E-Paper
Advertisement

బులెట్ బండి సెన్సేషన్ …మోహన భోగరాజు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

బులెట్ బండి సెన్సేషన్ …మోహన భోగరాజు ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?
Advertisement

Mohana Bhogaraju:”నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా డుగ్గు డుగ్గు ”అనే పాట సోషల్ మీడియాని ఎలా షేక్ చేసిందో చెప్పక్కర్లేదు.పెళ్లి బరాత్ అయినా,కాలేజీ ఈవెంట్ అయినా,పార్టీ అయినా ,పండగ అయినా ఈ పాట మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అన్నట్టుగా అయిపొయింది. ఇక సినిమాల్లో ఎన్ని పాటలు పాడినా ఈ పాటతోనే ఒక్కసారిగా పాపులర్ అయిపొయింది సింగర్ మోహనా భోగరాజ్
దీంతో తనదైన అద్భుతమైన గొంతుతో ఎన్నో పాటలకి ప్రాణం పోస్తున్న మోహనా భోగరాజ్ ఏం పాటలు పాడింది ?అసలు ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుంది అంటూ ఆరాలు తీస్తున్నారు మూవీ లవర్స్.

చిన్నతనం నుండే పాటలు పాడే అలవాటు 

Advertisement

మోహనా భోగరాజ్ విషయానికి వస్తే ఆమె తల్లిదండ్రులది ఏలూరు అయినప్పటికీ ఆమె మాత్రం హైదాబాద్ లోనే పుట్టి పెరిగింది.ఇక చిన్నతనం నుండే పాటలు పాడటం అలవాటు చేసుకున్న మోహన రెండో తరగతిలోనే త్యాగరాయ గాన సభలో జరిగిన పాటలో పోటీలో మొదటి బహుమతి సొంతం చేసుకుంది.అలా క్రమక్రమంగా పాటలు పాడటంలో ప్రావీణ్యం సంపాదించిన మోహనా ఉదయ కిరణ్ నటించిన జై శ్రీరామ్ సినిమాలో ‘సయ్యామ మాసం’ అనే పాట తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

బాహుబలి సినిమాలో ”మనోహరి”

Advertisement

ఇక ఆ తర్వాత కీరవాణి ట్రూప్ లో జాయిన మోహన బాహుబలి సినిమాలో ”మనోహరి” అని పాట పాడి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.ఇక ఆ తర్వాత శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతిలోని మెల్లగా తెల్లారిందోయ్ ,అలాగే ప్రతిరోజూ పండగే లోని ఓ భావ,అలాగే అరవింద సమెత లోని రెడ్డమ్మ తల్లి పాటల్ని అలరించింది.

ఇక గోపిచంద్ నటించిన సౌఖ్యం సినిమాలో దేవుడా ఓరి దేవుడా ‘,గల్ఫ్ లో మేరే అల్లా ..మేరే మౌలా’,సవ్యసాయి సినిమాలో ఉక్కిరి బిక్కిరి వంటి పాటలు పాడి మెప్పించింది.ఇక వెంకీ మామ సినిమాలోని అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామ తో పాటు యూ ఆర్ మై సెనోరీటా,అలాగే నాని హిట్ 3 లోని వెంటాడే నేరం చేశానో .అలాగే గుణ 369లో ని ఉసురేమో ఇరిసేసింది,శ్రీకారం సినిమాలోని సందల్లె సందల్లె పాటల్ని పాడింది కూడా మోహన భోగరాజే.

మోహన భోగరాజు బయటపెడితే కాని తెలీదు.

ఇక మోహన పారితోషికం విషయానికి వస్తే ఈవిడ ఒక్కో పాటకి సందర్భాన్ని బట్టి లక్ష నుండి రెండు లక్షల వరకు, అదే చిన్న ప్రాజెక్ట్ అయితే పాతిక వేల నుండి లక్ష లోపల అందుకుంటుందని సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్.ఇక వీటికి తోడు ఈవెంట్స్ , షోస్ ,యూట్యూబ్ ఛానల్ అంటూ రకరకాల మార్గాల్లో సాలిడ్ గానే సంపాదిస్తుందని నెట్టింట జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.మరి అందులో నిజమెంతో మోహన భోగరాజు బయటపెడితే కాని తెలీదు.

ALSO READ:మరోసారి రంగస్థలం మ్యాజిక్ రిపీట్ అవుతుందా? చరణ్ – సుకుమార్ మూవీ స్టార్ట్!

Tags

Related News

రోహిత్ ఎలిమినేషన్.. నాగార్జున పై బెదిరింపులకు దిగిన రోహిత్ ఫ్యాన్స్!

ఆ ఒక్క నిర్ణయం నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది: యాంకర్ సుమ

ముఖేష్ స్లో పాయిజన్.. నిజాలు కక్కేసిన దేబ్జానీ!

రోహిత్ ఎలిమినేట్ అంటూ వార్తలు.. నెట్టింట రచ్చపై కౌశిక్ స్ట్రాంగ్ కౌంటర్!

మాది ఆరేళ్ల ప్రేమ.. బ్రేకప్ జరగడానికి కారణం అదే – బిగ్ బాస్ షాలిని!

ఆ ఐదుగురే టార్గెట్.. ఝాన్సీ వ్యాఖ్యలతో వారిలో మార్పు వస్తుందా?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ టాక్ ఏది..?

Big Stories

Advertisement
×