Roshan – CCL: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Celebrity Cricket League 2025 Tournament )… చాలా అట్టహాసంగా జరుగుతుంది. ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు అలాగే కీలక నటులు.. ఈ టోర్నమెంట్ ఆడుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా ఎగబడి చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే… నిన్న శనివారం రోజున తెలుగు వారియర్స్ ( Telugu warriors ) వర్సెస్… చెన్నై ( Chennai Rhinos ) మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్లో తెలుగు వారియర్స్ పైన చెన్నై గెలిచినప్పటికీ… హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్… అందరినీ ఆకట్టుకున్నాడు.
Also Read: Telugu Warriors: పప్పులో కాలేసిన అయ్యగారు..12 మంది ప్లేయర్లతో ఆడించాడు..!
అంతర్జాతీయ క్రికెటర్ ఆడిన తరహాలోనే… చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు హీరో రోషన్. ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ ఆడిన హీరో రోషన్… హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. ఈ తరుణంలోనే 33 బందుల్లో రోషన్ 72 పరుగులు చేసి దుమ్ము లేపాడు. తెలుగు వారియర్స్ ఈ మ్యాచ్లో మొదటి న్యూస్ లో 105 పరుగులు చేస్తే… అందులో రోషన్ ( Roshan Meka)కొట్టినవి 72 పరుగులు కావడం విశేషం. అంటే మిగతా ప్లేయర్లు దాదాపు 30 పరుగులు మాత్రమే చేశారు. ఇక హీరో రోషన్ తన ఇన్నింగ్స్ లో… ఫోర్లు, సిక్సర్లే ఎక్కువ కొట్టారు. దీంతో హీరో రోషన్ చేసిన బ్యాటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే తెలుగు వారియర్స్ కూడా సోషల్ మీడియాలో రోషన్ బ్యాటింగ్… వైరల్ చేస్తోంది. మొదటి ఇన్నింగ్స్ లో అదరగొట్టిన రోషన్ రెండవ ఇన్నింగ్స్ లో పెద్దగా రాణించలేదు. చెన్నై చేతిలో 25 పరుగుల తేడాతో తెలుగు వారియర్స్ ఓడిపోయింది.
ఇది ఇలా ఉండగా.. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 125 పరుగులు చేసింది. చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ లో వచ్చిన విక్రాంత్ ఒక్కడే 61 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఆ తర్వాత దశరథి 35 పరుగులు చేసి రాణించడం జరిగింది. తెలుగు వారియర్స్ బౌలర్లలో రఘు రెండు వికెట్లు పడగొట్టి కట్టడి చేశాడు. అటు మొదటి ఇన్నింగ్స్ ఆడిన తెలుగు వారియర్స్ 6 వికెట్లు నష్టపోయి 105 పరుగులు మాత్రమే చేసింది.. దీంతో మొదటి ఇన్నింగ్స్ లోనే వెనుకబడింది తెలుగు వారియర్స్. ఆ 105 పరుగులు కూడా రోషన్ కారణంగా వచ్చాయి. ఇక రెండవ ఇనింగ్స్ ప్రారంభించిన చెన్నై… నిర్ణీత 10 ఓవర్లలో 87 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన తెలుగు వారియర్స్… నిర్ణీత ఓవర్లలో 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చెన్నై చేతిలో 25 పరుగులతో దారుణంగా ఓడిపోయింది తెలుగు వారియర్స్. సెలబ్రిటీ క్రికెట్ టోర్నమెంటులో… తెలుగు వారియర్స్ కు ఇది రెండవ ఓటమి. ఇప్పటి వరకు… కర్ణాటక అలాగే చెన్నై చేతులో ఓడిపోయింది. ఇక మిగిలిన మ్యాచ్ లోనైనా గెలవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Also Read: Shoaib Akhtar on Laxmipati Balaji: అక్తర్ ను నరకం చూపించిన బౌలర్..కోపంతో బ్యాట్లు కూడా విరగొట్టాడు ?
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">