Satyabhama Today Episode February 18th: నిన్నటి ఎపిసోడ్లో.. గొడవ తర్వాత రాత్రి సంతోషంగా క్రిష్ సత్య దగ్గరికి వస్తాడు. కానీ సత్తి మాత్రం కృష్ణ చూడటానికి కూడా ఇష్టపడదు. ఇప్పుడు ఏమైంది అలా చేస్తున్నావ్ అనేసి క్రిష్ అడుగుతాడు. అయితే ఈ డిస్టెన్స్ మైంటైన్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను అని సత్య అంటుంది. నేను చంపలేదని బాబు మీద ఒట్టేసి చెప్పాను కదా అయినా కూడా నా మీద నీకు నమ్మకం లేదా ఇదేనా నీ ప్రేమ అనేసి క్రిష్ అంటాడు. నేను ఎంత చెప్పినా నన్ను వదిలేసి వెళ్లావు అది నీ ప్రేమేనా అనేసి అడుగుతుంది. అందుకే ఈ డిస్టెన్స్ మైంటైన్ చేస్తే మంచిదని సత్య దూరంగా వెళ్ళిపోతుంది. క్రిష్ మాత్రం సత్యకు దగ్గర అవ్వాలని చూస్తాడు. నువ్వు ఎన్ని మాటలు చెప్పావు నువ్వు ఒక మోసగాడివి మాయగాడివి అని సత్యా కృష్ణ అంటుంది. ఎన్నికలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం నువ్వే అనేసి సత్య క్రిష్ ను తిడుతుంది. బాబు ఏం చెప్తే అది తలాడిస్తున్న గంగిరెద్దులాగా వెళ్లి చేయడం నీకు అలవాటే కదా నువ్వు అలా చేయడం వల్లే అతని ఎవరో కావాలని చంపారు లేకపోతే నువ్వే చంపావు ఎవరికి తెలుసు అని ఎద్దేవా చేస్తుంది.. అటు మైత్రి మాత్రం హర్షను ఎలాగైనా దగ్గర చేసుకోవాలని చూస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఈరోజు సంధ్య, మంజు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మన పెళ్లి విషయంలో నువ్వు తీసుకున్న ధైర్యం చూస్తుంటే నాకు ఇంకా గుండెల్లో వణుకు పుడుతుంది అనేసి సంజయ్ అంటాడు. మనిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వు వేరే వాడి వల్ల ఉండే దానివని సంజయ్ అనగానే సంధ్య కోపడుతుంది. మీ అక్క ఎమ్మెల్యే అంటే ఆమె చేతిలో పవర్ ఉంటుంది నన్ను ఏదైనా చేయాల్సి వచ్చేది కదా నేను బ్రతికిపోయాను ఎమ్మెల్యే అవ్వలేదు అనేసి అంటాడు సంజయ్.. అంతవరకు వస్తే నేను ఊరుకుంటానా నేను చూసుకుంటాను కదా అనేసి సంజయ్ అని సంధ్య అంటుంది.. అప్పుడే సంజయ్ కి రూప కాల్ చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా సంజయ్ లిఫ్ట్ చేయడు. అయితే సంధి ఉండి ఎవరో అంతగా కాల్ చేస్తున్నారు కదా లిఫ్ట్ చేసి మాట్లాడు పెళ్లయిన తర్వాత పెళ్ళాం మాట విని ఫోన్ కూడా మాట్లాడలేదు అని అనుకుంటారని అంటుంది. ఇక సంజయ్ పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతాడు. ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేసావంటే మర్చిపోయావా నన్ను అనేసి రూప అడుగుతుంది. నిన్న ఎలా మర్చిపోతాను మర్చిపోయే ఫిగర్ అనేది సంజయ్ పులిహోర కలుపుతాడు. సరేగాని నువ్వు ఎందుకు ఫోన్ చేస్తే ఎవరు చెప్పు అనేసి సంజయ్ అడిగితే నేను మీ ఇంటి బయట ఉన్నాను లోపలికి రమ్మంటావా లేదా బాల్కనీలో మాట్లాడతావా అది నీ ఇష్టం నేను బయట అయితే ఉన్నాను లోపలికి వస్తున్నాను అని అనగానే సంజయ్ భయపడుతూ బయటికి వెళ్తాడు.
ఇక మహాదేవయ్య భైరవితో పరాచకాలు ఆడుతాడు. ఏంటి ఈ మధ్య కొత్త కొత్త చీరలు కడుతున్నావు అని అనగానే ఏం లేదు పెనిమిటి నువ్వు ఎమ్మెల్యే అయితే కొత్త చీరలు కట్టుకొని నీ పక్కన తిరుగుదామని అనుకున్నాను కానీ నువ్వు ఎమ్మెల్యే అవ్వలేదు కదా చీరలు వేస్ట్ అయిపోతే అని ఇంట్లోనే కట్టుకొని తిరుగుతున్నానని భైరవి అంటుంది. ఇది విన్న అందరూ నవ్వుతారు. ఇక కృష్ణ పిలుస్తాడు అంతలోకే సంజయ్ అక్కడికి వచ్చి మహదేవయ్య కాళ్ళను మొక్కుతాడు. ఇదేంటి కొత్తగా ఎప్పుడు లెండి కాళ్ళు మొక్కుతున్నామంటే బిగ్ డాడ్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పాను కదా దానికి నాకు కాస్త డబ్బులు కావాలని చెప్పాను కదా మీరు నాకు డబ్బులు అరేంజ్ చేస్తానని చెప్పారు మరి ఇంకా డబ్బులు ఇవ్వలేదు అనేసి అడుగుతాడు. డబ్బులు కావాలని మహదేవ అంటే 10 కోట్లు కావాల్సి వస్తుంది అని సంజయ్ అంటాడు. మాట వినగానే భైరవికీ షాక్ అవుతుంది ఏదన్నా బట్టలు కావాలో లేకపోతే మీ ఆవిడ ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటే నువ్వు జ్వరంతో డబ్బులు అడుగు ఇస్తాడు కానీ ఇలాంటి 10 కోట్లు కోట్ల వ్యవహారం మీ నాన్నని అడగాలని భైరవి అంటుంది. మాట తప్పను అనేసి మహాదేవయ్య అంటాడు.. క్రిష్ అప్పుడు అక్కడికి వచ్చి ఏమైంది బాబు పిలిచావంట అని అనగానే భైరవి చురకలంటిస్తుంది. నువ్వు కూడా కాళ్ళు మొక్కుతావని నీకు కూడా 10 కోట్లు ఇద్దామని పిలిచినోళ్లే అనేసి ఎద్దేవా చేస్తుంది. ఏమైంది చెప్పు బాబు ఏంటి అంటే నువ్వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడేసి రావాలి ఒక పదిమందిని తీసుకొని వెళ్లి మాట్లాడు అప్పుడే మనకి మర్యాద ఉంటుందని మహదేవయ్య అంటాడు.
మందిని తీసుకెళ్లడం ఎందుకులే బాబు నేను ఒక్కడినే వెళ్లి సెటిల్ చేసుకొని వస్తాను గొడవలు ఎందుకు అనవసరంగా అనేసి అంటాడు. ఇక సంజయ్ రూప వస్తే ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. మా పెద్దనాన్నని నేను బిజినెస్ పెడుతున్నానని డబ్బులు ఇవ్వమని అడిగాను ఆ డబ్బులతో నీకు సెటిల్ చేస్తాను నీ సెటిల్మెంట్ అయిపోతే నేను హ్యాపీ కదా అనేసి అంటాడు. నువ్వు కావాలనే సంధ్యను పెళ్లి చేసుకున్నవా? అంత నచ్చిందా దానిలో అని రూపు అడుగుతుంది. క్రిష్ ఫోన్ మాట్లాడుతూ ఇద్దరినీ చూస్తాడు.. అది దాని పెడత మొహం అది నాకు నచ్చడం ఏంటి దాని అక్క మీద కోపంతోని నేను దాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అంతే తప్ప నేను వదిలేస్తే దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాను అనేసి పులిహోర కలుపుతాడు.. దాన్ని మెల్లగా చంపేసి నిన్ను నా ఇంట్లోకి తీసుకొస్తాను అని రూపతో అనడం క్రిష్ వెంటాడు. ఆ మాట వినగానే కోపంతో రగిలిపోయిన క్రిష్ సంజయ్ ని దారుణంగా కొడతాడు. సంధ్య నా చెల్లెలితో సమానం నీ మీద నమ్మకంతోనే నేను మీ ఇద్దరికీ పెళ్లి చేశాను సత్య ఒక వైపు చెప్తున్నా నీ గురించి అసలు నమ్మలేదు. సంధ్య కు ఏదైనా అన్యాయం చేయాలని చూసావో నీ ప్రాణం తీస్తా అని క్రిష్ బెదిరిస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇప్పుడు ఎపిసోడ్ లో సంజయ్ తన కన్న కొడుకుని భైరవికి నిజం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..