Big Tv Kissik Talks: సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆర్టిస్టులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా టిక్ టాక్ వీడియోలతో ఎంతో ఫేమస్ అయ్యి ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో స్టార్ గా కొనసాగుతున్న వారిలో నటి భావన లాస్య (Bhavana Lasya) ఒకరు. మల్లి సీరియల్ (Malli serial) ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైన లాస్య ప్రస్తుతం తెలుగు, తమిళ సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండదని చెప్పాలి. నిత్యం డాన్స్ వీడియోలతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.
ఇదిలా ఉండగా తాజాగా భావన లాస్య బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్(Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరియర్ కి సంబంధించిన విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే లాస్య తన సీరియల్స్ గురించి మాట్లాడుతూ.. మల్లి సీరియల్ 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుందని తెలిపారు. అలాగే ప్రస్తుతం తాను తమిళంలో సంధ్యారాగం అనే సీరియల్ చేస్తున్నానని ఈ సీరియల్ కూడ 1000 ఎపిసోడ్స్ రన్ అవుతుందని తెలిపారు. అదే విధంగా లక్ష్మీ నివాసం సీరియల్ లో కూడా తాను నటిస్తున్నాను ఈ సీరియల్ 500 ఎపిసోడ్స్ ప్రసారమవుతుందని తెలిపారు.
ఇలా ఈమె నటించిన సీరియల్ ఎపిసోడ్స్ లెక్క వేస్తూ వర్ష ఒక్కో రోజుకు 50 వేల రెమ్యూనరేషన్ అంటే బాగా సంపాదించి ఉంటావు అంటూ అడగడంతో వెంటనే లాస్య మాట్లాడుతూ అయ్యో అంత లేదండి అందులో సగం వేసుకోండి అంటూ ఈమె తన రోజూ వారి రెమ్యూనరేషన్ (Remuneration) వివరాలను బయటపెట్టారు. ఇలా ఈమె ఒక్కరోజు సీరియల్ షూటింగ్లో పాల్గొంటే దాదాపు 25 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని స్పష్టం అవుతుంది. అయితే ఈ డబ్బుతో ఎన్ని విల్లాలు కొన్నావు అంటూ మరో ప్రశ్న వేయడంతో లాస్య సమాధానం చెబుతూ ప్రస్తుతం తాను ఒక ల్యాండ్ కొనుగోలు చేశానని త్వరలోనే ఒక విల్లా కట్టబోతున్నాను అంటూ ఈమె సీరియల్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు చిట్టా బయటపెట్టారు.
ఇలా సీరియల్స్ లో సంపాదించింది కొంత మొత్తం తాను తన ఖర్చుల కోసం ఉపయోగించుకొని మిగిలింది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానని భావన లాస్య తెలియజేశారు. మరి ఎంత గోల్డ్ ఉందని అడగడంతో తాను డబ్బు మొత్తం తన అమ్మ నాన్నలకు పంపిస్తే వారే ఇన్వెస్ట్ చేస్తారని ఎంత ఉంది అనేది మాత్రం తనకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చారు. ఏది ఏవైనా సీరియల్స్ ద్వారా రోజుకు పాతికవేల రెమ్యూనరేషన్ అంటే మామూలు సంపాదన కాదనే చెప్పాలి. ఇలా సీరియల్స్ ద్వారా నెలకు లక్షల్లో సంపాదిస్తూ మరోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా భారీగా ఆదాయం అందుకుంటున్నారని తెలుస్తోంది.
Also Read: ఎవరిని అడిగి నా పాట పెట్టారు.. ఆదర్శ కుటుంబం పై జిమ్ జిమ్ తార ఫేమ్ లక్ష్మీ ఆంటీ ఫైర్!