Satyabhama Today Episode December 26 th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహదేవయ్య క్రీష్ తో మాట్లాడడం సత్య వింటుంది. క్రిష్ మహదేవయ్య కు మాట ఇవ్వడం సత్య చూస్తుంది. ఇక క్రిష్ తన నుంచి జారిపోయారని బాధపడుతూ ఉంటుంది. ఇక మహదేవయ్య సత్య దగ్గరకు వచ్చి న్యాయం జరగదు.. నీ వెర్రి మొగుడు నాకు మాట ఇచ్చి దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు కదా కోడలా అనేసి సత్యతో కౌంటర్లు వేస్తాడు. సత్య మాత్రం తగ్గేదేలే అని ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని అంటుంది. క్రిష్ నామినేషన్స్ కి టైం వచ్చేసింది నేను నామినేషన్స్ తీసుకొస్తాను అని బాంబులు పేల్చి సంబరాలుగా చేస్తాడు.నామినేషన్ ఫామ్స్ ని తీసుకొని వస్తానని కృషి పార్టీ ఆఫీస్ కి వెళ్తానని చెప్తాడు దానికి మహదేవయ్యా ఒకటి తీసుకురమ్మంటావా రెండు తీసుకురమ్మంటావా కోడలా అనేసి సత్యను అడుగుతాడు. ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఒక ముసలావిడొచ్చి తన సమస్యను చెప్తుంది. నా వల్ల కాదని చెప్పి పంపిస్తాడు. సత్య మాత్రం నేను చేస్తానని తన వెంట వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని చూస్తుంది కానీ అక్కడ పోలీసులు కంప్లైంట్ ను తీసుకోరు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మైత్రి హర్ష కి కాల్ చేస్తే నందిని లిఫ్ట్ చేసి ఇంట్లో సమస్యలకు నువ్వే కారణమని ఇంకెప్పుడూ మాకు ఫోన్ చేయద్దు అని వార్నింగ్ ఇస్తుంది. ఇక మైత్రి హర్ష వాళ్ళ ఇంటికి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తుంది. కానీ విశ్వనాథం మాత్రం ఆ డాక్యుమెంట్స్ మాకు వద్దమ్మా నీ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడతాయని చెప్తాడు. ఇకనందిని మాత్రం మైత్రిని చులకనగా చూస్తుంది. మైత్రి బయటికి వెళ్తుంటే విశాలాక్షి పిలిచి హర్షిత ఇంకెప్పుడు మాట్లాడద్దు కలవద్దమ్మా వాడు ఇప్పుడిప్పుడే తన భార్యతో సంతోషంగా ఉన్నాడని చెప్తుంది. మైత్రి ఇంటికి వెళ్లి కోపంగా ఉంటుంది. విశాలాక్షి మాటల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది.. మైత్రిని ఇంకా రెచ్చగొట్టేలా తన ఫ్రెండ్ మాట్లాడడంతో చంపేస్తానని బెదిరిస్తుంది మైత్రి. ఇక బైరవి రేణుకను కాఫీ తీసుకొని రమ్మని చెప్తుంది. కానీ రేణుక మాత్రం టీ తీసుకొని వచ్చి ఇస్తుంది.
అది తాగిన భైరవి నేను నీకేం చెప్పాను నువ్వేం తీసుకొచ్చావు అనేసి కప్పుని నేలకేసుకోడుతుంది. ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది అత్తమ్మ అందుకే టీ పెట్టుకుని వచ్చి తీసుకొచ్చాను అనేసి అంటుంది. ఎదురు సమాధానం చెప్తావా అని రేణుకపై కోప్పడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన క్రిష్ వదినపై ఎందుకు అంత కోప్పడుతున్నావ్ అని అడుగుతాడు. అత్త కోడల మధ్యలోకి నువ్వు రాకు నీకు సంబంధం లేదు ఎలాగో నీ భార్య నీ మాట వినట్లేదు కనీసం నీ బాపుకు కూడా మర్యాద ఇవ్వట్లేదు అనేసి నాలుగు నూరు పోసి చెప్తుంది. ఉదయం ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఒక ఆవిడ వచ్చింది అది తన వల్ల కాదు ఎలక్షన్స్ టైం లో మంచిది కాదని మీ బాపు చెప్తున్నా ఆవిడకి నేను మంచి చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది కనీసం నీ బాపుకి విలువ కూడా ఇవ్వట్లేదు ఆయన మనసుకి ఎంత బాధ ఉంటుందో నువ్వైనా అర్థం చేసుకో అనేసి చెప్తుంది..
దానికి క్రిష్ కోపంగా సత్య దగ్గరికి వెళ్లి నువ్వు తప్పు చేస్తున్న సత్య నువ్వు చేసేది అంత మంచి పని కాదు బాపుని ఎదిరించాల్సిన అవసరం నీకేంటి అనేసి అరుస్తాడు. నేనేం తప్పు చేయలేదు క్రిష్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఆ పెద్దవిడ పదిమందిని చూసుకుంటుంది కానీ ఆ ఇంటినే ఓ రాక్షసుడు కబ్జా చేయాలని చూసాడు అది మాట్లాడడానికే నేను వెళ్ళాను అంతే తప్ప మీ బాపుని ఎదిరించాలని నాకు ఎప్పుడూ లేదు అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమే అయితే ఆ తర్వాత వచ్చి నేను మాట్లాడుతాను నువ్వు మా బాపు కాళ్ళ మీద పడి క్షమాపణలు అడగాలని చెప్తాడు. దానికి సరైన ఒప్పుకున్న సత్య కృష్ణ ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గరకి పంపిస్తుంది. అక్కడ ఆల్రెడీ అశోక్ ఉండడం చూసి అశోక్ తో మాట్లాడుతాడు. ఇక అశోక్ మహాదేవయ్యకు ఫోన్ చేసి చిన్న గురించి చెప్తాడు. మహదేవయ్య చిన్నాన్న అక్కడినుంచి వచ్చేయమని చెప్తాడు. బాపు కోసం నేను ఆగాను అంతే కానీ ముసలోళ్ళకి ఏమి చేయలేకపోతున్నానని క్రిష్ బాధపడుతూ ఇంటికి వస్తాడు. క్రిష్ గాని సత్య నా క్రిష్ ఏదైనా సాధించుకోస్తాడనేసి గొప్పగా చెప్తుంది.. కానీ క్రిష్ మాత్రం నేనేమీ చేయలేకపోయాను సత్య అనేసి అంటాడు. నువ్వు అనుకుంటే సాధించంది ఏముంది క్రిష్ మీ బాబుకి ఎమ్మెల్యే టికెట్ రానప్పుడు ఆ నరసింహతో ఎంత గొడవకి దిగావో నీకు తెలుసు కదా ఇప్పుడు అంతకుమించి నువ్వు చేయగలవు కానీ నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావో అర్థం కావడం లేదు పదిమంది ముసలాలను కాపాడడం తప్ప క్రిష్ అనేసి క్రిష్ కి హితబోధ చేస్తుంది.. క్రిష్ బాపు కోసం ఆగాను తప్ప నేను చేయలేక కాదు నాకు సత్తువలేక కాదు అని సత్యతో అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో సత్యా నేనే ఎమ్మెల్యే అవుతానని నిజం చెప్తుంది. క్రిష్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..