Satyabhama Today Episode February 16th: నిన్నటి ఎపిసోడ్లో.. నరసింహ చనిపోవడం చూసి షాక్ అయినా సత్య క్రిష్ ఏ చంపేసాడు అని ఏడుస్తుంది నా మాట వినకుండా వెళ్లావు నిన్ను ఎలా నమ్మాలి నీ మీద నాకు నమ్మకం పోయింది. ఇన్ని రోజులు నేను నిన్ను గుడ్డిగా ప్రేమించాను కానీ ఇప్పుడు ఎందుకు ప్రేమించన అనిపిస్తుందని సత్య క్రిష్ పై కోపంతో అరుస్తుంది. క్రిష్ నేనే తప్పు చేయలేదు నేను మారిపోయాను ఆఖరి నిమిషంలో వాడిని వదిలేసాను అనేసి అన్నా కూడా సత్య టీవీలో అబద్ధం ఎందుకు చెప్తారు అని క్రిష్ ను నీలదీస్తుంది.. క్రిష్ తో పాటు రేణుక కూడా సత్యకు నచ్చ చెప్పాలని చూసినా కూడా సత్య వినదు.. ఇక భైరవి దాన్ని బ్రతిమలాడులేందే వినకపోతే పోనీ అవసరం లేదు అనేసి అరుస్తుంది. ఇంటి గురించి తెలిసి క్రిష్ గురించి తెలిసే పెళ్లి చేసుకుంది. నువ్వేం టెన్షన్ పడకు అని రేణుక పై అరుస్తుంది భైరవి. నువ్వు నా నమ్మకాన్ని పోగొట్టుకున్నావు నేను ఎంత చెప్పినా నువ్వు వినకుండా ఒక మనిషిని చంపాలని చూసావు ఇప్పుడు కూడా నన్ను చంపేయమంటే నువ్వు చంపేయకుండా ఆగవు ఒకసారి మావయ్య మీ కొడుకుని నన్ను చంపేయమని చెప్పండి వెంటనే నన్ను చంపేస్తాడు.. అది నువ్వు అనేసి సత్య క్రిష్ ను అంటుంది.. ఇక నీతో ఉండి ప్రయోజనం లేదు నేను మోసపోయాను నువ్వు నన్ను ఇంత దారుణంగా నమ్మించి ప్రేమ పేరుతో మోసం చేస్తావని నేను అస్సలు ఊహించలేదు.. నా గుండెలు పగిలేలా ఉన్నాయి క్రిష్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. ఎవరెన్ని చెప్పిన సత్య వినదు. ఇక బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే జయమ్మ ఆపుతుంది. క్రిష్ వాళ్ళ నాన్న మీద ఒట్టు వేసాడు. ఇప్పటికైనా నువ్వు నమ్మాలి అని అంటుంది. అటు భైరవి మాత్రం నువ్వు లేకపోతే చిన్నా బతకలేడు అనుకుంటున్నావా. వాడికి మళ్లా పెళ్లి చేస్తా మహారాణి లాంటి కోడలిని తీసుకొస్తా అనిభైరవి అంటుంది.. ఇక జయమ్మ ఆవేశం మనిషిని దూరం చేస్తుంది. ఆలోచన మనిషిని దగ్గర చేస్తుంది. వాడు ఆవేశంగా వెళ్లాడు. కానీ తప్పు తెలుసుకొని వచ్చాడు. చిన్నా నా కళ్ల ముందు పెరిగాడు. వాడేంటో నాకు బాగా తెలుసు. చిన్నా తప్పు చేస్తాడు కానీ అబద్ధం చెప్పడు. వాడు చంపలేదు అంటున్నాడు ఎందుకు నమ్మవు.. ఇక సత్యా క్రిష్ మహదేవయ్య మీద ఒట్టేయడంతో నమ్ముతుంది. ఇక లోపలికి వెళ్ళిపోతుంది.
ఇక రాత్రి సంతోషంగా క్రిష్ సత్య దగ్గరికి వస్తాడు. కానీ సత్తి మాత్రం కృష్ణ చూడటానికి కూడా ఇష్టపడదు. ఇప్పుడు ఏమైంది అలా చేస్తున్నావ్ అనేసి క్రిష్ అడుగుతాడు. అయితే ఈ డిస్టెన్స్ మైంటైన్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అని సత్య అంటుంది. నేను చంపలేదని బాబు మీద ఒట్టేసి చెప్పాను కదా అయినా కూడా నా మీద నీకు నమ్మకం లేదా ఇదేనా నీ ప్రేమ అనేసి క్రిష్ అంటాడు. నేను ఎంత చెప్పినా నన్ను వదిలేసి వెళ్లావు అది నీ ప్రేమేనా అనేసి అడుగుతుంది. అందుకే ఈ డిస్టెన్స్ మైంటైన్ చేస్తే మంచిదని సత్య దూరంగా వెళ్ళిపోతుంది. క్రిష్ మాత్రం సత్యకు దగ్గర అవ్వాలని చూస్తాడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పావు నువ్వు ఒక మోసగాడివి మాయగాడివి అని సత్యా కృష్ణ అంటుంది. ఎన్నికలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం నువ్వే అనేసి సత్య క్రిష్ ను తిడుతుంది. బాబు ఏం చెప్తే అది తలాడిస్తున్న గంగిరెద్దులాగా వెళ్లి చేయడం నీకు అలవాటే కదా నువ్వు అలా చేయడం వల్లే అతని ఎవరో కావాలని చంపారు లేకపోతే నువ్వే చంపావు ఎవరికి తెలుసు అని ఎద్దేవా చేస్తుంది.
నేను అబద్ధం చెప్పడం ఎప్పుడన్నా చూసావా ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పను అది నా సంపంగికి అస్సలు చెప్పను అనేసి అంటాడు. అయినా సత్య కృష్ణ దూరం పెడుతుంది. ఇక ఉదయం లేవగానే సంజయ్ మహదేవయ్య దగ్గరకొచ్చి బిగ్ డాడ్ నాకు ఒక 10 కోట్లు కావాలి అని అడుగుతాడు. 10 కోట్లు ఎందుకు రా అంటే నేను చెప్పాను కదా ఫైనాన్స్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నాను అని దానికి నాకు 10 కోట్లు కావాల్సి వస్తుంది నాకు ఇస్తే నేను మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు. కానీ మహదేవయ్య మొదట ఆలోచించిన కన్న కొడుకు అడగడంతో కాదనలేక పోతాడు. సరేలేరా అలాగే తీసుకో అనేసి అంటాడు అది విన్న భైరవి బయటకు వచ్చి మరి మహదేవయ్యను దారుణంగా తిడుతుంది. తమ్ముడు కొడుక్కి 10 కోట్లు ఇచ్చిడు ఏంటి? పెనిమిటి.. ఏరోజైనా క్రిష్ కు కానీ రుద్రకు కానీ అలా ఇచ్చావా అని అడుగుతుంది. సంజయ్ చక్రవర్తి కొడుకు కాదు మన కన్న కొడుకు అనగానే భైరవి షాక్ అవుతుంది. చాటుగా వింటున్న సంజయ్ కూడా షాక్ అవుతాడు. సోమవారం ఎపిసోడ్లో కృష్ణుని బయటికి పంపిస్తారా? లేక సంజయ్ కు 10 కోట్లు ఇస్తారా చూడాలి…