E-Paper
Advertisement

నాన్న చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న సదన్న!

నాన్న చనిపోయిన రోజు ఏం జరిగిందో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న సదన్న!
Advertisement

Sadanna RS Nand:ఆర్ఎస్ నంద.. ఈ పేరు చెబితే ఎవరికీ సరిగ్గా తెలియకపోవచ్చు ఏమో. కానీ సదన్న అనగానే ఈజీగా గుర్తుపట్టేస్తారు. తనదైన కామెడీతో ఎన్నో వందల షార్ట్ ఫిలిమ్స్ లో అలరించిన సదన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలని ఇలా చెప్పకొచ్చాడు .సదన్న విషయానికి వస్తే తనది తెలంగాణలోని కరీంనగర్. ఉపాధ్యాయుడైనప్పటికీ కామెడీ షార్ట్ ఫిలిమ్స్ తో విశేషంగా అలరిస్తున్నాడు. అయితే సదన్న ఈ స్థాయికి కి చేరడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఇలా చెప్పుకొచ్చాడు.

తనకి చిన్నప్పటినుంచి కళలు అంటే ఇష్టమని, ముఖ్యంగా సినిమాలు, నాటకాలు, కథలు చెప్పడంపై ఆసక్తి ఉండేదని చెప్పుకొచ్చాడు. ఇక అప్పట్లో గ్రామాల్లో రామాయణ, మహాభారతం నాటకాలను ప్రదర్శిస్తే చూసి వాటిని బాగా చూసి తాను కూడా అలా వేషాలు వేయాలని అనిపించినా అందుకు అవసరమైన మేకప్, వస్తువులు, డబ్బులు లేక ఆ కోరికను నెరవేర్చుకోలేకపోయామని చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన తన తల్లిని కోల్పోవడమే అని చెప్పుకొచ్చాడు సదన్న. దసరా పండుగకు ముందు పరీక్షలు రాస్తుంటే ఒకతను వచ్చి మీ నాన్నకు బాగోలేదని చెప్పడంతో పరీక్ష మధ్యలోనే ఇంటికి వెళ్లానని అయితే ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికి నాన్న చనిపోయాడని బాధపడిపోయాడు .

ఇక తన తండ్రి బతికున్నప్పుడు వ్యవసాయ పనులు చేసేవాడని, కొంత భూమి ఉన్నప్పటికీ ఆదాయం సరిపోక పాలేరుగా కూడా పని చేశాడని చెప్పుకొచ్చాడు .ఇంకా ఒకసారి గేదెలకు గడ్డి వేయడానికి వెళ్ళిన సమయంలో కుక్క కరవడంతో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నాడు సదానంద.ఇక అప్పట్లో కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్ మెంట్ చేయాలో కూడా తెలీదని
దానిపై సరైన అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని తెలిపాడు.

Advertisement

ఇక తండ్రి పోవడంతో తమ భారం మొత్తం తల్లి పైన పడిందని అయినా ఎక్కడ తగ్గకుండా పిల్లల బాధ్యతలు తనపై వేసుకుందని,అలా కష్టపడి తమ అందర్నీ పెంచిందని చెప్పుకొచ్చాడు .అలా తన జీవితంలో ఎక్కువ స్ఫూర్తి పొందింది తన తల్లి నుంచి అని అన్నాడు. ఇక తన తల్లి తనకి తల్లి మాత్రమే కాదని ఒక మంచి ఫ్రెండ్ అని కూడా తెలిపాడు .

తన కుటుంబాన్ని పోషించడానికి తన తల్లి ఎన్నో ఇబ్బందులు పడిందని, రోజంతా పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలందరికీ భోజనం పెట్టి పడుకో పెట్టెదని ఆ తర్వాత తినడానికి ఏం లేకపోయినా నీళ్లు తాగి పడుకున్నదని ఎమోషనల్ అయ్యాడు సదానంద .ఇక తన తల్లి నుంచి తాను 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నానని ఆకలిని ఓర్చుకోవడం, కష్టపడటం, ఓపిక ఉండటం వంటివి తన తల్లి నుంచి నేర్చుకున్నాను అని తెలిపాడు.

ఇక పదో తరగతిలో సరిగ్గా చదువుకోలేదని దాదాపు 15 రోజులపాటు చదువుపై దృష్టి పెట్టలేదని దీంతో టీచర్స్ ఇంటికి పంపించారని వాపోయాడు. దాంతో తన తల్లి మంచిగా చదువుకో బిడ్డ అనే మాట తనలో మార్పు తీసుకొచ్చిందని అదే తనకు ఒక పెద్ద పాటమైందని తెలిపాడు.పదో తరగతిలో మూడవ గ్రేడ్ తో పాస్ అయిన తాను ఇంటర్ కి వచ్చేసరికి క్లాస్ లో ఫస్ట్ గా నిల్చానని గర్వంగా చెప్పుకున్నాడు.

అయితే చదువుకునే రోజుల్లో ఫైనాన్షియల్ గా అంతంత మాత్రంగానే ఉండేదని డిగ్రీ వరకు కూడా సరైన పుస్తకాలు కొనుక్కోలేదని ఇంగ్లీష్ పుస్తకం కోసం తన తల్లి దగ్గర డబ్బులు అడ్డుకొని మిగతా బుక్స్ ని ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. రాత్రి స్నేహితులంతా నిద్రపోయిన తర్వాత వాళ్ళ బుక్స్ తీసుకొని చదువుకునే వాడినని, అలా అందుబాటులో ఉన్న బుక్స్ తోని తన చదువుని కొనసాగించానని చెప్పుకొచ్చాడు.

అలా ఎంఏ ఎకనామిక్స్‌తో పాటు ఎంఏ తెలుగుకూడా పూర్తి చేశానని తనకు తెలుగు అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఇక తాను ప్రస్తుతం ఏ జి టి సెకండరీ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నానని ఒకటి నుంచి ఐదు తరగతి సబ్జెక్టులు చెప్పాల్సి ఉన్నా, తెలుగు అంటే ఇష్టంతో తెలుగు పాఠాలు చెప్పడంలోనే ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుందని తెలిపాడు.

ఒకరోజు సదానంద వాళ్ల గ్రామానికి బురకథ చెప్పే వాళ్ళు వచ్చారని, అది తమ ని బాగా కట్టుకుందని .వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అలాగే బుర్ర కథ చెప్పడం ప్రారంభించామని తెలిపారు. తన రెండో అన్న శంకర్ ,మరో ఫ్రెండ్ లక్ష్మణ్ తో కలిసి ప్రాక్టీస్ చేశామని బుర్ర కథ చెబుతుంటే మిగతా ఇద్దరూ డబ్బాలను కొడుతూ ప్రాక్టీస్ చేసే వారని తెలిపాడు.

ఇక అప్పటి లెక్కల మాస్టర్ మధుసూదన్ రావు నువ్వు బుర్రకథ చెప్తావా అంటే తాను ఓకే అనడంతో మొదటిసారి స్టేజ్ పైకి తీసుకెళ్లారని అలా అల్లూరి సీతారామరాజు కథ చెప్పానని ఆ రోజులని గుర్తు చేసుకున్నాడు.అయితే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అప్పటి కళా రూపాలకు ఆదరణ తగ్గిపోయిందని వాపోయాడు సదానందం ఆలియాస్ సదన్న .

ALSO READ :ఆర్జీవీ, గోపాల్ రెడ్డి మధ్య గొడవ.. కొట్టుకునే వరకు వెళ్లిందా? శివ నాగేశ్వరరావు షాకింగ్ కామెంట్స్!

Tags

Related News

సదన్నకు అంత క్రేజ్ తెచ్చిన వీడియోలు ఇవే.. చూస్తే నవ్వాపుకోలేరు!

రోహిత్ ఎలిమినేషన్.. నాగార్జున పై బెదిరింపులకు దిగిన రోహిత్ ఫ్యాన్స్!

బులెట్ బండి సెన్సేషన్ …మోహన భోగరాజు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

ఆ ఒక్క నిర్ణయం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది: యాంకర్ సుమ

ముఖేష్ స్లో పాయిజన్.. నిజాలు కక్కేసిన దేబ్జానీ!

రోహిత్ ఎలిమినేట్ అంటూ వార్తలు.. నెట్టింట రచ్చపై కౌశిక్ స్ట్రాంగ్ కౌంటర్!

మాది ఆరేళ్ల ప్రేమ.. బ్రేకప్ జరగడానికి కారణం అదే – బిగ్ బాస్ షాలిని!

Big Stories

Advertisement
×