Lorry – Bus Accident: జనగామ జిల్లా పాలకుర్తిలో అతివేగంతో వచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. అదే స్పీడ్‌తో పాన్ షాపులోకి దూసుకెళ్లింది. అక్కడ పార్క్ చేసి ఉన్న వెహికల్స్‌ను నుజ్జునుజ్జు చేసేసింది. పొద్దు పొద్దున్నే జరిగిన ఈ ఘటనతో.. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. బస్సులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాన్ షాపులోకి దూసుకెళ్లిన లారీని జేసీబీ సాయంతో బయటకు లాగారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు పోలీసులు.
కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి ప్రాణాలు కోల్పోగా, కూతురికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. నిజమాబాద్ జిల్లా కుకునూర్ గ్రామానికి చెందిన గంగాధర అనే వ్యక్తి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. తన కుమార్తె హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుంది. ఇద్దరు కలిసి స్వగ్రామానికి కారులో బయల్దేరుతుండగా మార్గ మధ్యలో కారు ప్రమాదానికి గురై లారీకి, బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో గంగాధర మృతి చెందగా, ఆయన కుమార్తె లహరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, లహరి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తున్నారు పోలీసులు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు.. మాజీ మంత్రి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, ముగ్గురు అరెస్ట్
ఇదిలా ఉంటే.. పల్నాడు జిల్లా అద్దంకి- నార్కెట్‌పల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెదనెమలిపురి దగ్గర కారును ఢీకొట్టింది లారీ. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ నుంచి మద్దిపాడు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. మృతులు షేక్ నజీమా, షేక్ నూరుల్లా, షేక్ హబీబుల్లాగా గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందినవారు తల్లి, ఇద్దరు కొడుకులని తెలిసింది.