Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు పాల్గొని వారికి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇక ఈవారం ఈ కార్యక్రమంలో భాగంగా బుల్లితెర నటి భావన లాస్య(Bhavana Lasya) పాల్గొన్నారు. స్టార్ మా లో ప్రసారమైన మల్లి సీరియల్(Malli Serial) ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న భావన లాస్య ప్రస్తుతం తెలుగు తమిళ సీరియల్స్ లో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ వర్ష మాట్లాడుతూ దేవుడు కనిపించి వరమిస్తే నువ్వేం కోరుకుంటావని ప్రశ్న వేశారు. తన లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటానని సమాధానం చెప్పారు. హ్యాపీగా అంటే అంటూ మరో ప్రశ్న వేశారు. తనకు కెమెరా ముందు నటించడం అంటే చాలా ఇష్టం డాన్స్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం. టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ ఉన్న నేను ప్రస్తుతం టెలివిజన్ లో సీరియల్స్ చేస్తూ ఉన్నాను. అలాగే సినిమాలలో కూడా హీరోయిన్ గా అవకాశాలు రావాలని ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటాను నా ఆఖరి శ్వాస వరకు కూడా తాను ఇండస్ట్రీలోనే ఉండాలని కోరుకుంటానని తెలిపారు.
ఇలా టాలీవుడ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకోవాలని ఈమె మాట్లాడటంతో ఒకవేళ మీరు హీరోయిన్ అయితే ఏ హీరోతో చేస్తారనే ప్రశ్న ఎదురయింది. ప్రశ్నకు లాస్య సమాధానం చెబుతూ తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే పిచ్చిపిచ్చిగా ఇష్టమని, ఆయనతో కలిసి ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నది తన కల అని తెలిపారు. రొమాంటిక్ సాంగ్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారని ప్రశ్న ఎదురు కావడంతో వెంటనే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరు చెప్పేశారు. రొమాంటిక్ సాంగ్ చేయడానికి రష్మిక ఒప్పుకోకపోతే అంటూ వర్షా అడగడంతో వేరే హీరోతో చేస్తానని సింపుల్గా సమాధానం ఇచ్చారు.
ఇకపోతే ఏ హీరోతో లిప్ లాక్ చేయాలని ఉంది అంటూ కూడా వర్ష ప్రశ్న వేయడంతో తాను లిప్ లాక్ సన్నివేశాలు చేయడానికి ఇష్టపడనని ముందు తాను ఇలాంటి సీన్స్ చేయడానికి కంఫర్ట్ గా ఉండను అందుకే లిప్ లాక్ సీన్లకు నో చెప్పేస్తాను అంటూ లాస్య ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈమె నటిగా ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉంటూనే మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈమె కోరిక నేరవేరి టాలీవుడ్ సినిమాలలో హీరోయిన్ గా అవకాశం అందుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: మల్లి సీరియల్ నటి భావన లాస్య ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?