BigTV English

Nayanthara: రికార్డ్ బ్రేకింగ్ డైరెక్టర్‌తో నయనతార సినిమా.. మళ్లీ ఫామ్‌లోకి రానుందా.?

Nayanthara: రికార్డ్ బ్రేకింగ్ డైరెక్టర్‌తో నయనతార సినిమా.. మళ్లీ ఫామ్‌లోకి రానుందా.?

Nayanthara: ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి.. వాటిలో హిట్ కొట్టే అంత బాక్సాఫీస్ స్టామినా చాలా తక్కువమంది హీరోయిన్లకు మాత్రమే ఉంది. అందులో కచ్చితంగా నయనతార పేరు ఉంటుంది. ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి వాటితో హిట్ కొట్టింది కాబట్టే నయనతారకు లేడీ సూపర్ స్టార్ అనే పేరు దక్కింది. నయన్ కెరీర్‌లో హిట్స్ ఉన్నాయి. ఫ్లాప్స్ ఉన్నాయి. అలా అని వాటి వల్ల తనకు బ్రేక్ పడేలా చేసుకోలేదు. తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ మరొక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా ఒక రికార్డ్ బ్రేకింగ్ డైరెక్టర్‌తో నయనతార (Nayanthara) కాంబినేషన్ సెట్ అయ్యిందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.


డిఫరెంట్ కాంబో

ఇప్పటికీ కోలీవుడ్‌లో ఏ దర్శకుడి దగ్గర అయినా లేడీ ఓరియెంటెడ్ సినిమా కథ ఉంది అంటే అది కచ్చితంగా ముందుగా నయనతారకే వినిపిస్తారు. ఒకవేళ ఈ సీనియర్ హీరోయిన్ ఇతర సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా తన డేట్ల కోసం ఎదురుచూసే దర్శకులు కూడా ఉన్నారు. అక్కడ నయన్ పాపులారిటీ ఆ రేంజ్‌లో ఉంటుంది. తను నటించందంటే సినిమా మినిమమ్ గ్యారెంటీ హిట్ అని మేకర్స్ ఫిక్స్ అయిపోతారు. అలాగే ఇప్పటికే తన ఖాతాలో పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ఉన్నా ఒక రికార్డింగ్ బ్రేకింగ్ డైరెక్టర్‌తో మళ్లీ అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. తాజాగా ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


Also Read: ఇది మీ అందరికీ డెడికేట్ చేస్తున్నా.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్, ఇంతకీ ఏమైందంటే.?

రికార్డులు సృష్టించిన సినిమా

తమిళంలో గతేడాది విడుదలయిన సూపర్ హిట్ సినిమాల్లో ‘మహారాజా’ కూడా ఒకటి. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యింది. ఎన్నో థియేటర్లలో 50 రోజులకు పైగా సక్సెస్‌ఫుల్‌గా నడిచింది ‘మహారాజా’. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించుకొని అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఇటీవల ఈ మూవీ ఇండియాలో మాత్రమే కాకుండా చైనాలో కూడా ‘మహారాజా’ రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు అదే దర్శకుడితో నయనతార లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఓకే చేసిందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రికార్డ్ బ్రేకింగ్ కాంబినేషన్ సెట్ అని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

బిజీ బిజీ

ఇటీవల నయనతార పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది నయన్ ఎక్కువగా సినిమాల్లో కనిపించలేదు. తన పర్సనల్ లైఫ్‌తోనే బిజీ అయిపోయింది. ఇటీవల తన ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ గురించి విశేషాలు పంచుకుంటూ ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’ అనే డాక్యుమెంటరీని విడుదల చేసింది నయన్. ఆ డాక్యుమెంటరీ విడుదల తర్వాత ధనుష్‌తో కాంట్రవర్సీతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది ఈ సీనియర్ నటి. అలా సినిమాలకు కాస్త గ్యాప్ వచ్చింది. ఇక ‘మహారాజా’ లాంటి సినిమాను తెరకెక్కించిన నిథిలన్‌తో కలిసి చేసే మూవీతో నయనతార మళ్లీ ఫామ్‌లోకి వస్తుందని, తమను అలరిస్తుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×