Sadanna Shortfilms:వందల షార్ట్ ఫిలిమ్స్ లో తనదైన కామెడీతో ఆడియన్స్ ని అలరించిన సదానంద ఆలియా సదన్న తను షార్ట్ ఫిలిమ్స్ లోకి ఎలా వచ్చాడు వంటి ఆసక్తికరమైన విషయాలని ఇలా చెప్పుకొచ్చాడు.చిన్నప్పుడు సినిమాల్లో తెలంగాణ యాసను కొన్ని పాత్రలకు మాత్రమే పెట్టేవారని బాధపడిపోయేవాడట. అ భాషను మాట్లాడే వారిని కొన్నిసార్లు చిన్నచూపు చూసే వారిని ఆ బాధ తనలో ఉండేదని చెప్పుకొచ్చాడు.
2006లో ఆలోచన మొదలైతే 2007లో
అలాంటిది తన భాషను ఎందుకు స్క్రీన్ పై చూపెట్టకూడదని ఆలోచన మొదలైందట సదన్నకి. ముఖ్యంగా తను మాట్లాడే తెలంగాణ బాషకి మంచి గుర్తింపు గౌరవం రావాలని షార్ట్ ఫిలిమ్స్ తీయాలని నిర్ణయించుకున్నానని చెప్పుకొచ్చాడు .అలా 2006లో ఆలోచన మొదలైతే 2007లో మొదటి షార్ట్ ఫిలిం తీశానని చెప్పాడు. అయితే యూట్యూబ్లో పేరు తెచ్చుకోవడం లేదా డబ్బులు సంపాదించడం తన లక్ష్యం కాదని తన లక్ష్యం అయిదు నిమిషాలు లేదా 10 నిమిషాలులలో ఒక కథ మొత్తం పూర్తయ్యేలా ఒక సినిమా లాగా కంటెంట్ తీయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.
అయితే అప్పట్లో ప్రొఫెషనల్ కెమెరాస్ అందుబాటులో లేకపోవడంతో పెళ్లికి తీసే వీడియో కెమెరాలనే వాడేవారమని, ఎడిటింగ్ కోసం కరీంనగర్ నుంచి హైదరాబాద్ కి తిరిగే వాళ్ళమని, అప్పట్లో ఫెసిలిటీస్ కూడా అంతంతగానే ఉండేవని చెప్పుకొచ్చాడు.లారీ దొరికితే లారీ బస్ దొరికితే బస్సు ఇలా ఏది దొరికితే అది ఎక్కి హైదరాబాద్ కి చేరుకొని రాత్రంతా ఎడిటింగ్ చేయించి మరుసటి రోజు ఉదయాన్నే తిరిగి వచ్చేవాళ్ళం అని ఆనతి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు.
దాదాపు 100కు పైగా షార్ట్ ఫిలిమ్స్
ఇక తాను ఉద్యోగం చేస్తూనే దాదాపు 100కు పైగా షార్ట్ ఫిలిమ్స్ తీశాను అని తెలిపాడు.2000 ప్రాంతంలో సీడీల రూపంలో తన వీడియోలను ప్రేక్షకుల దగ్గరికి తీసుకు పోయేవాడినని అయితే ఆ తర్వాత 2012 నుంచి యూట్యూబ్ లో తన వీడియోలు రావడం మొదలైంది అని తెలిపాడు. ఇక షార్ట్ ఫిలిమ్స్ కోసం ఉద్యోగం అయిపోయిన తర్వాత దానికి టైం ఇచ్చే వాడిని అని,ఇంట్లో పనులు చూసుకుని ఎడిటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలిపాడు.
ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు ఇష్టమైన కళారంగంలో పని చేసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించానని తెలిపాడు. ఇక తన వీడియోలు చూసి ప్రేక్షకులు సంతోషపడటం, చేసిన పనిని గుర్తించడం తనకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చిందని, ఆడియన్స్ మొహాల్లో సంతోషంచూసినప్పుడల్లా మరింత బాధ్యతగా పని చేయాలని అనిపించేదని తెలిపాడు.
నమ్మిన వ్యక్తులే మోసం
ఇక తను తీసే షార్ట్ ఫిలిమ్స్ లో ప్రతి కథలోని ఒక ప్రాబ్లం తీసుకొని దానికి సొల్యూషన్ చూపించాలనుకుంటున్నానని తెలిపాడు. అయితే ఈ ప్రయాణంలో తనని నమ్మిన వ్యక్తులు మోసం చేశారని,వారి వల్ల ఫైనాన్షియల్ గా నష్టపోయానని ఒక దశలో తనకున్న ఇల్లు కూడా అనుకోవలసి వచ్చిందని వాపోయాడు .అయితే అలాంటి పరిస్థితుల్లో తనకు తన భార్య అండగా ఉందని గుర్తు చేసుకున్నాడు. తన తల్లి తర్వాత అంతగా తనని తన భార్య బాగా అర్థం చేసుకుందని, తను డిసప్పాయింట్ అయినప్పుడు కూడా ఆమె తనని ఎంకరేజ్ చేస్తూ కష్టపడదాం ముందుకు వెళ్దామని ఇంకా ఎంకరేజ్ చేసిందని తెలిపాడు.
”జనానందమే సదానందం”
ఇక పోస్టర్లలో ఉపయోగించే క్యాప్షన్ ”జనానందమే సదానందం” వెనుక ఒక ఆలోచన ఉందని, కళాకారులు చేసే పని ప్రజల కోసమేనని తమ షార్ట్ ఫిలిమ్స్ చూసి ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అయితే అదే నిజమైన సంతోషమని అందుకే అలా పెట్టానని చెప్పుకొచ్చాడు. ఫోన్లో అందరూ పలకరిస్తే హలో అంటారని ,తాను మాత్రం శనార్తి అని పలకరిస్తానని చెప్పుకొచ్చాడు .పెద్దలు ఉపయోగించే ఈ పదంలో గొప్ప సంస్కారం ఉందని చెప్పాడు .
పేరు తెచ్చిన షార్ట్ ఫిలిమ్స్
ఇక పిల్లల గురించి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమకు వచ్చిన దానిని పిల్లలపై రుద్దకూడదు అని, పిల్లలకి ఏది ఇష్టం అయితే అదే చేయించాలని తెలిపాడు. ప్రతి ఒక్కరు ఏ రంగంలో ఇష్టం ఉంటే అటువైపుగా వెళ్లాలని చెప్పాడు.ఇక సదన్నకి పేరు తెచ్చిన షార్ట్ ఫిలిమ్స్ చూస్తె ”కొంపముంచిండురా..కొడుకు”,” పెట్టింది తిను పోసింది తాగు..”,” మలుసుక పడ్డడు…”,”పులి సంపతి”,” చిల్లర లొల్లి”,
”బాచిలర్ భద్రన్న.” వంటివి చెప్పవచ్చు.మొత్తంగా చిన్న స్థాయి నుండి మొదలై ఇపుడు కొన్ని కోట్ల మందిని తనదైన కామెడీతో నవ్విస్తున్న సదన్న ని మెచ్చుకోవాల్సిందే !
ALSO READ :నాన్న చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న సదన్న!