కోరికలు ఇంకా జీవించి ఉంటాయి. ఆమె రహస్యంగా Lipstick Dreams అనే శృం*గార నవల చదువుతూ, తన యవ్వన ఫోటోలను చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటుంది. వయసులో ఉన్న ఒక స్విమ్మింగ్ కోచ్ జస్పాల్‌తో ఫోన్ మాట్లాడుతూ తన కోరికలను తీర్చుకుంటుంది. అయితే ఈ విషయం బయటికి రావడంతో సమాజంలో ఇబ్బందుల్ని ఎదుర్కుంటుంది. ఉషా కథ వృద్ధాప్యంలో స్త్రీల కోరికలు, ఒంటరితనం గురించి చూపిస్తుంది.
రెహానా అబిది: రెహానా ఒక కాలేజ్ విద్యార్థిని. ఆమె తన ముస్లిం కుటుంబం నడిపే బుర్ఖా దుకాణంలో కుట్టు పని చేస్తుంటుంది. ఆమె కుటుంబం ఆమెను బుర్ఖా ధరించమని బలవంతం చేస్తుంది. కానీ ఆమె కాలేజ్ లో బుర్ఖాను తీసేసి, జీన్స్ ధరించి, మేకప్ వేసుకుని ఒక సింగర్ కావాలనే కలలు కంటుంది. ఆమె లిప్‌స్టిక్‌ను దొంగిలిస్తూ, బార్‌లలో రహస్యంగా పాడుతూ తన గుర్తింపును వెతుక్కుంటుంది. రెహానా కథ యువత స్వేచ్ఛ కోసం చేసే తిరుగుబాటును చూపిస్తుంది.
లీలా: లీలా ఒక బ్యూటీషియన్. ఆమె తన సొంత బ్యూటీ పార్లర్ నడుపుతూ, తన ప్రేమికుడు అర్షద్ తో కలిసి ప్రపంచాన్ని చూడాలని కలలు కంటుంది. ఆమె తన మేకప్ సేవలు, అర్షద్ ఫోటోగ్రఫీని డెస్టినేషన్ వెడ్డింగ్ కంపెనీలకు అందించడం ద్వారా ఉచిత ప్రయాణ అవకాశాలను పొందుతుంది. అయితే ఆమె కుటుంబం ఆమెను ఒక అరేంజ్డ్ మ్యారేజ్‌కు ఒత్తిడి చేస్తుంది. లీలా కథ స్త్రీల ఆశయాలు, సమాజం పెట్టే ఆంక్షల మధ్య చిక్కుకునే సన్నివేశాలను చూపిస్తుంది.
షిరీన్ అస్లాం : షిరీన్ బుర్ఖా ధరించే ముగ్గురు పిల్లల తల్లి. ఆమె ఒక సేల్స్‌వుమన్ గా పని చేస్తుంటుంది. ఆమె భర్త ఒక శాడిస్ట్ . ఆమెను ఉద్యోగం చెయ్యద్దని ఒత్తిడి తెస్తాడు. కానీ షిరీన్ రహస్యంగా సేల్స్‌వుమన్‌గా పనిచేస్తూ తన తన గుర్తింపు కోసం పోరాడుతుంది. షిరీన్ కథ ఎంతో మంది మహిళలు ఎదుర్కొనే దాంపత్య హింసను చూపిస్తుంది.
ఈ నలుగురు మహిళల స్టోరీ వారి తిరుగుబాట్లను, గుర్తింపును, కలలను, కోరికలను అనుసరిస్తుంది.
Read Also : కర్టెన్ చాటున దెయ్యం… అది ఆడే దాగుడుమూతల ఆటకు పార్ట్స్ ప్యాక్