E-Paper
Advertisement

ఎల్లంపేట మున్సిపాలిటీలో విచిత్రం.. తాను గెలిచిన వార్డు నంబర్‌‌నే మరిచిపోయిన కౌన్సిలర్?

ఎల్లంపేట మున్సిపాలిటీలో విచిత్రం.. తాను గెలిచిన వార్డు నంబర్‌‌నే మరిచిపోయిన కౌన్సిలర్?
Advertisement

Yellampet Councillor; ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు.. కానీ తాను ఏ వార్డు నుంచి గెలిచారో మాత్రం మరిచిపోయారా? లేక తనకు కేటాయించిన వార్డు నంబరుపై కనీస అవగాహన లేదా? ఎల్లంపేట మున్సిపాలిటీ 23వ వార్డు నుంచి గెలుపొందిన కౌన్సిలర్ ఆరిఫ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మాత్రం 13వ వార్డు కౌన్సిలర్‌గా పేర్కొనడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.వాస్తవానికి 13వ వార్డు నుంచి ముత్యాల గౌడ్ కౌన్సిలర్‌గా ఎన్నిక కాగా, 23వ వార్డు నుంచి ఆరిఫ్ విజయం సాధించారు. కానీ తన సోషల్ మీడియా ఖాతాలో మాత్రం 13వ వార్డు కౌన్సిలర్‌గా పరిచయం చేసుకోవడం చూస్తుంటే.. అసలు తాను ఏ వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయనకైనా తెలుసా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఓటర్లకు ఇంతటి అదృష్టమా?

తమ వార్డు సమస్యలు పరిష్కరిస్తారని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే.. గెలిచిన వార్డు నంబరే తెలియని ప్రజాప్రతినిధి దొరకడం 23వ వార్డు ఓటర్ల అదృష్టమో ఏమోనంటూ స్థానికులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలాంటి జ్ఞానవంతుడైన ప్రజాప్రతినిధిని ఎన్నుకున్న ఓటర్ల మహాశయులకు ప్రత్యేక అభినందనలు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

పదవి వచ్చింది.. వార్డు గుర్తుందా?

Advertisement

ప్రజాప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తికి తన వార్డు పరిధి, ప్రజలు, సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉండాలి. కానీ తాను గెలిచిన వార్డు నంబరునే సోషల్ మీడియాలో తప్పుగా పేర్కొనడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కౌన్సిలర్ తన తప్పును సరిదిద్దుకుంటారా? లేక 23వ వార్డు ప్రజలకు 13వ వార్డు కౌన్సిలర్‌గానే పరిచయం అవుతారా? అన్నది వేచి చూడాలి.

Also Read: జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ క్లోస్.. విశాఖ మేయర్ పీఠం దక్కేది ఎవరికి..?

Tags

Related News

తెలంగాణలో సన్నరకం బియ్యానికి ధర ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. కొత్త రేట్లు ఇవే?

అంతర్జాతీయ మార్కెట్లలో.. తెలంగాణ ఉత్పత్తుల హవా..?

సీఎం రేవంత్ రెడ్డికి.. సంచలన లేఖ రాసిన కల్వకుంట్ల కవిత!

పాలమూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. పట్టించుకోని అధికారులు!

భూముల రీ-సర్వేలో అలసత్వం.. సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో దారుణం.. వంట మనుషులు లేరని చదువుకు తాళం!

హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ భారత్’ వేడుకలు!

Big Stories

Advertisement
×