Cooli Movie : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం కూలీ.. ఆ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పాటు ఉపేంద్ర, సాబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్ సహా అనేక మంది సినిమాలో ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్న కూలీ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆగస్టు 14న ఈ సినిమాను థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. ఇదిలా ఉండగా కూలి మూవీ తెలుగు రైట్స్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఈ మూవీ రైట్స్ ని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read :ఉన్న ఆ ఒక్కటి కూడా ఆగిపోయింది… సమంతకు ఎవరైనా చేతబడి చేశారా ఏంటి?
‘కూలీ’ తెలుగు రైట్స్ ఆయనకే దక్కాయా..?
రజినీ కాంత్ సినిమాలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలు కొన్ని తెలుగులో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కూలీ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు తలైవా.. కూలీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుండగా.. తెలుగు థియేట్రికల్ రైట్స్ కోసం కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.. దాదాపుగా రూ. 44 కోట్ల డీల్ అని.. థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అన్నపూర్ణ స్టూడియోస్ తరపున నాగార్జున కూలీ రైట్స్ ను కొన్నారని టాక్ వినిపించింది.. ఈ మూవీ రైట్స్ కోసం అన్నపూర్ణ స్డూడియోస్ తో పాటు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, దిల్ రాజు, ఆసియన్ సునీల్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పోటీ పడుతున్నాయన్న విషయం తెలిసిందే..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ మూవీ తెలుగు రైట్స్ ను ముందుగా నాగార్జున భారీ ధరకు కొనుగోలు చేశారట. అయితే ఆ తర్వాతఆసియన్ సునీల్ కూలీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ ఆఫర్ కు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది.. నాగార్జున 44 కోట్లకు సినిమాను అమ్మినట్లు ఇండస్ట్రీలో టాక్.. గతంలో జైలర్ కూడా ఇదే సంస్థ రిలీజ్ చేసింది. అది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు సన్ పిక్చర్స్ సంస్థ తో కూలీ మూవీకి గాను డీల్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం..
కూలీ కోసం నాగార్జున రెమ్యూనరేషన్..?
నాగార్జున సోలో గా కన్నా తమిళ హీరోలతో చేస్తున్న సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. రీసెంట్ గా తమిళ హీరో ధనుష్ తో కలిసి కుబేర చిత్రంలో నటించారు. ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇందులో నటించినందుకు నాగార్జున 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్.. కానీ కూలీ మూవీకి 18 నుంచి 20 కోట్ల వరకు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏ సినిమా కోసం అటు తమిళ, ఇటు తెలుగు రజినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..