Satyabhama Today Episode December 19 th : నిన్నటి ఎపిసోడ్ లో.. మహదేవయ్య మీద సత్య ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చాలెంజ్ చేస్తుంది.. ఇక మహదేవయ్య టెన్షన్ పడుతూ ఉంటాడు. సత్య వాళ్ళింట్లో అన్ని సమస్యలు తీరిపోయాయని సంతోషంగా ఉంటారు. నందిని వాళ్ళ నాన్న చేసిన పనికి అందరూ నందిని పొగిడేస్తుంటారు. సమస్యలు ఏదో భయంకరంగా వచ్చాయి ఎవరో తీసేసినట్టు వెంటనే వెళ్లిపోయాయని సంధ్య బామ్మ అందరూ సంతోషంగా ఉంటారు. కానీ విశ్వనాథం మాత్రం దిగులుగా ఉంటాడు. విశాలాక్షి విశ్వనాథం దగ్గరికి వెళ్లి ఏమైందండీ మీకు సంతోషంగా లేదా అనేసి అడుగుతుంది. మహాదేవయ్యే ఇప్పుడు కష్టాలు తీర్చారంటే నువ్వు నమ్ముతున్నావా విశాలాక్షి అని విశ్వనాథం అడుగుతాడు. నేను నమ్మలేకున్నా కానీ అలా చేశాడంటే ఎక్కడో ఏదో జరుగుతుందని అర్థమవుతుందని అనేసి విశాలాక్షి టెన్షన్ పడుతుంది. ఇక మావయ్య చెప్పింది నిజమే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ముందు క్రిష్ కి ఈ విషయం చెప్పాలని సత్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే క్రిష్ వచ్చి సత్యను పట్టుకుంటాడు. సత్య ఉలిక్కిపడుతుంది. ఇక ఇద్దరూ కాసేపు గుద్దులాడుకుంటారు.. సమస్యలను తీరిపోయాయి కదా ఇక నువ్వు ఆలోచించాల్సిన పనిలేదు. తాతయ్య ఏం చెప్పాడు అనేసి ఒక రొమాంటిక్ స్టోరీని అల్లుతాడు. ఇక సత్య నేను ఎమ్మెల్యే అవ్వాలని అనుకుంటున్నాను అని సరదాగా చెప్తుంది. ఇదంతా కాదు మా తాత చెప్పిన పని చేయాల్సిందే అనేసి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు. ఆ రాత్రి గడిచిపోతుంది. క్రిష్ పుట్టినరోజు కోసం సత్య అంత సిద్ధం చేస్తుంది.. ఇక కృష్ణను లేపాలని బెడ్ రూమ్ కి వెళ్తుంది. మాటలతో మాయ చేసి నలుగు పెట్టి స్నానానికి తీసుకొస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. క్రిష్ కు ముద్దుల గురించి ఆశ పెట్టి చివరకు మాట తప్పి మోసం చేసింది సత్య.. అలా ఇద్దరు రాత్రి జరిగిన ముచ్చట్ల గురించి మరోసారి ముచ్చట పెట్టుకొని సరదాగా గడుపుతారు. క్రిష్ ఎలాగైనా నాలుగు స్నానానికి ఒప్పించాలని సత్య మాస్టర్ ప్లాన్ వేస్తుంది.. చల్లనీలతో స్నానం చేయిస్తూ వేడిగా ముద్దులు పెట్టాలని అనుకున్నాను కానీ ఈ కృష్ణయ్య ఎక్కడో మాయమైపోయాడని సత్య కావాలనే కృష్ణ దగ్గరికి వెళ్లి అంటుంది. అది విన్న క్రిష్ నిజం అని నమ్ముతాడు. సత్య మాటలు నమ్మి స్నానానికి వచ్చి కూర్చుంటాడు.. నలుగు పెట్టినప్పుడు క్రిష్ కళ్ళలోకి వెళ్తుంది. ఇప్పుడు సత్య ఏమైందని టెన్షన్ పడుతు చూస్తుంది. కానీ క్రిష్ మాత్రం తుంటరి పని చేస్తాడు. వీరిద్దరూ సరదాగా స్నానం చేయించుకోవడం చూసి మహదేవయ్య కోపంతో రగిలిపోతాడు. అటు జయమ్మ కూడా వీరిద్దరిని చూసి ముచ్చట పడిపోతుంది. ఇద్దరిని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదని మురిసిపోతుంది. వీళ్ళిద్దరి దగ్గరికి కావాలని జయమ్మ వస్తుంది.
క్రిష్ బుంగమూతి పెట్టుకొని ఉండడం చూసి జయమ్మ ఏమైందని అడుగుతుంది. మనవరాలు నాకు మాట ఇచ్చి మోసం చేసింది ముసలి అనేసి క్రిష్ అంటాడు. ఏం మాట ఇచ్చింది ఏం మోసం చేసింది అని అంటే మొగుడు పెళ్ళాల మధ్య నీకెందుకు అని క్రిష్ జయమ్మకు కౌంటర్ ఇస్తాడు. దానికి ఆమె క్రిష్ సత్య ఇద్దరినీ కలిపి సెటైర్లు వేస్తుంది. ఇక స్నానం అయిన తర్వాత క్రిష్ సత్యా బెడ్ రూమ్ కి వెళ్తారు. సత్య పై క్రిష్ కోపంగా ఉంటాడు. మాట ఇచ్చి తప్పుడు ఇదెక్కడిది అనేసి సత్య అని అడుగుతాడు. ఇచ్చిన మాట ప్రకారం క్రిష్ కి 44 ముద్దులు ఇస్తుంది. వీరిద్దరూ మాట్లాడుకోవడం చూసి జయమ్మ సడన్ ఎంట్రీ ఇస్తుంది. ఏం మాటిచ్చారు ఏమైంది అసలు అనేసి మధ్యలో దూర్తుంది. నీకు క్రిష్ మొగుడు పెళ్ళాలు మధ్యలో నీకెందుకు ఏవేవో ఉంటాయి కదా ముసలిదానివి ముసలిదాని లాగా పడిండాలి కదా అనేసి కోపంగా అరుస్తాడు. తర్వాత 44 ఏంటి అనేసి అడుగుతుంది. ఓహో 44 దోమలు బుగ్గ మీద కొట్టాయా మరి కాట్లు కనిపించట్లేదు ఏంటి? పాట్లు కనిపించకుండా కుట్టే దోమలు కూడా ఈ మధ్య వస్తున్నాయా ఏంటో వీరిద్దరూ నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటూ జయమ్మ బయటికి వెళ్తుంది.
ఇక సంధ్య సంజయ్ కు కాల్ చేస్తుంది. సంజయ్ ఎప్పటిలాగే పులిహోర కలుపుతాడు. ఇప్పటివరకు నువ్వు నాతోనే ఉన్నావ్ కదా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావ్? ఎక్కడినుంచి ఫోన్ చేస్తున్నావని కొత్త డ్రామాను మొదలు పెడతాడు. సంధ్య మాత్రం మురిసిపోతూ సిగ్గుపడుతుంది. ఈరోజు నీ బర్త్ డే కదా అయిన నువ్వు ఇంకా పడుకొని ఉన్నావా హ్యాపీ బర్త్డే అని సంజయ్ కి విషెస్ చెప్తుంది. సంజయ్ మాత్రం ఫోన్లో విషెస్ చెప్తే సరిపోదు డైరెక్టుగా వచ్చి విషెస్ చెప్పాలి అనేసి అడుగుతాడు. దానికి సంధ్య మా అక్క కంట పడితే ఇక నన్ను ఉతికి ఆరేస్తుంది. ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటదో అర్థం చేసుకో అనేసి అంటుంది. కానీ సంజయ్ మాత్రం ఎక్కడో కలిస్తే ప్రాబ్లం కానీ మీ అక్క ఇంట్లోనే కలిస్తే ప్రాబ్లం లేదు కదా నా మీద నీకు ప్రేమ ఉంటే నాకోసం నువ్వు తప్పకుండా మీ అక్క ఇంటికి వస్తావు అని ఫోన్ కట్ చేస్తాడు. సంధ్య అనవసరంగా ఫోన్ చేసి ఇరుక్కున్నాను ఇప్పుడు అక్కింటికి ఎలా వెళ్లాలి ఏం చెప్పి వెళ్ళాలి అనేసి టెన్షన్ పడుతూ ఉంటుంది.
ఇకపోతే సత్య క్రిష్ కోసం కొత్త డ్రెస్ కొని ఇస్తుంది. ఇది నాకిష్టమైన కలర్ నా సంపంగికి నా గురించి అన్ని తెలుసు అనేసి క్రిష్ సత్యను మెచ్చుకుంటాడు. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని నేను పాయసం తీసుకొని వస్తానని సత్య కిందికి వస్తుంది.. కిందకు సత్య రాగానే మహదేవయ్యా ఎదురుపడతాడు. చూస్తున్నాను మీరిద్దరూ ఏం చేస్తున్నారో ఎలా ఆడుకుంటున్నారో? ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నావని సంగతి నీ పిచ్చి మొగుడికి ఎప్పుడు చెప్తావ్ వాడికి చెప్తే వాడు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడు చూడు ముందు ఆ పని చెయ్ తర్వాత నా మీద ఛాలెంజ్ లు వేయొచ్చు అనేసి మహదేవయ్య సత్య తో అంటాడు. ఇలా ఏదైనా తేడా జరిగితే నీకు కాపురమే కూలిపోతుంది అది ఆలోచించు. నీ జీవితమే ఇక ఎండ్ అవుతుంది అని అనగానే సత్య అవును నిజమే ఎండ్ అయ్యేది నా జీవితం కాదు మీరు రాజకీయ జీవితం. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి మీపై పై చేయి సాధిస్తాను అంతవరకు నేను నిద్రపోను అనేసి సత్య మహదేవయ్యతో ఛాలెంజ్ చేస్తుంది. ఇక పైకెళ్ళిన సత్య క్రిష్ తో ఏదో చెప్పాలని అంటుంది. క్రిష్ మాత్రం అప్పుడు 44 ఇప్పుడు 54 ఇస్తావా ఏంటి అనేసి సరదాగా అంటాడు.. దానికి సత్య నేను చెప్పాలనుకున్నది చెప్పనివ్వవా అనేసి అడుగుతుంది. ఈరోజు నా పుట్టినరోజు నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు దీన్ని ఇలా ఎంజాయ్ చేయనీవు రేపు ఏదైనా మాట్లాడుకుందాం అనేసి సత్యతో అంటాడు. దానికి సత్య షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సత్య నోరు సారి క్రిష్కు నిజం చెప్పబోతుంది. నిజం చెప్తుందా లేదా మహదేవయ్య వచ్చి అడ్డుకుంటాడు అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.