OTT Movie : హాలీవుడ్ నుంచి ఎక్కువగా యాక్షన్ సినిమాలను ఇష్టపడతారు. అయితే అక్కడ నుంచి వచ్చే ఫీల్ గుడ్ సినిమాలు, మనసును ఎక్కువగా కదిలిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో అనుకోకుండా జరిగిన ఒక ప్రమాదంలో, హీరో ఇష్టమైన వాళ్ళని వదిలి ఒక దీవిలో బ్రతకాల్సి వస్తుంది. చుట్టూ మనుషులు లేనప్పుడు, అతడు బ్రతికిన విధానం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హాలీవుడ్ మూవీ పేరు ‘కాస్ట్ అవే’ (Cast Away). ఈ సర్వైవల్ డ్రామా మూవీకి రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వం వహించి నిర్మించారు. ఇందులో టామ్ హాంక్స్, హెలెన్ హంట్, నిక్ సియర్సీ నటించారు. హాంక్స్ ఫెడెక్స్ ట్రబుల్షూటర్‌గా నటించాడు. అతను విమానం ప్రమాదంలో ఒక ద్వీపంలో చిక్కుకుపోతాడు. అతను ఇంటికి తిరిగి రావడానికి తీవ్రంగా ప్రయత్నించడంపై దృష్టి పెడతాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా $429.6 మిలియన్లు వసూలు చేసింది. హీరో 58వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో ఉత్తమ నటుడు అవార్డ్ ను గెలుచుకున్నాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
హీరో ఫెడెక్స్ అనే కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. అది ఒక కొరియర్ కంపెనీ కావడంతో, తన కింద పనిచేసే మనుషులను ఎక్కువగా మోటివేట్ చేస్తూ ఉంటాడు. సమయానికి కొరియర్ అందించే విధంగా చాలా కష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతను వేరొక ప్రదేశానికి వెళ్లాల్సి వస్తుంది. తన గర్ల్ ఫ్రెండ్ కి ఒక ఒక రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు. దానికి ఆమె అది వెడ్డింగ్ రింగ్ అనుకొని చాలా సంతోషపడుతుంది. ఆమె కూడా తనకు వారసత్వంగా వస్తున్న ఒక గిఫ్ట్ ను అతనికి ఇస్తుంది. తొందర్లో మళ్ళీ కలుస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరో విమానంలో వెళుతుండగా అనుకోకుండా ఒక ప్రమాదం జరుగుతుంది. ఆ విమానం ఒక సముద్రంలో కూలిపోతుంది. అక్కడే ఒక చిన్న దీవి ఉండటంతో హీరో బ్రతికి బయటపడతాడు. అందులో ఐదు మంది మాత్రమే ఉండగా, వాళ్ళందరూ ఈ ప్రమాదంలో చనిపోతారు. ఆ దీవిలో ఉన్న కొబ్బరి బోండాలను ఆహారంగా తీసుకుంటాడు హీరో. రెండు మూడుసార్లు బయటికి వెళ్లాలని ప్రయత్నించినా, అతని ప్రయత్నం బెడిసి కొడుతుంది. అందులోనే హీరోకి ఒక వాలీబాల్ దొరుకుతుంది. దానికి బొమ్మ షేప్ చేసి మాట్లాడుతూ ఉంటాడు.
అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత అతనికి ఒక పెద్ద రేకు కనపడుతుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడాలనుకుని, ఒక చిన్న పడవని తయారు చేస్తాడు. ఇక అందులో నుంచి బయట పడుతూ పెద్ద అలలను దాటుకొని వెళ్తాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక పెద్ద కార్గో షిప్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. ఇతన్ని చూసి కాపాడి అతని స్వస్థలానికి తీసుకువెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఇతన్ని అభినందిస్తారు. ప్రియురాలిని కలవడానికి హీరో బయలుదేరుతాడు. ఆమె ఇంటికి వెళ్ళాక ఒక నిజం తెలుస్తుంది. తన ప్రియురాలికి పెళ్లయిపోయిందని తెలిసి బాధపడతాడు. ఆమె కూడా ఇతని కోసం బాగా వెతికి, చివరికి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. హీరో ఆ తర్వాత ఎటువంటి స్టెప్ తీసుకుంటాడు? మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? మళ్లీ ఇతను జాబ్ లో బిజీ అయిపోతాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.